Saturday 27 April 2013

WE KNOW GOD !?!

                                మనకు దేవుడు తెలుసు ! 


 
  మనకు  మనం నివసించే ఈ భూగోళం గురించి సరీగా తెలీదు. సముద్ర జలాల గురించి అక్కడి ప్రాణుల గురించి సరీగా తెలీదు.మన సౌర వ్యవస్థలోని గ్రహాల గురించీ సరీగ్గా తెలీదు. ఇక గెలాక్సీల గురించీ స్పేస్ గురించీ తెలిసిందీ అంతంత మాత్రమే. ఈ సృష్టి ఎప్పుడు, ఎలా పుట్టిందీ సరైన అవగాహన లేదు.
       అసలు మన శరీర భాగాల గురించి, అవి పని చేసే తీరు గురించి సంపూర్ణంగా తెలియదు. మన తాత, ముత్తాతలెవరో తెలీదు.
       అసలు మనకు సృష్టి లోని ఏ విషయమూ సరీగ్గా తెలీదు.
       అయినా ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు. అది దేవుడు.
       అవును, ఈ సృష్టి గురించి మనకు సరీగ్గా తెలీదు గానీ, విచిత్రంగా సృష్టి కర్త గురించి మాత్రం బాగా తెలుసు.!?!
         
      ఈ సృష్టికర్త లేక దేవుడు ఎవరో,ఆయన పేరేమిటో,ఎలా ఉంటాడో, ఆయనకు ఏది ఇష్టమో, ఏది ఇష్టం కాదో తెలుసు.!?
      ఆయన్ను ఎలా పూజించాలో, ఎలా ప్రార్ధించాలో, ఎలా నమాజ్ చేయాలో  బాగా తెలుసు.!?
       మనం నమ్మిన విధానం మనం పాటించక పోయినా,  మన తోటి మనుష్యులు పాటించేలా వారిని ఎలా ఒత్తిడి చేయాలో తెలుసు.
       ఆ దారి లోకి రాని వారి మీద దౌర్జన్యం చేయడమెలాగో ఇంకా బాగా తెలుసు.
            దేవుని పేరున కొట్టుకు ఛావడం, చంపడం చాలా బాగా తెలుసు.
                      దేవుడు సంతోషించును గాక !

No comments:

Post a Comment