Tuesday 30 April 2013

ప్రియుడి చెంప చెళ్లు!


పోలీసు స్టేషన్ కు వచ్చిన దామోదర్ లవ్వూ - గివ్వూ ఏమీ లేదంటూ కులదూషణకు దిగాడు.అక్కడితో ఆగకుండా... 'నిర్భయ యాక్టు వచ్చింది కదా ఇలాంటి వాళ్లందరూ ఇంకా రెచ్చిపోతారు. మగాడనేవాడు బయట తిరగనవసం లేదు' అంటు నోటికొచ్చినట్టు మాట్టాడుతుండగా అపర కాళిలా అతడిపై దూకింది. లాగి లెంపకాయ కొట్టింది. - : పూర్తి వివరాలు..

FIRST DOUBLE DECKER TRAIN IN SOUTH INDIA


డబుల్ డెక్కర్..సూపర్ హిట్


డబుల్ డెక్కర్ ఏసి రైలు ఐడియా సూపర్ హిట్‌ 
అయ్యింది. కూల్ కూల్ జర్నీని ప్రయాణికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రయాణికులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న చెన్నై-బెంగళూరు డబుల్ డెక్కర్ ఏసీ రైలు గురువారం పట్టాలెక్కింది. దక్షిణాదిన నడిచే తొలి డబుల్ డెక్కర్ ఇదే. ఇండియన్ రైల్వేస్ తన సంస్థ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలకోసం అన్వేషిస్తోంది.

అధిక సంఖ్యలో రైలు మార్గం ద్వారా ప్రయాణించేందుకు నూతన పద్దతులలో ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బెంగుళూరు-చెన్నై మధ్య ప్రయోగాత్మకంగా ఈ రైలును ప్రవేశపెట్టారు. అందుబాటులో ఉన్న ధరకే అద్భుత ప్రయాణ అనుభూతి కలుగుతోందని ప్రయాణికులు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు.

పది బోగీలున్న ఈ రైలులో నిత్యం 1200 మంది ప్రయాణించేందుకు అవకాశముంది. పూర్తిస్థాయి రిజర్వేషన్ సౌకర్యం ఉన్న ఈరైలు చెన్నైలో ఉదయం 7.25 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 1.30 గంటలకు బెంగళూరు చేరుతుంది. తిరిగి అక్కడి నుంచి 2.40 గంటలకు బయలుదేరి, రాత్రి 8.45 గంటలకు చెన్నైకు చేరుకుంటుంది.

ప్రయాణ చార్జీ రూ.470గా నిర్ణయించిన ఈ రైలులో తొలి రోజు చెన్నై నుంచి బెంగళూరుకు 500 మంది ప్రయాణించారు. అరక్కోణం, ఆంబూరు, జోలార్‌పేట, బంగారుపేట, కృష్ణరాజపురం, బెంగళూరు కంటోన్మెంట్‌ల మీదుగా ఇది ప్రయాణిస్తుంది. ఇందులో ఒకేసారి 12వందల మంది ప్రయాణించవచ్చు.

బోగీల్లో ఏసి చైర్ కారు సౌకర్యం ఉంది. 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలుకు జిపిఎస్ ఆధారిత సమాచార వ్యవస్థ అందుబాటులో ఉండడంతో, వచ్చే స్టేషన్ల వివరాలు, చేరుకునేందుకు పట్టే సమయం, ప్రయాణిస్తున్న వేగం ... ఇలా అన్నీ తెల్సుకోవచ్చు.

డబుల్ డెక్కర్ రైల్లో కేవలం చైర్‌కార్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. అన్ని కోచ్‌లలో ఏసీతోపాటు అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. సీట్లు కూడా విమానాల్లో మాదిరిగా ఉంటాయి. ఒక కోచ్‌లో రెండు అంతస్తుల్లో కలిపి 120 మందికి సీటింగ్ సదుపాయం ఉంటుంది. పై అంతస్తు నుంచి దిగువ అంతస్తు (కోచ్)కు వచ్చేందుకు మెట్ల మార్గం వుంటుంది. రాత్రివేళ కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆకర్షణీయమైన పసుపు రంగు అత్యాధునిక విద్యుత్ వెలుగులు ఏర్పాటుచేశారు.

10త్వరలో దేశంలోని అన్ని ప్రధాన మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ముందుగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా విశాఖ, తిరుపతి తదితర రద్దీ ఉండే ప్రాంతాలకు డబుల్ డెక్కర్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డబుల్ డెక్కర్ కోచ్‌లు త్వరలో తమకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రధానంగా విశాఖ నుంచి హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్, బెంగుళూరు, తిరుపతి మార్గాలను పరిశీలిస్తోంది. రైల్వే శాఖ ఆలోచనలు కార్యరూపం దాల్చితే ఈ ఏడాదిలో ఏదో ఒక మార్గానికి డబుల్ డెక్కర్ రైలు వచ్చే అవకాశం వుంది.

- See more at: http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=61608&subcatid=0&categoryid=28#sthash.MokLUiEu.dpuf

Arudhati husband becomes mad, because of her TV interest.


అరుంధతి TV పిచ్చితో పిచ్చివాడైన పశుపతి.    అతని మాటల్లోనే వినండి.








BOMMARILLU MOVIE REMIX WITH LOT OF FUN...

DON'T MISS IF YOU LIKE `FUN AND LAUGH' 

హాసిని , సిద్దు ల పరిచయం.

తరువాతి భాగాలకోసం...

`VIKAASAM' by YANDAMOORI VEERENDHRANAADH.















































Monday 29 April 2013

పెళ్లి మర్నాడే విడిపోయిన ఇంటర్నెట్ జంట


బికనీర్: ఇంటర్నెట్ ద్వారా ఒక్కటైన జంట, పెళ్లయిన మర్నాడే విడిపోయిన ఉదంతం రాజస్థాన్‌లో జరిగింది. బికనీర్ ప్రాంతానికి చెందిన శంకర్‌లాల్, సీమలకు ఒక వివాహ పరిచయ వెబ్‌సైట్ ద్వారా నెల్లాళ్ల కిందట పరిచయం ఏర్పడింది. బికనీర్ జిల్లాకు చెందిన శంకర్‌లాల్ అస్సాంలో వ్యాపారం చేస్తున్నాడు. సీమ తన కుటుంబ సభ్యులతో బికనీర్‌లోనే ఉంటోంది. ఇద్దరూ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ద్వారా రోజుల తరబడి చాటింగ్ కొనసాగించారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈనెల 26న ఒక దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. అంతలోనే ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. సీమ తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు వరుడు శంకర్‌లాల్‌పై అత్యాచారం కేసు పెడతామని బెదిరించడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో అతడు సీమ, ఆమె కుటుంబ సభ్యులు తనను మోసగించారంటూ డూంగేర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. అయితే, ఉభయ వర్గాలు రాజీకి రావడంతో అతడు 27న కేసు ఉపసంహరించుకున్నాడని పోలీస్‌స్టేషన్ అధికారి దినేశ్ మీనా తెలిపారు. తమ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వారిద్దరూ తమకు లిఖితపూర్వకంగా తెలిపారని చెప్పారు.

Saturday 27 April 2013

WHERE IS YOUR MONEY ?!

మీ డబ్బు ఎక్కడ ఉంది ?!





`TRISHA' HUMANITY


ANUSHKA's RUDRAMA DEVI SHOOTING BEGIN.


WE KNOW GOD !?!

                                మనకు దేవుడు తెలుసు ! 


 
  మనకు  మనం నివసించే ఈ భూగోళం గురించి సరీగా తెలీదు. సముద్ర జలాల గురించి అక్కడి ప్రాణుల గురించి సరీగా తెలీదు.మన సౌర వ్యవస్థలోని గ్రహాల గురించీ సరీగ్గా తెలీదు. ఇక గెలాక్సీల గురించీ స్పేస్ గురించీ తెలిసిందీ అంతంత మాత్రమే. ఈ సృష్టి ఎప్పుడు, ఎలా పుట్టిందీ సరైన అవగాహన లేదు.
       అసలు మన శరీర భాగాల గురించి, అవి పని చేసే తీరు గురించి సంపూర్ణంగా తెలియదు. మన తాత, ముత్తాతలెవరో తెలీదు.
       అసలు మనకు సృష్టి లోని ఏ విషయమూ సరీగ్గా తెలీదు.
       అయినా ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు. అది దేవుడు.
       అవును, ఈ సృష్టి గురించి మనకు సరీగ్గా తెలీదు గానీ, విచిత్రంగా సృష్టి కర్త గురించి మాత్రం బాగా తెలుసు.!?!
         
      ఈ సృష్టికర్త లేక దేవుడు ఎవరో,ఆయన పేరేమిటో,ఎలా ఉంటాడో, ఆయనకు ఏది ఇష్టమో, ఏది ఇష్టం కాదో తెలుసు.!?
      ఆయన్ను ఎలా పూజించాలో, ఎలా ప్రార్ధించాలో, ఎలా నమాజ్ చేయాలో  బాగా తెలుసు.!?
       మనం నమ్మిన విధానం మనం పాటించక పోయినా,  మన తోటి మనుష్యులు పాటించేలా వారిని ఎలా ఒత్తిడి చేయాలో తెలుసు.
       ఆ దారి లోకి రాని వారి మీద దౌర్జన్యం చేయడమెలాగో ఇంకా బాగా తెలుసు.
            దేవుని పేరున కొట్టుకు ఛావడం, చంపడం చాలా బాగా తెలుసు.
                      దేవుడు సంతోషించును గాక !

Friday 26 April 2013

తీవ్ర పరిస్థితుల్లోనూ ఐన్‌స్టీన్ సిద్ధాంతం కరక్టే!

వాషింగ్టన్: విశ్వంలో గురుత్వాకర్షణ శక్తిని వివరిస్తూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ వర్తిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమికి సుమారు 7 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘పీఎస్‌ఆర్ జే0348+0432’ అనే ద్వినక్షత్ర వ్యవస్థపై జరిపిన అధ్యయనంలో ఈ మేరకు ఐన్‌స్టీన్ సిద్ధాంతం తీవ్ర పరిస్థితుల్లోనూ కరక్టేనని గుర్తించారు. పీఎస్‌ఆర్ ద్వినక్షత్ర వ్యవస్థలో మన సూర్యుడి కంటే రెండు రెట్లు పెద్దగా ఉన్న నక్షత్రం, దానికి సమీపంలోని మరో చిన్న నక్షత్రం ప్రతి రెండున్నర గంటలకోసారి పరస్పరం ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నాయని అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌కు చెందిన గ్రీన్ బ్యాంక్ టెలిస్కోపు, ఇతర టెలిస్కోపుల ద్వారా గుర్తించారు. తర్వాత వీటిపై అధ్యయనంలో వెల్లడైన ఫలితాలను బట్టి... ఈ వ్యవస్థకు కూడా ఐన్‌స్టీన్ సిద్ధాంతం వర్తిస్తుందని కనుగొన్నారు. ఐన్‌స్టీన్ 1915లో ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం ఇలాంటి తీవ్ర ప్రతి కూల పరిస్థితులకు వర్తించదని కొందరు శాస్త్రవేత్తలు ఇంతకుముందు ఊహిం చారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ సిద్ధాంతం వర్తిస్తుందని తాజాగా గుర్తిం చారు. దీంతో ఐన్‌స్టీన్ సిద్ధాంతానికి ఇప్పటిదాకా ఎదురైన అతిపెద్ద పరీక్ష ఇదేన ని, ఈ పరీక్షనూ ఆ సిద్ధాంతం గట్టెక్కిందని జర్మనీ పరిశోధకులు అంటున్నారు. 

తెనాలి ఘటనపై డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

కుమార్తెను లైంగిక వేధింపుల నుంచి రక్షించుకునే ప్రయత్నంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బెతాన సునీల.. ప్రాణాలు కోల్పోయిన ఘటన పై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించిన కమిషన్.. ఆంధ్రప్రదేశ్ డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీలకు శుక్రవారం నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తాగుబోతులను సునీల నెట్టివేయడంతో వారు ఆమెను లారీ కిందకు తోసి చంపిన సంగతి తెలిసిందే. 

USHA SRI BHARATAM, RAMAYANAM.



ఉషశ్రీ పురాణ ప్రవచనము.

  ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చేమో గాని, భారత, రామాయణ గాథలను వివరించడం లో ఉషశ్రీ గారి ప్రత్యేకతే వేరు. ఆయన చెప్పే విధానం, వివరించే ధర్మ సందేహాలు విని తీరవలసిందే గాని మాటల్లో చెప్పలేం.
 ఇప్పటి వారి కోసం ఆ మాథుర్యాన్ని మళ్ళీ పరిచయం చేస్తున్నాం.

Monday 22 April 2013

MURDER CASE BOOKED ON TDP CORPORATOR.

చంపాపేట టీడీపీ కార్పోరేట్‌ర్‌పై మర్డర్ కేసు


హైదరాబాద్: చంపాపేట కార్పోరేటర్ సామ రమణారెడ్డిపై హత్య కేసు నమోదైంది. ఏడేళ్ల క్రితం నర్సింగ్‌రావు అనుమానాస్పద మృతికి సంబంధించి కార్పోరేటర్‌తో సహా మరో ఇద్దరిపై నమోదైన హత్య కేసును పోలీసులు తిరిగి తెరిచారు. మద్యం మత్తులో నర్సింగ్‌రావు బిల్డింగ్‌పై నుంచి పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించి కేసును మూసి వేశారు. కాగా పోలీసు దర్యాప్తు వివరాలతో ఫోరెనిక్స్ సభ్యులు అప్పట్లోనే విభేదించారు. నర్సింగ్‌రావు కుటుంబం చంపాపేట కార్పోరేటర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పదే పదే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు.

NAGA CHAITANYA AND SUNIL'S MOVIE NAMED AS `TADAKHA'

చైతన్య, సునీల్  కలిసి నటిస్తున్న సినిమా పేరు 'తడాఖా`. 

తమన్నా, ఆండ్రియానా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.





Mr. HARI KRISHNA READY TO CONTEST FROM GANNAVARAM CONSTITUTION.

 

SUPREEM COURT EX JUDGE Mr. VARMA NO MORE.

India
ఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వర్మ(80) సోమవారం కన్నుమూశారు. నిర్భయ ముసాయిదా చట్టానికి పని చేసిన ఆయన గుర్గావ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గతంలో మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా వర్మ పని చేశారు.

GOPI CHAND'S NEW COWBOY MOVIE `SAAHASAM'

గోపిచంద్ కొత్త సినిమా ' సాహసం'  

                                                                                          గోపిచంద్ కొత్త సినిమా ' సాహసం' కౌ బాయ్ చిత్రం గా రాబోతుంది.గత  చిత్రాల విధంగానే నిధి వేట నేపధ్యం లోనే ఈ చిత్రం కూడా ఉంటుంది.







Aditi Chengappa agree to play a role in movie `RANI RUDRAMA'

రాణి రుద్రమ' సినిమా లో అదితి చెంగప్ప.


రాణి రుద్రమ' సినిమా లో రాణి రుద్రమ చెల్లెలి పాత్రకు 
అదితి చెంగప్ప సెలెక్ట్ అయింది.
గుణశేఖర్ డైరెక్ట్ ఈసినిమా లో రాణి రుద్రమ పాత్ర అనుష్క చేస్తున్న విషయం తెలిసిందే.
ఇతర పాత్ర ల్లో రానా, కృష్ణంరాజు. ప్రకాష్ రాజు,  హంస నందిని తదితరులు నటిస్తున్నారు.