Tuesday, 30 April 2013
ప్రియుడి చెంప చెళ్లు!
FIRST DOUBLE DECKER TRAIN IN SOUTH INDIA
డబుల్ డెక్కర్..సూపర్ హిట్
అయ్యింది. కూల్ కూల్ జర్నీని ప్రయాణికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రయాణికులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న చెన్నై-బెంగళూరు డబుల్ డెక్కర్ ఏసీ రైలు గురువారం పట్టాలెక్కింది. దక్షిణాదిన నడిచే తొలి డబుల్ డెక్కర్ ఇదే. ఇండియన్ రైల్వేస్ తన సంస్థ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలకోసం అన్వేషిస్తోంది.
అధిక సంఖ్యలో రైలు మార్గం ద్వారా ప్రయాణించేందుకు నూతన పద్దతులలో ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బెంగుళూరు-చెన్నై మధ్య ప్రయోగాత్మకంగా ఈ రైలును ప్రవేశపెట్టారు. అందుబాటులో ఉన్న ధరకే అద్భుత ప్రయాణ అనుభూతి కలుగుతోందని ప్రయాణికులు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రయాణ చార్జీ రూ.470గా నిర్ణయించిన ఈ రైలులో తొలి రోజు చెన్నై నుంచి బెంగళూరుకు 500 మంది ప్రయాణించారు. అరక్కోణం, ఆంబూరు, జోలార్‌పేట, బంగారుపేట, కృష్ణరాజపురం, బెంగళూరు కంటోన్మెంట్‌ల మీదుగా ఇది ప్రయాణిస్తుంది. ఇందులో ఒకేసారి 12వందల మంది ప్రయాణించవచ్చు. డబుల్ డెక్కర్ రైల్లో కేవలం చైర్‌కార్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. అన్ని కోచ్‌లలో ఏసీతోపాటు అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. సీట్లు కూడా విమానాల్లో మాదిరిగా ఉంటాయి. ఒక కోచ్‌లో రెండు అంతస్తుల్లో కలిపి 120 మందికి సీటింగ్ సదుపాయం ఉంటుంది. పై అంతస్తు నుంచి దిగువ అంతస్తు (కోచ్)కు వచ్చేందుకు మెట్ల మార్గం వుంటుంది. రాత్రివేళ కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆకర్షణీయమైన పసుపు రంగు అత్యాధునిక విద్యుత్ వెలుగులు ఏర్పాటుచేశారు. డబుల్ డెక్కర్ కోచ్‌లు త్వరలో తమకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రధానంగా విశాఖ నుంచి హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్, బెంగుళూరు, తిరుపతి మార్గాలను పరిశీలిస్తోంది. రైల్వే శాఖ ఆలోచనలు కార్యరూపం దాల్చితే ఈ ఏడాదిలో ఏదో ఒక మార్గానికి డబుల్ డెక్కర్ రైలు వచ్చే అవకాశం వుంది. |
BOMMARILLU MOVIE REMIX WITH LOT OF FUN...
DON'T MISS IF YOU LIKE `FUN AND LAUGH'
హాసిని , సిద్దు ల పరిచయం.
తరువాతి భాగాలకోసం...
Monday, 29 April 2013
పెళ్లి మర్నాడే విడిపోయిన ఇంటర్నెట్ జంట
బికనీర్: ఇంటర్నెట్ ద్వారా ఒక్కటైన జంట, పెళ్లయిన మర్నాడే విడిపోయిన ఉదంతం రాజస్థాన్‌లో జరిగింది. బికనీర్ ప్రాంతానికి చెందిన శంకర్‌లాల్, సీమలకు ఒక వివాహ పరిచయ వెబ్‌సైట్ ద్వారా నెల్లాళ్ల కిందట పరిచయం ఏర్పడింది. బికనీర్ జిల్లాకు చెందిన శంకర్‌లాల్ అస్సాంలో వ్యాపారం చేస్తున్నాడు. సీమ తన కుటుంబ సభ్యులతో బికనీర్‌లోనే ఉంటోంది. ఇద్దరూ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ద్వారా రోజుల తరబడి చాటింగ్ కొనసాగించారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈనెల 26న ఒక దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. అంతలోనే ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. సీమ తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు వరుడు శంకర్‌లాల్‌పై అత్యాచారం కేసు పెడతామని బెదిరించడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో అతడు సీమ, ఆమె కుటుంబ సభ్యులు తనను మోసగించారంటూ డూంగేర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. అయితే, ఉభయ వర్గాలు రాజీకి రావడంతో అతడు 27న కేసు ఉపసంహరించుకున్నాడని పోలీస్‌స్టేషన్ అధికారి దినేశ్ మీనా తెలిపారు. తమ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వారిద్దరూ తమకు లిఖితపూర్వకంగా తెలిపారని చెప్పారు.
Saturday, 27 April 2013
WE KNOW GOD !?!
మనకు దేవుడు తెలుసు !
మనకు మనం నివసించే ఈ భూగోళం గురించి సరీగా తెలీదు. సముద్ర జలాల గురించి అక్కడి ప్రాణుల గురించి సరీగా తెలీదు.మన సౌర వ్యవస్థలోని గ్రహాల గురించీ సరీగ్గా తెలీదు. ఇక గెలాక్సీల గురించీ స్పేస్ గురించీ తెలిసిందీ అంతంత మాత్రమే. ఈ సృష్టి ఎప్పుడు, ఎలా పుట్టిందీ సరైన అవగాహన లేదు.
అసలు మన శరీర భాగాల గురించి, అవి పని చేసే తీరు గురించి సంపూర్ణంగా తెలియదు. మన తాత, ముత్తాతలెవరో తెలీదు.
అసలు మనకు సృష్టి లోని ఏ విషయమూ సరీగ్గా తెలీదు.
అయినా ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు. అది దేవుడు.
అవును, ఈ సృష్టి గురించి మనకు సరీగ్గా తెలీదు గానీ, విచిత్రంగా సృష్టి కర్త గురించి మాత్రం బాగా తెలుసు.!?!
ఈ సృష్టికర్త లేక దేవుడు ఎవరో,ఆయన పేరేమిటో,ఎలా ఉంటాడో, ఆయనకు ఏది ఇష్టమో, ఏది ఇష్టం కాదో తెలుసు.!?
ఆయన్ను ఎలా పూజించాలో, ఎలా ప్రార్ధించాలో, ఎలా నమాజ్ చేయాలో బాగా తెలుసు.!?
మనం నమ్మిన విధానం మనం పాటించక పోయినా, మన తోటి మనుష్యులు పాటించేలా వారిని ఎలా ఒత్తిడి చేయాలో తెలుసు.
ఆ దారి లోకి రాని వారి మీద దౌర్జన్యం చేయడమెలాగో ఇంకా బాగా తెలుసు.
దేవుని పేరున కొట్టుకు ఛావడం, చంపడం చాలా బాగా తెలుసు.
దేవుడు సంతోషించును గాక !
Friday, 26 April 2013
తీవ్ర పరిస్థితుల్లోనూ ఐన్‌స్టీన్ సిద్ధాంతం కరక్టే!
వాషింగ్టన్: విశ్వంలో గురుత్వాకర్షణ శక్తిని వివరిస్తూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ వర్తిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమికి సుమారు 7 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘పీఎస్‌ఆర్ జే0348+0432’ అనే ద్వినక్షత్ర వ్యవస్థపై జరిపిన అధ్యయనంలో ఈ మేరకు ఐన్‌స్టీన్ సిద్ధాంతం తీవ్ర పరిస్థితుల్లోనూ కరక్టేనని గుర్తించారు. పీఎస్‌ఆర్ ద్వినక్షత్ర వ్యవస్థలో మన సూర్యుడి కంటే రెండు రెట్లు పెద్దగా ఉన్న నక్షత్రం, దానికి సమీపంలోని మరో చిన్న నక్షత్రం ప్రతి రెండున్నర గంటలకోసారి పరస్పరం ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నాయని అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌కు చెందిన గ్రీన్ బ్యాంక్ టెలిస్కోపు, ఇతర టెలిస్కోపుల ద్వారా గుర్తించారు. తర్వాత వీటిపై అధ్యయనంలో వెల్లడైన ఫలితాలను బట్టి... ఈ వ్యవస్థకు కూడా ఐన్‌స్టీన్ సిద్ధాంతం వర్తిస్తుందని కనుగొన్నారు. ఐన్‌స్టీన్ 1915లో ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం ఇలాంటి తీవ్ర ప్రతి కూల పరిస్థితులకు వర్తించదని కొందరు శాస్త్రవేత్తలు ఇంతకుముందు ఊహిం చారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ సిద్ధాంతం వర్తిస్తుందని తాజాగా గుర్తిం చారు. దీంతో ఐన్‌స్టీన్ సిద్ధాంతానికి ఇప్పటిదాకా ఎదురైన అతిపెద్ద పరీక్ష ఇదేన ని, ఈ పరీక్షనూ ఆ సిద్ధాంతం గట్టెక్కిందని జర్మనీ పరిశోధకులు అంటున్నారు.
తెనాలి ఘటనపై డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు
కుమార్తెను లైంగిక వేధింపుల నుంచి రక్షించుకునే ప్రయత్నంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బెతాన సునీల.. ప్రాణాలు కోల్పోయిన ఘటన పై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించిన కమిషన్.. ఆంధ్రప్రదేశ్ డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీలకు శుక్రవారం నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తాగుబోతులను సునీల నెట్టివేయడంతో వారు ఆమెను లారీ కిందకు తోసి చంపిన సంగతి తెలిసిందే.
USHA SRI BHARATAM, RAMAYANAM.
ఉషశ్రీ పురాణ ప్రవచనము.
ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చేమో గాని, భారత, రామాయణ గాథలను వివరించడం లో ఉషశ్రీ గారి ప్రత్యేకతే వేరు. ఆయన చెప్పే విధానం, వివరించే ధర్మ సందేహాలు విని తీరవలసిందే గాని మాటల్లో చెప్పలేం.
ఇప్పటి వారి కోసం ఆ మాథుర్యాన్ని మళ్ళీ పరిచయం చేస్తున్నాం.
Categories
- Srimad Bhagavadgita (1047)
- Srimad Bhagavatham (960)
- Srimad Ramayanam (641)
- Sri Devi (513)
- Thiruppavai (431)
- Lord Shiva (358)
- Sri Mahabharatham (351)
- Srivaishnava Scriptures (335)
- Lord Vishnu (277)
- Harikatha (242)
- Dharma Sandehalu (210)
- Adi Shankaracharya (190)
- Vedas (185)
- Upanishads (157)
- Ramana Maharshi (109)
- Others (105)
- Sanathana Dharmam (71)
- Punya Kshetras (70)
- Undrajavaram Mahabharatam(66)
- Puranas (60)
- Bhagavatham Undrajavaram(58)
- Janapada Charitralu (32)
- Festivals (20)
- Srimad Ramanuja Charya (19)
- Bhakthi (6)
- Sahitya Pravachanas (5)
- Lord Ganesh (4)
- Bhaktha Charitra (4)
- Selfdev Talks (2)
Monday, 22 April 2013
MURDER CASE BOOKED ON TDP CORPORATOR.
చంపాపేట టీడీపీ కార్పోరేట్‌ర్‌పై మర్డర్ కేసు
హైదరాబాద్: చంపాపేట కార్పోరేటర్ సామ రమణారెడ్డిపై హత్య కేసు నమోదైంది. ఏడేళ్ల క్రితం నర్సింగ్‌రావు అనుమానాస్పద మృతికి సంబంధించి కార్పోరేటర్‌తో సహా మరో ఇద్దరిపై నమోదైన హత్య కేసును పోలీసులు తిరిగి తెరిచారు. మద్యం మత్తులో నర్సింగ్‌రావు బిల్డింగ్‌పై నుంచి పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించి కేసును మూసి వేశారు. కాగా పోలీసు దర్యాప్తు వివరాలతో ఫోరెనిక్స్ సభ్యులు అప్పట్లోనే విభేదించారు. నర్సింగ్‌రావు కుటుంబం చంపాపేట కార్పోరేటర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పదే పదే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు.
SUPREEM COURT EX JUDGE Mr. VARMA NO MORE.
ఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వర్మ(80) సోమవారం కన్నుమూశారు. నిర్భయ ముసాయిదా చట్టానికి పని చేసిన ఆయన గుర్గావ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గతంలో మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా వర్మ పని చేశారు.
|
GOPI CHAND'S NEW COWBOY MOVIE `SAAHASAM'
గోపిచంద్ కొత్త సినిమా ' సాహసం'
గోపిచంద్ కొత్త సినిమా ' సాహసం' కౌ బాయ్ చిత్రం గా రాబోతుంది.గత చిత్రాల విధంగానే నిధి వేట నేపధ్యం లోనే ఈ చిత్రం కూడా ఉంటుంది.
Subscribe to:
Comments (Atom)












