Sunday, 4 May 2014

భగత్‌సింగ్ నిర్దోషే?

భగత్‌సింగ్ నిర్దోషే?

Sakshi | Updated: May 05, 2014 01:29 (IST)
లాహోర్: బ్రిటిష్ అధికారి హత్య కేసులో భారత స్వాతం త్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ నిర్దోషిత్వాన్ని నిరూపించే ఓ ఆధారం బయటకొచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో భగత్‌సింగ్ పేరు లేదని వెల్లడైంది. 1928లో బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ పి సాండర్స్ హత్యకు గురికాగా, ఈ కేసులో భగత్‌సింగ్‌ను 1931లో లాహోర్‌లోని షాద్‌మాన్ చౌక్‌లో ఉరితీశారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్ కాపీని భగత్‌సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్‌ఖురేషీ కోర్టు ద్వారా సంపాదించారు.సాండర్స్ హత్యపై లాహోర్‌లోని అనార్కలి పోలీస్ స్టేషన్‌లో 1928 డిసెంబర్ 17న గుర్తు తెలియని ఇద్దరు సాయుధులపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు తేలింది. ఈ కేసును తిరిగి తెరవాలని కోరుతూ ఖురేషీ ఇప్పటికే లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Thursday, 1 May 2014

మోడీకి వ్యతిరేకంగా శంకరాచార్యులు

మోడీకి వ్యతిరేకంగా శంకరాచార్యులు

వారణాసిలో ధ్వజమెత్తనున్న అధోక్షజానంద, స్వరూపానంద సహాయకుడు 
 న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ లోక్‌సభకు పోటీ చేస్తున్న పవిత్ర వారణాసిలో ఇద్దరు శంకరాచార్యులు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. పూరీ శంకరాచార్య స్వామి అధోక్షజానంద దేవ్‌తీరథ్, ద్వారక శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి సన్నిహిత సహాయకుడు స్వామి అవిముక్తేశ్వరానందలు మోడీపై విమర్శలు సంధించనున్నారు. ‘నేను వారణాసి వెళ్లి మోడీ బండారాన్ని బయటపెడతా. అధికారంలోకి రావడానికి ప్రజలను విడదీసిన వారిని ఎండగట్టాలి’ అని అధోక్షజానంద గురువారమిక్కడ చెప్పారు. 2002 గుజరాత్ అల్లర్లకు మోడీనే కారణమని, ఆయనను వ్యతిరేకించాలని వారణాసి మత పెద్దలను కోరాతానన్నారు. తాను ఏ రాజకీయ పార్టీ తరఫునా ప్రచారం చేయనని, లౌకిక పార్టీలు గెలవాలని కోరుకుంటున్నానన్నారు. మోడీ మహాపాపి అని, న్యాయాన్ని కోరేవారు ఆయనను ఇష్టపడరన్నారు. ఆరెస్సెస్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి మతాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు. కాగా, 80వ పడిలో ఉన్న స్వరూపానంద వయోభారం, అనారోగ్య వల్ల వారణాసికి వెళ్లడం లేదని, ఆయన తరఫున ముక్తేశ్వరానంద.. మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని ఆయన సహాయకులు చెప్పారు. మోడీని చాలా కాలంగా వ్యతిరేకిస్తున్న స్వరూపానంద.. మోడీ అనుచరులు ‘హర్ హర్ మోడీ’ నినాదాన్ని వాడడంపై మండిపడడం తెలిసిందే.

బెరైడ్డికి హైకోర్టులో చుక్కెదురు

బెరైడ్డికి హైకోర్టులో చుక్కెదురు

బెరైడ్డికి హైకోర్టులో చుక్కెదురు
Sakshi | Updated: April 16, 2014 14:11 (IST)
బెరైడ్డికి హైకోర్టులో చుక్కెదురు
హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
 

హైదరాబాద్: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బెరైడ్డి రాజశేఖరరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బెరైడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న తన పార్టీ అభ్యర్థులకు అధ్యక్షుడి హోదాలో బీ ఫాం ఇవ్వాల్సి ఉన్నందున తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న బెరైడ్డి అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
పార్టీ ఉపాధ్యక్షుడు కూడా బీ ఫాం ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పగిడియాల మండలంలోని మచ్చుమర్రి గ్రామానికి చెందిన తెలుగు సాయిఈశ్వరుడు గత నెల 15న హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక బెరైడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన తండ్రి శేషశయనారెడ్డి, ఆయన సోదరుడి కుమారుడు సిద్ధార్థరెడ్డి, మరికొం దరు ఉన్నారంటూ మృతుని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ఏడుగురు నిందితులపై కర్నూలు 3వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెరైడ్డి రాజశేఖరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను జస్టిస్ రెడ్డి కాంతారావు మంగళవారం విచారించారు. బెరైడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ హత్య కేసులో పిటిషనర్ పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాల్లేవన్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కావాలనే పిటిషనర్‌ను ఈ కేసులో ఇరికించారన్నారు.
ఈ వాదనను పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోద్‌కుమార్ దేశ్‌పాండే తోసిపుచ్చారు. బెరైడ్డిపై నిర్దిష్టమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. నిజంగా ఆయన పాత్ర లేకుంటే ఈపాటికే లొంగిపోయి ఉండేవారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తి అని, ఈ ప్రభావం కేసు దర్యాప్తుపై ఉంటుందని నివేదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి... పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించారు.