Wednesday 30 October 2013

MANAKU TELIYANI KREESTU JEEVITAM _ Osho

  మనకు తెలియని క్రీస్తు జీవితం.- ఓషో.  
OSHO
ప్రశ్న:    జీసస్ కు జ్ఞానోదయం అయిందా .?
ఓషో:    అయింది.   ఆయన సంపూర్ణంగా జ్ఞానోదయం పొందిన వాడు. అయితే అసలు జ్ఞానోదయం అంటే ఏమిటో తెలియని మనుషుల మధ్య ఆయన జీవించాడు. అందుకే ఆయన అలాంటి భాషలోనే మాట్లాడవలసి వచ్చింది. ఆ భాషే ఆయనకు జ్ఞానోదయం కలగలేదేమో నన్న అభిప్రాయాన్ని కలుగ జేసింది. ఆయన ఆ భాషనే వాడవలసి వచ్చింది. అంతకంటే మరో అవకాశం లేదాయనకు.
          ఒక బుద్దుడు మాట్లాడితే, అది పూర్తిగా వేరే భాషలో ఉంటుంది. అతడు నేను దేవుని కుమారుడినిఅని చెప్పలేడు. అతడలా చెప్పలేడు. ఎందుకంటే తండ్రి, కొడుకు  అనే బంధాలన్నీ అర్ధంలేని విషయాలు. కాని జీసస్ కు మరో భాషను వాడడం అసాధ్యం. ఆయన మాట్లాడిన చోట మనుషులు ఈ భాషను మాత్రమే అర్ధం చేసుకోగలరు. అందుకే భాష మారుతుంది. గౌతమ బుద్దుడు వేరే భాషలో మాట్లాడతాడు. ఎందుకంటే అతడి చుట్టూ ఉన్న మనుషులు వేరు.

          నిజానికి జీసస్ చాలా విషయాలలో బుద్దుడిలా ఉంటాడు.           


జీసస్, 30 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడో క్రిస్టియన్ మతానికే తెలియదు. ఆయన తన 13 వ ఏట బైబిల్ లో కనిపిస్తాడు. తరువాత తన 30 వ ఏట శిలువ వేయబడతాడు. అంతే. కేవలం 3 సంవత్సరాల అతడి  జీవితం మాత్రమే తెలుసు. కేవలం అతడి జీవితంలో ఒకటి, రెండు సందర్భాలు  తెలుసు. ఒకటి అతడు పుట్టినప్పుడు. క్రీస్తు పుట్టుక అందరికి తెలుసు. రెండవది, అతడి 7  సంవత్సరాల వయస్సులో పెద్ద గుడిలో జరిగే పండుగకు రావడం. ఈ రెండు సంఘటనలు మాత్రమే తెలుసు. తరువాత, ప్రవక్తగా అతడు గడిపిన మూడు  సంవత్సరాలు తెలుసు.
           అయితే, దీని గురించి భారత దేశంలో చాలా సమాచారం ఉంది. ఆయన గురించి ఏమీ తెలియని ఆ కాలంలో, ఆయన కాశ్మీర్ లో ఉన్నారు, - ఒక బౌద్ద ఆరామంలో ఆ సమాచారం ఉంది. అంతే కాదు, ఆయన అక్కడ ఉన్నట్టు జానపద కథలు కూడా ఉన్నాయి. అతడు, అప్పుడు బౌద్ద భిక్షువు గా, అన్ని సంవత్సరాలు ధ్యానంలో గడిపాడు. తరువాత, అకస్మాత్తుగా జెరూసలేము లో, అతడి 30 వ ఏట ప్రత్యక్షమయ్యాడు. శిలువ వేయబడ్డాడు. అతడు తిరిగి లేచాడన్న కథ క్రిస్టియన్ ల దగ్గర ఉంది. కాని, ఆయన తిరిగి లేచిన తరువాత, ఎక్కడికి మాయమయ్యాడు? ఈ విషయంలో క్రిస్టియన్ ల సమాధానం లేదు. అతడెక్కడికి వెళ్ళాడు? అతడు సహజ మరణాన్ని ఎప్పుడు పొందాడు?
          ఒక ఫ్రెంఛ్ రచయిత, తన పుస్తకం  ‘The serpent of paradise’ లో- జీసస్ బోధించడం మొదలు పెట్టేంత వరకు, తన 30 వ సంవత్సరం వయస్సు వరకు ఎక్కడ జీవించాడో ఎవరికీ తెలియదు. ఒక కథ అయితే ఉంది. ఆ కథ ప్రకారం అతడు కాశ్మీర్ లో ఉన్నాడు. కాశ్మీర్ అసలైన పేరు, కా అంటే, అలాంటిదే’, ‘శిర్ అంటే సిరియా,- ‘సిరియా వంటి దేశం అని అర్థం.
                అలగే రష్యా యాత్రికుడు నికోలస్ నటోవిచ్1887 సం// ము లో  భారత దేశం వచ్చినప్పుడు లడఖ్ వెళ్ళాడు. అక్కడ ఆయన అనారోగ్య కారణంగా చాలా రోజులు హెమిస్ గుంపాలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి రోజులలో ఆయన అనేక బౌద్ద రచనలను, శాస్త్రాలను చదివాడు. ఆ  రచనలలో ఆయన, జీసస్ అక్కడికి రావడం గురించి అనేక విషయాలను తెలుసుకున్నాడు. అయన ఆ సాహిత్యంలో జీసస్ ను గురించి, ఆయన బోధనల గురించి అనేకసార్లు ప్రస్తావించడాన్ని గుర్తించాడు. తరువాత ఆయన  ‘Life of Saint Jesus’  అనే పుస్తకాన్ని ప్రచురించాడు. అందులో ఆయన, జీసస్ లడఖ్ మరియు ఇతర తూర్పు దేశాలలో గడిపిన అనేక విషయాలను పేర్కొన్నాడు.
            జీసస్ లడఖ్ నుండి, ఎత్తయిన పర్వతాల గుండా మంచు దారులను, అగాధాలను దాటుకుని, కాశ్మీర్ లోని, పహల్గావ్ (గొర్రెల కాపరి గ్రామం) చేరాడని రాయబడి ఉంది. అతడు పహల్గావ్ లో చాలా కాలం తన గొర్రెల గుంపుతో కలిసి జీవించాడు. ఇక్కడే జీసస్ ఇజ్రయేల్ నుండి తప్పిపోయిన యూదుల గుంపు యొక్క ఆనవాళ్ళను కనిపెట్టాడు.
          ఈ గ్రామానికి, జీసస్ తదనంతరం పహల్గావ్ అని ఆయన జ్ఞాపకార్ధం పేరు పెట్టారని చెప్పబడింది. కాశ్మీరీ భాష లో పహల్అంటే గొర్రెల కాపరి, గావ్అంటే గ్రామంఅని అర్ధం. తరువాత జీసస్ శ్రీనగర్ వెళ్తూ దారిలో ఇష్ముక్యుమ్అన్న గ్రామంలో విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడ కూడా అతడు బోధించడం జరిగింది. ఆ గ్రామానికి కూడా అతని జ్ఞాపకార్థం పేరు పెట్టారు. ఇష్ముక్యుమ్ (Ishmuquam ) అంటే జీసస్ విశ్రాంతి ప్రదేశం అని అర్థం.
          జీసస్ శిలువ మీద ఉన్నప్పుడు ఒక సైనికుడు, అతడి శరీరాన్ని పొడిచాడు. అప్పుడు రక్తం, నీరు అతడి శరీరం నుండి కారింది. ఈ సంఘటన సెయింట్ జాన్ గాస్పెల్, 19 వ అధ్యాయం, 34 వ వచనంలో చెప్పబడింది.  : కాని సైనికులలో ఒకరు శూలంతో అతడిని ఒక పక్క గుచ్చాడు, అప్పుడు అక్కడి నుండి రక్తము, నీరు బయటికి వచ్చింది. : ఈ సంఘటన వల్ల జీసస్ శిలువ మీద జీవించే ఉన్నాడన్న విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే చనిపోయిన శరీరం నుండి రక్తం ప్రవహించదు.      
        జీసస్ మళ్ళీ చనిపోయి ఉండాలి.శిలువ వేయడం పూర్తయ్యి జీసస్ చనిపోయి ఉంటే అప్పుడు – క్రిస్టియానిటి చనిపోవాలి. ఎందుకంటే మొత్తం క్రిస్టియన్ మతం క్రీస్తు తిరిగి లేవడం మీదే ఆధారపడి ఉంది. – కానీ అతడు తిరిగి లేచాడు. అదొక అద్భుతం అయ్యింది. అది అలా అయి ఉండి తీరాలి. అలా లేకపోతే, యూదులు అతడిని ప్రవక్తగా నమ్మరు.ఎందుకంటే, - రాబోయే క్రీస్తు శిలువ వేయ బడతాడు, తరువాత అతడు తిరిగి లేస్తాడు -అని చెప్పబడింది.
అందుకే అలాగే జరిగే సందర్భం కోసం వారు ఎదురు చూశారు. అతడు కనిపించాడు. అతడి శరీరం గుహలో నుండి మాయమయింది. తరువాత కొందరు కొత్త శరీరంతో అతడిని చూశారు. కనీసం 8 మంది అతడిని చూశారు.తరువాత మళ్ళీ అతడు మాయమయ్యాడు. క్రిస్టియానిటీలో అతడు మళ్ళీ ఎప్పుడు చనిపోయాడో [u1] తెలిపే ఏ ఆధారమూ లేదు.
            అయితే జీసస్ మళ్ళీ కాశ్మీర్ వచ్చి, అక్కడ అతడు తన 112 సంవత్సరాల వయస్సు వరకూ బ్రతికి, కాశ్మీర్ లోనే మరణించాడు. అదే ప్రాంతంలో, ఎక్కడయితే జీసస్ జీవించి, మరణించాడో అక్కడే మనకొక పట్టణం ఉంది.





[u1]డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళాడని భావిస్తుంన్నప్పుడు, మళ్ళీ చనిపోవడం అనేది అర్థం లేని ఆలోచన. -bloger-]

ప్రశ్న : జీసస్ కాశ్మీర్ లో మారు పేరుతో జీవించాడా ?
 ఓషో :  లేదు.మారు పేరుతో కాదు. నిజానికి మీరతడిని జీసస్ అని పిలుస్తున్నారు, కాని అరబ్ ప్రపచం  అతడిని  ఏసస్ – ఏసు (Esus – Esau) అని పిలుస్తారు. కాశ్మీర్ లో అతడిని యూసా-అసఫ్ (Yousa-Asaf) అని పిలిచే వారు. అతడి సమాధి మీద యూసా అసఫ్ – ఎవరైతే చాలా దూర ప్రాంతం నుండి వచ్చి యిక్కడ జీవించాడో- అతడి సమాధిగా చెక్కబడింది. అలాగే అతడు అక్కడికి 1900సం// ముల క్రితం వచ్చినట్టుగా కూడా తెలుపబడింది.
           Serpent of Paradise రచయిత జీసస్ సమాధిని చూసి ఇలా చెప్పాడు. నేను సమాధి దగ్గరికి చేరేసరికి సాయంత్రం అయింది. ఆ సంధ్య వెలుగులో ఆ వీధిలోని మనుషుల, పిల్లల మొహాలు ఎంతో పవిత్రంగా  కనిపించాయి. వారు అతి ప్రాచీన కాలపు వ్యక్తుల్లా ఉన్నారు. బహుశా వారు ఇజ్రాయిల్ నుండి, భారత దేశానికి వలస వచ్చిన యూదు గుంపుకు సంబంధించిన వారై ఉండవచ్చు. నేను నా బూట్లను వదిలి, లోపలికి ప్రవేశించాను. అది చాలా పాత సమాధి. చుట్టూ అందమైన రాళ్ళ కంచె ఉంది. పక్కనే రాతితో చెక్కబడిన పాద ముద్ర ఉంది. అది, యూసా అసఫ్ పాదముద్రగా చెప్పబడింది. అక్కడి చరిత్ర ప్రకారం యూసా అసఫే, జీసస్. ఆ ఇంటి గోడమీద ఒక శిలా ఫలకం వేలాడుతూ ఉంది. దాని మీద ఏదో భాషలో వ్రాసి ఉంది. దాని కిందే దానికి ఇంగ్లీష్ అనువాదం యూసా-అసఫ్ఖన్యార్, శ్రీనగర్. అని ఉంది.
            ఆ స్థలం, ఆ సమాధి  అన్నీ యూదు సంప్రదాయానికి సంబంధించినవే. భారత దేశంలో అలాంటి సమాధి మరెక్కడా లేదు.ఆ కట్టడం యూదు జాతికి సంబంధించినదే. దానిపై రాసిన సమాచారం కూడా హిబ్రూలోనే ఉంది.
                జీసస్ పూర్తిగా జ్ఞానోదయం అయిన వాడు. మరణంనుండి తిరిగి లేవడం మూఢ క్రిస్టియన్ లకు, ఒక అద్భుతంగా, అసాధ్యంగా కనిపిస్తుంది. అయితే యోగతో అది అసాధ్యం కాదు. యోగ మరణించి, తిరిగి లేవడాన్ని నమ్ముతుంది. అదుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఎలా అంటే, మనిషి నజంగా చనిపోకుంగానే, పూర్తిగా చనిపోగలడు. గుండె ఆగిపోతుంది, నాడి కొట్టుకోవడం ఆగి పోతుంది, శ్వాస ఆగిపోతుంది. యోగలో దానికో పద్దతి ఉంది. మనకు తెలిసి, జీసస్ ను శిలువ వేసినప్పుడు, ఆయన ఈ యోగ ప్రక్రియను చాలా లోతుగా అనుసరించాడు. ఎవరైనా నిజంగా చనిపోతే, తిరిగి లేవడం అసాధ్యం.

             శిలువ వేసిన వారు, అతడు చనిపోయాడని అనుకున్నప్పుడు, వారు అతడి శరీరాన్ని క్రిందకు దించి, అతని అనుచరులకు ఇవ్వడం జరిగింది. తరువాత, సంప్రదాయం ప్రకారం, అతడి శరీరాన్ని మూడు రోజులు గుహలో వుంచారు. మూడవ రోజు గుహ ఖాళీగా ఉంది. అతడు మాయమయ్యాడు.
             క్రైస్తవులలో ఒక శాఖ అయిన ఎస్సేన్లకు, వారి సొంత సంప్రదాయం వుంది. అది ఏమంటుందంటే, జీసస్ అనుచరులయిన ఎస్సేన్ లు అతడి గాయాలు మానేందుకు సహాయం చేశారు. గాయాలు మాని అతడు తిరిగి కనిపించి నప్పుడు, అతడి అనుచరులు అతడే జీసస్ అని నమ్మలేదు. ఎందుకంటే, అతడు శిలువ వేయబడి,మరణించాడు అని వారు నమ్మారు. అప్పుడు జీసస్ తాను అదే వ్యక్తినని చెప్పడానికి, మానిన తన గాయాలనే చూపించాడు. ఈ విషయాన్ని బైబిల్ లో చెప్పారు.
             ఆ మూడు రోజులలో గాయాలు తగ్గాయి. గాయాలు తగ్గిన వెంటనే అతడు మాయమయ్యాడు. అతడు ఆ దేశంనుండి మాయమవ్వాలి, లేదంటే, అతడక్కడే ఉంటే మళ్ళీ శిలువ వేసి వుండే వారు.
                   అతడిని శిలువ నుండి క్రిందకు దించిన తరువాత, అతడి శరీరాన్ని, లేపనం (ointment) పూసిన గుడ్డలో చుట్టి అదే లేపనాన్ని గాయాలకూ రాశారు. (ఇప్పటికీ ఆ లేపనాన్ని, ‘The ointment of Jesus’ అంటారు.) అప్పుడు ఆయన తిరిగి ఆరోగ్యాన్ని పొందాడు. ఆయన అనుచరులయిన జోసెఫ్, నికోడెమస్ అతని శరీరాన్ని గుహలో ఉంచి, గుహ ద్వారానికి పెద్ద బండరాయిని అడ్డు పెట్టారు. మనుషులు, అతడు చనిపోవడంతోనే తృప్తి చెందరేమోనన్న భయంతో అలా చేశారు.
              జీసస్ ఆ గుహలోనే మూడు రోజులు ఉన్నాడనీ, అతడి గాయాలనుండి స్వస్థత పొందాడనీ రాయబడి ఉంది. మూడవ రోజు చాలా పెద్ద భూకంపం, తరువాత తుఫాను వచ్చింది. అప్పుడు గుహను కాపలా కాసే సైనికులు ప్రాణ భయంతో పారిపోయారు. గుహకు అడ్డు పెట్టిన బండరాయి ఆ గాలి, తుఫాను తాకిడికి పక్కకు దొర్లిపోయింది. ఉదయమే అక్కడ జీసస్ లేడు.! ఆగహ నుండి జీసస్ మాయమవడం, అతడు మరణం నుండి తిరిగి లేచి, బొందితో స్వర్గానికి వెళ్ళాడన్న మామూలు సిద్దాంతానికి కారణమయింది.
              శిలువ వేయడం వల్ల జీసస్ మనస్సు పూర్తిగా మారిపోయింది. ఆ తరువాత ఆయన ప్రవక్త కాడు.  ఆ తరువాత ఆయన గురువు కాదు. ఆయన సలహాదారు కాదు. శిలువ అనుభవం ఆయన మనస్సును పూర్తిగా మార్చి వేసింది. ఆ తరువాత ఆయన పూర్తి మౌనంలో జీవించాడు. అలాగే మౌనంగా మరణించాడు. అందుకే ఆ తరువాత అతడి గురించి ఎక్కువగా తెలియదు. నిజానికతడు ఆ తరువాత కాలంలో భారత దేశంలో జీవించాడు.
              యూదుల గుంపొకటి దారి తప్పిపోయింది,- అన్న వాదన భారత దేశంలో ఉంది. అది బైబిల్ లో కూడా ఉంది. మోజెస్ (Moses) జెరూసలేమ్ వెళ్ళినప్పుడు, ఒక యూదు గుంపు కనబడలేదు. ఆ గుంపును వెతకడం కోసం చాలామంది వార్తాహరులను అన్ని వేపులకు పంపారు. నిజానికి కాశ్మీర్ ప్రజలు పోలికల రీత్యా, జన్యుపరంగా, వారి స్వభావరీత్యా కూడా యూదులను పోలివుంటారు.
              ప్రసిద్ధ ఫ్రెంఛ్ చరిత్రకారుడు, బెర్నియర్, ఔరంగజేబు కాలంలో భారత దేశం వచ్చినప్పుడు.....  ”పిర్పింజాల్ పర్వతాలు దాటి రాజ్యంలో ప్రవేశించిన తరువాత ఆ సరిహద్దు పల్లె ప్రజలను చూడగానే నాకు యూదులు గుర్తొచ్చారు....  అని రాశాడు.
              ఎప్పుడైనా కాశ్మీర్ ప్రాంతంలో తిరిగితే మీకు యూదుల భూమిలో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. కాశ్మీర్ లో యూదులున్నారు కనుక జీసస్ అక్కడికి వచ్చాడు అనుకున్నారు. యూదుల గుంపొకటి అక్కడ వుంది. కాశ్మీర్ లో దానికి సంబంధించిన చాలా కథలున్నాయి. అయితే ఎవరైనా అక్కడికి వెళ్ళి వాటిని వెలికి తీయాల్సిన అవసరం ఉంది.
             జీసస్ చాలా కాలం పహల్గావ్ లో ఉన్నాడు. ఆ పల్లె జీసస్ కారణంగానే ఏర్పడింది. అతడు గొఱ్ఱెల కాపరిగా పిలువబడ్డాడు. అందుకే ఆ ఊరికి పహల్గావ్ అని పేరు వచ్చింది. పహల్గావ్ లో యూసాఅసఫ్ కు లంబంధించిన జానపద కథలు ఇంకా ప్రచారంలో ఉన్నాయి. అతను 1900 సం//ల క్రితం అక్కడికి వచ్చి నివశించాడు. ఆ పల్లెను ఏర్పాటు చేసింది అతనే. మీరు కాశ్మీర్ కు వెళితే అతని జ్ఞాపకాలను, అనుభూతులను, అనుభవాలను తెలిపే అనేక ఆనవాళ్ళు, అనేక ప్రాంతాలలో కనిపిస్తాయి. అయితే పేరు మాత్రం యూసాఅసఫ్. ఏసస్నుండి ఎష్వ్ వానుండి యూసఫ్ ను అన్వయించుకోవడం కష్టమైన పనేమీ కాదు.  సమారు 70 సం//లు ఆయన భారత దేశంలో నిశ్శబ్దంగా, ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉన్నాడు. అయితే వెంట ఎప్పుడూ ఒక గంపు మాత్రం ఉండేది.
              క్రిస్టియానిటీలో చాలా కొరత ఉంది... జీసస్ ను గురించి కూడా దానికి తెలీదు. జీసస్ పూర్తి జీవితం తెలీదు. అతను ఎలాంటి సాధనలు చేశాడు, ఎలా ధ్యానం చేశాడు అనే విషయం తెలియదు. క్రీస్తు చరిత్ర రాసిన అపోస్తలులు చాలా మామూలు మనషులు. వారికి ఈ విషయాలేవీ తెలీదు. వారు ఆథ్యాత్మిక విషయాలేవీ తెలిసిన వారు కారు. వారిలో ఒకరు జాలరి, ఒకరు వడ్రంగి లేదా అలాంటి పనే చేసేవారు. మొత్తం 12 మంది అపోస్తలులు చదువు లేని వారే.
ప్రశ్న: అయితే పాల్ డాక్టర్ కదా ?               
             
    అవును. ఆనాటి యూదుల మద్య అతను డాక్టర్. కాని వారికి జీసస్ మౌనంగా వుండే సమయంలో ఏం చేసేవాడో తెలియదు. వారు ఒక్క విషయం మాత్రమే రాశారు, అతను కొండల్లోకి వెళ్లాడు. అక్కడ 30 రోజులు మౌనంగా ఉన్నాడు. తరువాత వచ్చి బోధించడం మొదలు పెట్టాడు. . ఏమీ తెలియదు. అసలేమీ తెలియదు. అంతే కాదు, మతపరమైన ఆథ్యాత్మిక విషయాలకంటే, సామాజిక, రాజకీయ విషయాలలో ఎక్కువగా నిమగ్నమై ఉన్నాడు. అలాగే ఉండి తీరాలి మరి. ఎందుకంటే అతని చుట్టూవున్న వారు బొత్తిగా ఆథ్యాత్మికత అంటే ఏమిటో తెలియని వారు.
             అతడు నేను యూదుల రాజును అని చెప్పేవాడు. అయితే వారు దాన్ని అపార్థం చేసుకున్నారు. అతడు ప్రాపంచికమైన రాజ్యం గురించి ఎప్పుడూ చెప్పలేదు. కాని దాన్ని వారు అర్థం చేసుకోలేక పోయారు. అపార్థం చేసుకున్నారు.
             అతనెప్పుడూ నీతి కథలు చెప్పేవాడు. ఆ కథలన్నిటిని వారు అపార్థం చేసుకున్నారు. అతని శతృవులే కాదు, అతని అనుచరులూ, అపోస్తలులు కూడా అపార్థం చేసుకోవడం మొదలు పెట్టారు. వారు కూడా ఈ ప్రపంచానికి సంబంధించిన రాజ్యమనే అనుకున్నారు. వారికి ఆథ్యాత్మిక విషయాలు తెలియవు. అతడు చెప్పే విషయాలు దైవికమైనవి. అతడు చెప్పిన దేవుని రాజ్యం అనేది
ఒక ఉపమానం అని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. అందుకే ఎప్పుడో ఒకరోజు జీసస్ వారికి రాజు అవుతాడనే అనుకున్నారు. అలా అనుకోవడంతోనే మొత్తం సమస్య మొదలయింది. జీసస్ మరెక్కడయినా, మరే దేశంలోనైనా ఉండివుంటే, అతడిని శిలున వేసి వుండే వారు కాదు. యూదులతోనే సమస్య అయింది. యూదులు ముందునుండీ భౌతికవాదులే. ఇప్పటికీ వారు భౌతికవాదులే. అసలు  దేవుని రాజ్యం అనేది వారి దృష్టిలో అర్ధం లేని విషయం. వారెప్పుడూ భౌతికమైన, ప్రాపంచిక రాజ్యాన్ని గురించే ఆలోచించారు. వారు ఆథ్యాత్మిక ప్రపంచాన్ని గురించి మాట్లాడినా, అది ఈ భౌతిక ప్రపంచానికి కొనసాగింపుగానే వుంటుంది. వారి దృష్టిలో  ఆథ్యాత్మిక ప్రపంచం ఈ భౌతిక ప్రపంచానికి కొనసాగింపే తప్ప అతీతం కాదు. వారిది పూర్తిగా విలక్షణమైన ఆలోచనా విధానం. అందుకే ఈ ప్రపంచం మొత్తం మీద భౌతిక శాస్త్రంలోని గొప్ప గొప్ప ఆవిష్కరణలకు యూదులే కారణమయ్యారు. ప్రపంచాన్ని భౌతిక వాదం వేపు నడపించింది కార్ల్ మార్క్స్. ఇది కాకతాళీయంగా జరుగ లేదు. కార్ల్ మార్క్స్, ఫ్రాయిడ్, ఐన్స్టైన్ – ఈ ముగ్గురు యూదులు 20 వ శతాబ్దపు పథ నిర్దేశకులు. కేవలం ముగ్గరు యూదులు ఈ ప్రపంచాన్ని పునర్న్మించారు, ఎందుకు !?
                   ఈ ప్రపంచంలో ఈ రోజున యూదుల ఆలోచనా విధానాన్ని అనుసరించని వారు ఒక్కరు కూడా లేరు. యూదులు పచ్చి వాస్తవిక వాదులు. వారు భౌతిక వాదులు. వారితో క్రీస్తు, బుద్ధుడిలా మాట్లాడాడు. అసలు వారి భాషకు, క్రీస్తు మాటలకు, ఎక్కడా పొంతన లేదు. ఎక్కడా కలవదు, సంబంధమే లేదు. అందుకే అతన్ని అపార్థం చేసుకుంటూనే వచ్చారు.
             పిలాతు (pilot) జీసస్ ను యూదుల కంటే మెరుగ్గా అర్థం చేసుకోగలిగాడు. అమాయకుడు అనవసరంగా, శిలువ వేయ బడుతున్నాడే అని బాధ పడ్డాడు. క్రీస్తును శిలువ వేయకుండా కాపాడాలని, శాయశక్తులా ప్రయత్నించాడు. ఇదంతా అర్థం లేని మూర్ఖపు చర్య అని అనుకున్న వాడు పిలాతు ఒక్కడే. కాని ఆ చర్య వెనుక అనేక రాజకీయ కారణాలున్నాయి. జీసస్ ను శిలువ వేసే ముందు, పిలాతు అతడిని నిజం ఏమిటి ? “ అని అడిగాడు.

            అందుకు జీసస్ మౌనంగా ఉన్నాడు. ఇది ఒక బుద్దుని సమాధానం. ఎందుకంటే కేవలం బద్దుడు మాత్రమే సత్యం విషయంలో మౌనంగా ఉంటాడు. మరెవరూ అలా లేరు. మిగిలిన అందరూ ఏదో ఒకటి చెప్పడం జరిగింది. ఇదీ అని ఏదీ చెప్పలేం. బుద్దులు మాత్రమే మౌనంగా వున్నారు. పూర్తి మౌనంగా. యూదులు ఈ మౌనాన్ని ఏమీ తెలియని తనంగా అర్థం చేసుకున్నారు. జీసస్ కు తెలిస్తే చెప్పాలి కదా ! “
                     కాని పైలేట్ ఆమౌనంలోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్నాడని పిస్తుంది నాకు. అతడు రోమన్. అతడికి అర్ధం చేసుకునే అవకాశం వుంది. వెంటనే పైలెట్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వూరికే అలా మాయమైపోయాడు. అక్కడున్న పూజారులకే మొత్తం తతంగాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. అతడు ఆ తతంగంలో పాలు పంచుకోవడానికి ఇష్ట పడలేదు.
                     ఈ సందర్భం రెండు వేర్వేరు భాషల మధ్య జరిగింది. జీసస్ వేరే ప్రపంచాన్ని గురించి మాట్లాడతాడు.  అయితే ఈప్రపంచ పరిభాషలోనే మాట్లాడతాడు. యూదులు ఆ మాటలను ఈ వస్తుగత, భౌతిక ప్రపంచానికి అన్వయించి అర్ధం చేసుకుంటారు.
           ఇదే భారత దేశంలో అయితే అలా జరిగి ఉండేది కాదు. ఇక్కడ తరతరలుగా, సంప్రదాయకంగా వచ్చిన ఆధ్యాత్మిక నీతి సూత్రాలు, ఉపమానాలు, నిగూఢార్థాలు, సూచనలు ఉన్నాయి. అందుకే  భారత దేశంలో వీటికే అపార్థాలు తీసే అవకాశం ఉంది. ఎవరైనా ప్రాపంచిక, భౌతిక విషయాలను మాట్లాడితే, దాన్ని కూడా ఆథ్యాత్మిక విషయాలుగా అన్వయించుకుని అర్థం చేసుకునే అవకాశం వుంది. ఈ సంప్రదాయం ప్రాచీన కాలంనుండే వుంది. భారత దేశంలో చాలామంది ప్రేమ, రాసక్రీడ, లైంగిక పరమైన విషయాలను మాట్లాడుతూనే వున్నారు. అవన్నీ కేవలం ఈ ప్రపంచానికి సంబంధించినవి. అయితే వారి అనుచరులు వాటిని ఆథ్యాత్మక ప్రపంచానికి సంబంధించిన ప్రతీకలుగా, ఉపమానాలుగా అన్వయించి అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు.
                   నీవు మగువ, మధువు గురించి మాట్లాడినా వారు దాన్ని మరో అర్ధంలో చెప్పుకుంటారు. మధువు అంటే పారవశ్యానుకి సూచనగా అనుకుంటారు. అలాగే జరుగుతుంది. ఇది చాలా పురాతన కాలంనుండి వస్తున్న సాంప్రదాయం.
              యూదులు మాటలను సూటిగా అర్ధం చేసుకుంటారు. చాలా సూటిగా ఉన్నది ఉన్నట్టుగా. వారు ఇప్పటికీ ఆశ్చర్యంగా అలాగే ఉన్నారు. ప్రపంచం పట్ల చాలా ప్రత్యేకమైన, విలక్షణమైన దృష్టి కలిగిన చిత్రమైన జాతి అది. అందుకే వారు ఎక్కడా నిలకడగా లేరు. వారలా వుండలేరు కూడా. ఎందుకంటే వారిది చిత్రమైన మనస్తత్వం. ఒక యూదుడి హృదయాన్ని తాకడం చాలా కష్టం. అతడి చుట్టూ ఒక కవచం ఉంటుంది. వారికంటూ సొంత ఇల్లు లేక పోవడంతో, వారు తమను తాము రక్షించుకునే అనివార్య పరిస్తితిలో పడ్డారు.
            ఏదెలా వున్నా వారు పదార్ధం పరిభాషలోనే మాట్లాడతారు.  భగవంతుడు కూడా భౌతిక పదార్ధానికి పొడిగింపేఅందుకే జీసస్ మాటల్లోని అంతరార్ధాన్ని తెలుసుకోవడం వారికి అసాధ్యమైంది. యూదులు, ఎవరైనా నీ పట్ల తప్పు చేస్తే రెట్టింపు బలంతో ప్రతీకారం తీర్చుకో అంటారు. జడ పదార్ధం ఇలాగే ప్రవర్తిస్తుంది. స్పందించు, ఎవరైనా ఒక కన్ను పొడిస్తే, నీవు వారి రెండు కళ్ళను పీకెయ్ అంటారు. అయితే జీసస్ అందుకు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడాడు. నిన్ను ఎవరైనా ఒక చెంప కొడితే, నీవు వారికి మరో చెంప చూపించు అని చెప్తాడు. ఇది స్పష్టంగా బౌద్ధుల విధానం.
                 నిజానికి ఒక యూదుడు, అకస్మాత్తుగా ఇలా మాట్లాడగలగడం ఎలా సాధ్యమో, అది మింగుడు పడని విషయం. అసలా సంప్రదాయమే అక్కడ లేదు. ఆమాటలకు గతంతో ఎలాంటి సంబంధం లేదు. యూదు మనస్తత్వం పూర్తిగా మరణిస్తే తప్ప అది సాధ్యం కాదు. అందుకే జీసస్ ను యూదుగా అసలు ఊహించలేము.
            అదీకాక, అతడు అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అదే నేలపై అతడి గతంతో అతడికే సంబంధం లేదు. యూదుల చరిత్రతో అతడిని గుర్తించలేం. వారిలో ఒకడు అని చెప్పడానికి, అతడిలో వారితో పోల్చదగినదేదీ మిగల్లేదు. యూదుల దేవుడి విషయంలో, అతడు చెప్పే ప్రేమ, కరుణ అనేవన్నీ అర్ధం లేని విషయాలు. మీరు అంత కంటే అసూయా పరుడైన దేవుని ఊహించ లేరు. అంతకంటే క్రూరమైన దేవుని మీరు ఊహించ లేరు. అంతకంటే ఉగ్రుడైన దేవుని మీరు చూడలేరు. ఆ దేవుని మాటకు ఎవరైనా ఎదురు తిరిగితే ఆ పట్టణం మొత్తాన్ని ఒక్క క్షణంలో కాల్చి వేయగలడు. ఒక్క వ్యక్తి అవిధేయంగా ఉన్నాసరే, మొత్తం కాలి బూడిదైపోతుంది. అలాంటి నమ్మకం వున్న సమాజంలోకి, అకస్మాత్తుగా జీససే వచ్చి, దేవుడే ప్రేమ ! “ అని చెప్పాడు. ఇది అసలు వూహించలేని, అర్ధం చేసుకోలేని విషయం. ఇతడిని మరేదో సంప్రదాయం ప్రభావితం చేసి ఉండాలి.
           బుద్ధుడు కరుణ గురించి మాట్లాడితే, దాన్ని అర్ధం చేసుకోగలం. అందులో అర్ధం కాని విషయమేదీ లేదు. భారతదేశం అంతా కొన్ని వేల సంవత్సరాలుగా  దీని గురించి మాట్లాడుతూనే ఉంది. బుద్దుడు భారతదేశ సంప్రదాయంలో ఒక భాగం. అయితే జీసస్ యూదు సంప్రదాయంలో భాగంగా లేడు. అందుకే అతడిని శిలువ వేసి చంపారు.
                       భారతదేశంలో బుద్దులెవరినీ, ఎప్పుడూ చంపలేదు. అతడెంత తిరుగుబాటు చేసినా ఆ సంప్రదాయానికే కట్టుబడి వుంటాడు. అతడెంత తిరుగుబాటుదారుడిగా వున్నా, అవే మౌలిక అంశాలలో లోతుగా నాటుకుని వుంటాడు. అందుకే అతడు సమాజం కంటే ఎక్కువగా భారతీయతను పుణికి పుచ్చుకున్నాడని ఎవరయినా అంటారు. కాని జెరూసలేం లో జీసస్ పూర్తిగా పరాయివాడయి పోయాడు. అతడు వాడే మాటలు, పదాలు, భాష, సంకేతాలు, ఉపమానాలు అన్నీ ఆ జాతికి పూర్తిగా తెలియనివి. అందుకే, ఇక అతడిని శిలువ వేయడం తప్ప మరో మార్గం కనబడలేదు వారికి. అది సహజం.
                     అయితే, జీసస్ ను, నేను గాఢమైన ధ్యానంలో సంపూర్ణ జ్ఞానోదయం పొందిన వాడిగా చూస్తాను. అయితే అతను, కేవలం రాజకీయాలు నడిపే, మత విశ్వాసం, తాత్త్విక విచారం ఏమాత్రం లేని జాతితో తల పడ్డాడు.
                    యూదులు ప్రపంచానికి గొప్ప తత్వవేత్తలను ఇవ్వలేదు. వారు గొప్ప శాస్త్రవేత్తలను ఇచ్చారు. ఆ జాతి మనస్తత్వమే అలాంటిది. అది వేరే కోణంలో పని చేస్తుంది. జీసస్ వారిలో పూర్తిగా అపరిచితుడు. అతడు వచ్చి గందరగోళాన్ని సృష్టించాడు. అందుకే అతడి నోరు మూయించాలి.
తరువాత అతడు మాయమయ్యాడు. మళ్ళీ అలాంటి ప్రయత్నం చేయలేదు. శిలువ వేసిన తరువాత అతడు ఒక గుంపు మద్యలో నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నిశ్శబ్దంగా, రహస్యంగా పని చేశాడు. నా ఉద్దేశ్యంలో రహస్యంగా పని చేసే ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. క్రిస్టియానిటీని మర్చిపోయి, మళ్ళీ జీసస్ దగ్గరకు మతం లేకుండా వెళ్తే, ఎవరైనా ఆత్మికంగా సంపద్వంతులవుతారు. అయితే ఇప్పుడు మతం ఒక అడ్డు గోడలా తయారయింది. జీసస్ గురించి తెలుకుకోవాలని ప్రయత్నిస్తే అది క్రిస్టియన్ మత అవగాహనగా తెలుస్తుంది తప్ప జీసస్ గురించి కాదు.
                  ఉప్పు సముద్రం ఒడ్డున 20సం//ము ల క్రితం రెల్లు కాగితపు చుట్టలు దొరికినప్పుడు, క్రైస్తవ ప్రపంచం అల్లకల్లోలమయింది. ఎందుకంటే అందులో రాసినవి చాలా ఖచ్చితమైనవి, విశ్వసనీయమైనవి, స్పష్టమైనవి. అవి ఎస్సెనీయులకు సంబంధించినవి. కాని క్రిస్టియానిటీ ఆ దొరికిన సమాచారం దేంతోనూ ఏకీభవించలేదు. అందుకు వారు ఏవో కట్టు కథలను చెప్పారు. పూర్తిగా వేరే కొన్ని యూదుల కట్టు కథలను చెప్పారు. అయితే ఖురాన్ లో భిన్నమైన కథ ఉంది. మహ్మద్ ప్రవక్త కూడా చాలామంది యూదు మార్మికులతో సంబంధాన్ని కలిగి వుండేవాడనిపిస్తుంది.
                 ఇలా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నేను ఏదైనా చెప్పినప్పుడు, రెండు రకాల వ్యక్తులను తయారు చేస్తాను. ఒకరు బహిరంగంగా పని చేస్తారు. వారు భౌతిక, సామాజిక ప్రపంచానికి సంబంధించిన ఎన్నో పనులను చక్కగా నిర్వహిస్తూ వుంటారు. వారు నేను చెప్పిన విషయాలన్నిటిని కాపాడేందుకు సహాయం చేస్తారు. రెండవ వ్యక్తి,ఆథ్యాత్మిక, అంతర్గత వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తాడు. ఎప్పుడో ఒక రోజు వారిరువురి మద్య ఘర్షణ మొదలవక తప్పదు. ఎందుకంటే, వారి దృష్టి కోణాలు వేర్వేరుగా వుంటాయి. అంతర్ముఖుడు, నిగూఢంగా పని చేసే మనస్సు, పట్టించుకునే విషయాలే వేరు. అయితే అంతిమ విజయం మాత్రం బహిరంగంగా పని చేసే వారిదే. ఎందుకంటే వారు ఒక గుంపులో సామూహికంగా పని చేయగలరు. నిగూఢ మనస్తత్త్వం గలవారు సామూహికంగా పని చేయలేరు. వారు వ్యక్తులుగా మాత్రమే పని చేస్తారు. అలాంటి వ్యక్తిని మనం కోల్పోతే ఆవ్యక్తి కి  సంబంధించిన విషయాన్ని కొంత కోల్పోతాము. ఇది అందరి  విషయంలోనూ జరుగుతుంది. చివరికి బహిరంగంగా పను చేసేవారే ఎక్కువగా ప్రభావితం చేస్తారు. అది ఒక చర్చ్ గా, ఒక మూఢ నమ్మకంగా తయారవుతుంది. అంతా వ్యవస్థీకృతమై పని చేస్తంది. వ్యవస్థీకృతమైన సంస్థ చేయవలసిన పనేంటంటే తనలోని రహస్య ఆథ్యాత్మక విషయాలను చంపేయాలి. ఎందుకంటే అది ఎప్పుడూ అలజడి రేపుతూ వుంటుంది.- అది ఎప్పడూ అడ్డంకే.
                 క్రిస్టియానిటీ, మత ప్రచారం పేరుతో ఆథ్యాత్మిక, అంతర్గత విషయాలన్నింటినీ నాశనం చేస్తుంది. ఇప్పుడు పోప్ అనే వాడు జీసస్ కు పూర్తిగా వ్యతిరేకి. ఇది రెండు రకాల పను విధానాలు అభివృద్ది చెందడం ఫలితంగా జరిగే పరిణామం. పోప్ – జీసస్ ను శిలువ వేసిన  పూజారిలా వున్నాడు కాని, జీసస్ లాగా లేడు. ఒకవేళ జీసస్ తిరిగి వస్తే, అప్పుడు ఆయనను ఈసారి రోమ్ లో వాటికన్ శిలువ వేస్తుంది. ఇది బహిరంగంగా, వ్యవస్థీకృతమైన సంస్థ పని చేసే విధానం.
                     అయితే ఇవన్నీ అత్యంత క్లిష్టమైన సమస్యలు. అవి జరుగుతాయి. నీవేం చేయలేవు. అయితే జీసస్ , బుద్దుడిలా, మహావీరుడిలా, కృష్ణుడిలా జ్ఞానోదయం పొందినవాడు.
                 ప్రశ్న:  బైబిల్ లో ఎన్నో మహిమలు జరిగినట్టుగా రాసి వుంది. లాజరస్ మరణించి శరీరం వాసన వస్తున్నా, జీసస్ వల్ల మళ్ళీ బ్రతికాడు. ఇది సాధ్యమేనా?  చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతకగలడా?  మీరు దీన్ని నిజమనుకుంటున్నారా ?    
                       ఓషో : ఇది సాధ్యమే. వేరే విధంగా సాధ్యమవచ్చు. పుర్తిగా వేరే విధంగా. ఒక మనిషి చనిపోయి వుంటే అది అసాధ్యం. అయితే మనిషి చనిపోయినట్లుగా కనిపిస్తే అది సాధ్యమే. అయితే మనిషి పూర్తిగా చనిపోయినప్పుడు అది అసాధ్యం.
               ప్రశ్న: అయితే శరీరం బాగా వాసన వస్తోందని బైబిల్ లో చెప్పబడింది గదా !?
                      ఓషో: శరీరం వాసన వస్తూ వుండవచ్చు. ఆ మనిషి కోమాలో వుండి వుండవచ్చు. గాఢమైన కోమాలో వున్నప్పుడు శరీరం వాసన రావడం మొదలవుతుంది. మరోలా జరిగే అవకాశం కూడా ఉంది. అప్పటి యూదులకు ఈ అవకాశాల గురించి తెలియదు. ఉదాహరణకు ఆత్మ బయటకు వెళ్ళి వుండవచ్చు. శరీరం బయటకు. అప్పుడు ఆ శరీరాన్ని కాపాడుతూ వుండాలి. లేకపోతే అది పాడవడం మొదలవుతుంది. ఎప్పుడయితే ఆత్మ శరీరం నుండి బయటకు వెళ్తుందో, అప్పుడు శరీరం పాడవడం  మొదలు పెడ్తుంది. అప్పుడు శరీరం కోమాలో వుంటుంది. గాఢమైన కోమా.
                  దానికి తిరిగి ప్రాణం పోయవచ్చు. జీసస్ లాంటి వ్యక్తికి ప్రాణం పోయడం సాధ్యమే. అయితే అది కష్టమైన విషయం. శరీరం నుండి బయట తిరుగుతున్న ఆత్మను తిరిగి తీసుకు రావాలంటే చాలా శక్తి అవసరం. భారత దేశంలో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.
                        ఉదాహరణకు శంకరాచార్య గురించి మీరు వినే వుంటారు. శంకరాచార్యుడు మండనమిశ్రా అనే పండితునితో చర్చలో వున్నాడు. మండనమిశ్రుడు ద్వైతానికి సంబంధించి భారతదేశంలో చాలా గొప్ప పండితుడు. శంకరుడు అతనితో చర్చించడానికి వచ్చాడు. భారతదేశంలో అది ఒక సంప్రదాయం. గొప్ప విద్వాంసులతో చర్చించడం, గెలవడం, తరువాత ఓడిపోయిన వారు గెలిచిన వారి శిష్యులవుతారు. ఇది యుద్ధం కాదు, స్నేహ పూర్వకమైన చర్చ. ఎదుటి వారిని నీ వాదనలతో ఒప్పించగలిగితే అప్పుడతడు నీ శిష్యుడు అవుతాడు. ఇలాంటి ఒప్పందాలతో భారతదేశం అంతా ఎన్నో చర్చలు జరిగాయి. శంకరుడు, మండన మిశ్ర తో చర్చించడం కోసం, ఎన్నో గ్రామాలను దాటి  వెళ్ళవలసి వచ్చింది.ఒక సమస్య వచ్చి పడింది. ఎందుకంటే వారిద్దరూ ఉద్దండులే. ఒకరు ద్వైతానికీ, మరొకరు అద్వైతానికి ప్రతినిధులు. ఇక వారి చర్చకు ఎవరు అధ్యక్షత వహిస్తారు. న్యాయ నిర్ణేతగా ఎవరుండగలరు. అంతటి అర్హత గలవారు ఎవరూ లేరు. వీరు చర్చించే విషయాలను అర్ధం చేసుకోగలిగే వారెవరు ? గెలుపోటములను నిర్ణయించే వారెవరు ?
               ఒకే వ్యక్తి ఉంది. ఆమె మండన మిశ్రుడి భార్య. ఇది చాలా అరుదయిన విషయం. ఒక స్త్రీ ని న్యాయనిర్ణేతగా నియమించడం.    అయితే మరో దారి లేదు. అందుకే మండన మిశ్రుడి భార్యను న్యాయనిర్ణేతగా నియమించారు. మండన మిశ్రుడు ఓడిపోయాడు. అతని భార్యే, అతను ఓడిపోయినట్లు ప్రకటించింది. అయితే సగం మాత్రమే ఓడిపోయాడు. ఎందుకంటే, నేను అతని అర్ధాంగిని, కనుక నీవు నన్ను కూడా ఓడిస్తేనే నీ గెలుపు పూర్తవుతుంది. ఇప్పుడు నీవు నాతో వాదించి తీరాలి అంది. ఇదొక ఉపాయం. శంకరాచార్యుడు చాలా ఇబ్బందిలో పడ్డాడు. మండన మిశ్రుడు ఓడిపోయినట్లు ప్రకటించడం జరిగింది. అయితే సగం మాత్రమే. ఎందుకంటే, భర్తను సగంగా,  భార్యను సగంగా పరిగణిస్తారు. వారిద్దరూ కలిస్తేనే పూర్తిగా ఒకరవుతారు. అందువల్ల మండన మిశ్రుడు సగం మాత్రమే ఓడిపోయాడు. ఇంకా సగం వుంది. ఇప్పుడు మండన మిశ్రుడు  న్యాయ నిర్ణేతగా వుంటాడు. నేను నీతో వాదిస్తాను. అందామె. ఆమె అరుదయిన స్త్రీ. ఆమె లైంగిక విషయాలను గురించిన చర్చ ప్రారంభించింది. శంకరాచార్యుడు తిరిగి సమస్యలో పడ్డాడు. అతడు బ్రహ్మచారి. అదుకే అతడికి ఇప్పుడు నేను ఓడిపోతున్నాను అనిపించింది. ఎందుకంటే అతనికి లైంగిక విషయాలు ఏవీ తెలియవు. అందుకు సంబంధించిన ఏ వ్యవహారమూ అతడికి తెలీదు.
                  ఆ అపాయాన్ని అతడు గ్రహించాడు. ఇప్పుడు అతను ఇరుక్కుపోయాడు. అందుకే అతడు ఆరు నెలల గడువు కావాలని కోరుకున్నాడు. శంకరుడు మొదట నాకు ఆరు నెలల గడువివ్వండి. అప్పుడు నాకు కామ శాస్త్రాన్ని అధ్యయనం చేసే అవకాశం వుంటుంది. ఆ తరువాత మాత్రమే మీతో చర్చించగలను. అలా కాకపోతే నేను ఇప్పటికే ఓడిపోయాను అన్నాడు. అతనికి ఆరు నెలల గడువు మంజూరయ్యింది.
                   అతనికి మరో సమస్య ఎదురయింది. ఈ కథ చాలా బావుంటుంది. అతను జీవితాంతం బ్రహ్మచారిగా వుంటానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే అతని శరీరాన్ని కామశాస్త్ర ప్రయోగానికి ఉపయోగించ లేడు. అందుకే అతను తన శరీరాన్ని వదిలేసి, మరో శరీరంలోకి ప్రవేశించవలసిన అవసరం ఏర్పడింది. ఒక రాజుచనిపోతున్న సమయంలో, శంకరుడు ఆ రాజు శరీరంలో ప్రవేశించాడు. అతని శరీరాన్ని తన శిష్యులకు అప్పగించి, దానిని నిరంతరం కాపాడుతూ వుండమని చెప్పాడు. ఎందుకంటే ఆ శరీరానికి ఏమయినా జరిగితే అందులోకి శంకరుడు తిరిగి ప్రవేశించలేడు. అందుకే వారు ఆరు నెలలు అతడి శరీరాన్ని నిరంతరం కావలి కాస్తూ వచ్చారు. 12 మంది శిష్యులు నిద్ర లేకుండా కావలి కాశారు.
                   శంకరుడు చనిపోతున్న రాజు శరీరంలో ప్రవేశించాడు. శరీరం అప్పటికే చనిపోయింది. క్షణం క్రితం మరణించి  తరువాత అతడు తిరిగి లేచాడు. అప్పుడు 6 నెలలు ఆ శరీరంలోనే జీవిస్తూ కామశాస్త్ర ప్రయోగంలో లీనమై పోయాడు. రాజు భార్య ఏదో తేడాను గమనించింది. కాని, ఏం చేయ గలదు.!? శరీరం అదే, కాని మనిషి వేరుగా వున్నాడు. తరువాత శంకరుడు తన శరీరంలోకి తిరిగి వచ్చాడు. చర్చ కొనసాగింది. మండన మిశ్రుడి భార్య భారతిఓడిపోయింది.
                   జీసస్, లాజరస్ కు తిరిగి లేచేందుకు సాయపడి వుండవచ్చు. ఆ అవకాశం వుంది. అయితే క్రిస్టియానిటికి ఈ విషయాలేవీ తెలీవు. లాజరస్ కోమా లో వుండి వుండవచ్చు. గాఢమైన కోమాలో శరీరం చెడిపోవడం ప్రారంభిస్తుంది. కోమాలో కొన్ని సంవత్సరాలు కూడా వుండే అవకాశం వుంది. నేను, 9 నెలలు  కోమాలో ఉన్న ఒక స్త్రీ ని  చూశాను. ఎవరైనా శరీరాన్ని కాపాడకపోతే వెంటనే చనిపోతుంది. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమె చనిపోయినట్టు అలా పడివుంది. ఆమెని వారం రోజులు నిర్లక్ష్యం చేస్తే ఆ శరీరం వాసన కొడుతుంది. ఇక ఆమె ఏమీ చేయలేదు. అలాగే జీసస్ కోమాలో వున్న మనిషికి తిరిగి లేవడానికి సాయం చేసి వుండ వచ్చు. లేదా తన ఆత్మ తన శరీరం నుండి వేరు పడిన వ్యక్తికి, తిరిగి శరీరంలోకి వచ్చేందుకు సహాయం చేసి వుండవచ్చు. ఇలాంటిది ఏదయినా జరిగి వుండవచ్చు.
                  అయితే చనిపోయిన వ్యక్తి తిరిగి జీవిచడం అసాధ్యం. అతడు తిరిగి లేచాడంటే చావ లేదనే అర్ధం. నాకు తెలిసినంత వరకూ ప్రపంచంలో ఏ అద్భుతాలూ జరగవు. కొన్ని అద్భుతాల్లా కనిపిస్తాయి. ఎందుకంటే దాన్ని గురించి మనకు పూర్తిగా తెలియదు. మనకు విషయం తెలియకపోవడం వల్ల అది ఒక అద్భుతంగా కనిపిస్తుంది.
                  ప్రశ్న: బైబిల్ లో ప్రస్తావించిన మరి కొన్ని అద్భుతాల మాటేమిటి ? ఉదాహరణకు 2 రొట్టె ముక్కలు, 5 చేపలతో వేలాది మందికి భోజనం పెట్టాడని వుంది. దీన్ని వివరించగలరా ?
                          ఓషో: చాలా విషయాలు జరిగే అవకాశం ఉంది. అయితే అవేవీ అద్భుతాలు కావు. ఉదాహరణకు పదార్ధాన్ని సృష్టించడం కూడా అద్భతం కాదు. అదొక శాస్త్రం. పదార్ధాన్ని సృష్టించడం సాధ్యమే. అదే విధంగా చాలా విషయాలు, చాలా చాలా విషయాలు సాధ్యం. ఒక వస్తువును ఇక్కడికి అనేక రహస్య మార్గాల గుండా తెప్పించవచ్చు. ఆ మార్గాలు నీకు తెలియవు. ఆ వస్తువు నీకు కనబడుతుంది. అయితే అది సృష్టించబడడం కాదు. ఉదాహరణకు ఒక స్విస్ గడియారాన్ని షాప్ నుండి ఇక్కడకు తీసుకు రావచ్చు. ఆత్మలు వాటిని ఇక్కడకు తీసుకు రావడానికి సహాయ పడవచ్చు. అయితే నీవు ఆ ఆత్మను చూడ లేవు. గడియారాన్ని మాత్రమే చూస్తావు. అయితే అది సృష్టించం కాదు. అది స్విస్ లో తయారైన గడియారం. ఎక్కడి నండి వచ్చిందో, ఎలా వచ్చిందో మాత్రం తెలీదు. అయాతే అది సృష్టిచడం కూడా సాధ్యమే. ఏమీ లేని శూన్యం నుండి పదార్ధం రావడం.
                              ప్రశ్న: అదెలా సాధ్యం ?
                ఓషో: నీవుఎలా, ఎలా సాధ్యం ? “ అని అడిగితే, ఎలా అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే అలా చేయడానికి నీవు చాలాచాలా కృషి చేయాలి.
                     ప్రశ్న:    ఒక ఉదాహరణ చెప్పగలరా ?      
                             ఓషో:      ఉదాహరణకు, నీ మనస్సు ఎంత బాగా కేంద్రీకరించగలితే అంత సులభం అవుతుంది. నీవు నీ మనస్సును సంపూర్ణంగా కేంద్రీకరించగలిగితే, సృష్టి జరుగుతుంది. ఏదయినా ప్రత్యక్షమౌతుంది. అయితే సులభమైన పద్ధతులతో ప్రయత్నించు. ఉదాహరణకు ఒక గాజు గ్లాసులో నీరు తీసుకుని, దాంట్లో కొంత గ్లిజరిన్ లేదా నూనె వేయి. అప్పుడు ఆ నీటిపై ఒక గుండు సూదిని ఉంచు. అది ఆ నూనె పొర మీద తేలుతుంది. అప్పుడు ఆ సూది మీద నీ దృష్టిని కేంద్రీకరించు. నీ రెండు కళ్ళను ఏమాత్రం రెప్ప వాల్చకుండా ఆ సూది మీద కేంద్రీకరించు. తరువాత ఆ సూదిని కుడివైపుకు కదలమని ఆదేశమివ్వు. ఇలా నీవు 7 రోజులు సాధన చేయగలితే, అది నీవు చెప్పినట్టు కదులుతుంది. ఇప్పుడు ఎడమ వైపు కదులుఅని ఆదేశమిస్తే ఆ సూది ఎడమ వైపుకు కదులుతుంది. నీవు సూదిని కదలకుండా వుండమని ఆదేశిస్తే నిలిచిపోతుంది. 
                   ఒక సూది నీ మనస్సులోని సంకేతాలను అనుసరించగలిగినప్పుడు, నీవు కొంత వరకూ సృష్టి చేయడం సాధించ గలిగావనుకుంటా. అది చాలా సుదీర్ఘమైన సాధన. అయితే ఈ ప్రయోగం వలన నీవు మనస్సుకు పదార్ధాన్ని ఆదేశించే శక్తి వున్నదని అంగీకరిస్తావు. ఎప్పుడైతే నీవా శక్తిని అనుభూతి చెందుతావో, నీవు ఇంకా ముందుకు పోగలవు. మనస్సు సంపూర్ణ కేంద్రీకరణ వల్ల సృష్టి చేయడం సాధ్యమే. అప్పుడు కేవలం నీ అనుమతి కావాలి. ఇంకేం అవసరం లేదు. మనస్సు సంపూర్ణంగా కేంద్రీకృతమై వుంది. అప్పుడు అది గులాబి పువ్వు అంటే గులాబి పువ్వు ప్రత్యక్షమవుతుంది. అందుకే భారతీయులు, ఈ సృష్టి అంతా దేవుని మదిలో మెదిలిన కల అంటారు. అతడు కల కంటాడు. అది ప్రత్యక్షమవుతుంది. ఎప్పుడైతే కల కనడం మానేస్తాడో, అప్పుడది కరిగిపోతుంది.
                  ప్రశ్న:   మీరు అలా చేయగలరా ?
                        ఓషో:     నేను చేయగలను. చేయలేను కూడా. ఎందుకంటే అందులో అర్ధంలేని తనాన్ని నేను అనుభూతి చెందుతాను. అంతేకాదు. ఆ రెండవ సామర్ధ్యమే చాలా మెరుగయినది. బుద్దుడిని అలా చేయమని ఒప్పించలేరు. అయితే జీసస్ అలా చేసి తీరాలి. మళ్లీ కారణం అదే. ఎందుకంటే యూదు జాతీయులు అద్భుతాలను తప్ప దేన్నీ నమ్మలేరు. వాళ్ళకు ఏదో అద్భుతం కావాలి. అదొక అద్భుతం ఐతే తప్ప వారు దాన్ని ఊహించలేరు, ఆలేచించలేరు.
                               భారతదేశంలో అద్భుతాలు ఏవీ చేయకపోయినా బుద్దుని అంగీకరించగలం. అతడే అత్యున్నతుడు. అయితే యూదులు, నీవు అద్భుతాలు చేయగలవా !?, నీవు అద్భుతాలు చేసినప్పుడే, నీవు చెప్పిన దాంట్లో అర్ధం వుందని మేం నమ్ముతాం”  అని అడగడం మొదలుపెట్టారు. జీసస్ అద్భుతాలు చేయాలనుకో లేదు.అతడిని బలవంతపెట్టారు. అలా చేయకపోతే అతని ఆలోచన, బోధన అన్నీ అర్ధం లేనివిగా దాపురించే పరిస్థితి ఎదురయింది. అలా  అద్భుతాలు చేసే బుద్దుని మనం ఊహించలేం.
                                         ఎందుకంటే తక్కువ స్థాయి మనస్సే అలా చేస్తుంది. నీవు ఎవరినైనా ఎందుకు సంతృప్తి పరచాలి ? వారినంత పట్టించుకోవడం ఎందుకు ? ఒక్కోసారి బుద్దుడి పరిసరాలలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఐతే అవి అతను చేసినవు కావు. అవి అలా జరుగుతాయి. ఉదాహరణకు బైబిల్ లో రాసిన అద్భుతాలు : కొన్ని సందర్భాలలో రొట్టె ప్రత్యక్షమవుతుంది. కొన్నిసార్లు మాయమవుతుంది. కొన్నిసార్లు మరణించిన మనిషి బ్రతుకుతాడు. – ఇవన్నీ భౌతికమైనవి. చాలా భౌతికమైనవి. అవి సామాన్య ప్రజల రోజువారీ సమస్యలు. తిండి, అనారోగ్యం, చావు.
                             బుద్దుడు ఈ జీవితమే ఒక కల అని చెప్తాడు. అప్పుడు ఎవరైనా తిరిగి బతికితే దానికి అర్ధం ఏమీ లేదు. అది కేవలం, ఒక కల తిరిగి నిజమవుతున్నట్టు వుంటుంది. అంతే. ఒక కథ ప్రచరంలో వుంది. ఒక పల్లెలో ఒక పిల్లవాడు చనిపోయాడు. తల్లి ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ పెంచుకుందంటే, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. బుద్దుడు ఆ సమయంలో ఆ గ్రామంలో వున్నాడు. కొందరు దుఃఖంతో వున్న ఆమెను బుద్దుని దగ్గరకు వెళ్ళమని చెప్పారు. అతని దగ్గరకు వెళ్ళు, అతను ఏమైనా చేయ గలడు. అతడు జ్ఞాని. అతనికేదైనా సాధ్యమే. చాలా దయ గలవాడు. నీపై అతనికి దయ కలిగితే నీ బిడ్డ బ్రతక వచ్చు. అని చెప్పారు.
                            ఆమె బిడ్డ శవాన్ని బుద్దుని కాళ్ళ దగ్గర వుంచింది. ఈ పరిస్తితిలో యూదు దేశంలో వున్న జీసస్ ను ఊహించుకోండి. ఆబిడ్డను బతికించకపోతే జీసస్ పని ఐపోయినట్టే. అప్పుడు జీసస్ బతకడం అసాధ్యం. ఎందుకంటే అతడు చెప్పేవన్నీ అబద్దం అని రుజువౌతుంది. అతడు తనను తాను ఏమని చెప్పుకుంటున్నాడో (దేవుని కుమారుడు) అది కాదుఅని రుజువౌతుంది.(అలా అని అక్కడి ప్రజలు భావిస్తారు.)
                ఐతే బుద్దుడి దగ్గరకు ఆ శిశువును తీసుకుని వచ్చినప్పుడు అతడేం చేశాడు ?  అతడా తల్లితో నీ బిడ్డను నేను బ్రతకిస్తాను. అయితే నీవొక పని చేయాలి. నీ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి, ఇంత వరకూ ఒక్కరు కూడా చని పోని ఇల్లు ఏదయినా ఉందా, అని అడుగు. గ్రామం మొత్తంలో ఒక్కరు కూడా చనిపోని ఇల్లు ఏదైనా నీవు చూపగలిగితే, నీ బిడ్డను నేను సాయంకాలం బ్రతికిస్తాను. అన్నాడు.
                  ఆమె వెళ్ళి ప్రతి ఒక్కరినీ అడుగుతుంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయి వున్నారు. ప్రతి కుటుంబంలోనూ చనిపోయిన వారు వున్నారు. ఆమె సాయంకాలమయ్యేసరికి చావు అనేది సత్యం, వాస్తవం, మరణం జీవితంలో ఒక భాగం అన్న విషయాన్ని గ్రహించగలిగింది. అప్పుడు బుద్దుడు ఆమెతో ఇప్పుడేమంటావు ? ఊరులో ఏ ఇల్లయునా, కుటుంబమయినా, ఎవరైనా మరణం వల్ల బాధ పడని వారున్నారా ? ”అని అడిగాడు.
                        అప్పుడామె ఇప్పుడు నేను బిడ్డను బతికించమని అడగడానికి రాలేదు. సన్యాసిగా దీక్ష తీసుకునేందకు వచ్చాను. చావు అనేది అనివార్యం. నాబిడ్డ పోయాడు. నేను చనిపోతాను. అలాగే అందరూ మరణిస్తారు. ఇది సత్యం. అందుకే నాకు ఎప్పటికీ అంతం కాని జీవితం కోసం దీక్ష ఇవ్వండి. అంది.
                  ఇది అన్నిటికన్నా గొప్ప అద్భుతం. ఐతే మనం దాన్ని గుర్తించలేం. దీన్ని అద్భతంగా మనం చూడలేం. ఆ బిడ్డను బ్రతికిస్తే, అది అద్భుతమయ్యుండేది. నిజానికి ఇదే గొప్ప అద్భుతం. గాఢమైన దయ, కరుణ వల్ల అది జరిగింది. ఇది భారతీయుల విషయంలో సాధ్యమయింది. ఆమె సన్యాసినిగా మారింది. అమె బిడ్డ మరణం జీవితం పట్ల వ్యామోహాన్ని పెంచేందుకు వుపయోగించ లేదు. ఆ మరణం జీవితానికి అతీతంగా ప్రయాణించేందుకు వుపయోగించబడింది.        
                  శిష్యులు ఆకలిగొని వుంటే, బుద్దుడు అద్భుతం చేసి, భోజనాన్ని సృష్టించి ఇచ్చి వుండే వారు కాదు. అందుకు పూర్తి వ్యతిరేకంగా నీవు నీ ఆకలిని గమనించు. ఆకలిని అధిగ నించేందుకు, దాన్ని గమనించు. అప్పుడు నీవు దాంతో మమేకం కాకుండా, వేరు పడి వుండగలవు. ఆకలి నీది కాదు. అది ఎక్కడో ఉపరితలంలో ఉంది. దాన్ని గమనించు, దాన్ని మననం చేయి, ఈ అవకాశాన్ని వుపయోగించుకో అంటాడు.
                        కాని జీసస్ ఆహారాన్ని సమకూర్చాల్సిందే. బుద్దుడు ఉపవాసం వుండమని తన శిష్యులకు నచ్చచెప్పాలి. ఎవరికయినా భోజనాన్ని ఇవ్వడం గొప్ప విషయం కాదు. ఎవరినయినా ఉపవాసం వుండేందుకు ఒప్పించగలగడమే అద్భుతమైన విషయం. అది మనం ఎలా నిర్వచిస్తామనే దాని మీద ఆధారపడి వుంటుంది. నాకు అద్భుతాలు చేయడం పట్ల ఎలాంటి ఆసక్తి లేదు. ఎందుకంటే అవన్నీ అర్ధంలేని పనులు. అసలు మనం జీవితాన్ని జీవిస్తున్న పద్దతే అర్ధ రహితమైనది. ఇలాంటి జీవితంలో ఏదైనా సృష్టిస్తే, అదీ అర్ధరహితంగానే వుంటుంది.    
                 మిమ్మల్ని అనంతం వైపు తీసుకెళ్ళగలిగే అద్భుతం మీదే, నా ఆసక్తి అంతా. మీరు ఒక్క క్షణమైనా ఆ అనంతాన్ని దర్శించగలిగితే అదే గొప్ప అద్భుతం. నేను చూస్తున్నంతవరకు, జీసస్ ఇలాంటి అద్భుతాలు చేయకుండా వుండగలిగి వుంటే, అతడు మానవాళికి ఇంకా గొప్ప మేలు చేయగలిగి వుండేవాడు. ఎందుకంటే అలా చేయడం వల్ల అతడు ఒట్టి మూర్ఖులను మాత్రమే ఆకర్షించ గలిగాడు.          
                 నేనూ అద్భుతాలు చేసి వుంటే, ఏదైనా సృష్టిస్తే, నా చుట్టూకూడా ఎంతోమంది మూర్ఖులు చేరివుండే వారు. నేను మూర్ఖుల మధ్య వుండి వుండే వాణ్ణి. ఎందుకంటే మూర్ఖులకే అలాంటి అద్భుతాలు కావాలి.
                 జీసస్ చేసిన అద్భుతాల వల్లే, సామాన్య ప్రజలు అతని పట్ల ఆకర్షితులయ్యారు. ఇలాంటి అద్భుతాలతోనే వారికి సహాయం చేయాలని ప్రయత్నించాడు. అయితే అది సాధ్యం కాలేది, సరికదా అతను మరిన్ని కష్టాల్లో ఇరుక్కుపోయాడు. జీసస్ ఎవరికైనా సహాయం చేయడం నేను చూడలేదు. అది అసాధ్యం.
                 మనం సాయిబాబా దగ్గరకు వెళ్తే, అతను కొన్ని చేస్తున్నాడు. కేవలం కొందరు మూర్ఖులు మాత్రమే ఆకర్షితులవుతారు. నా చేతిలోకి ఒక ఉంగరాన్ని తెప్పించగలిగితే ఏమౌతుంది ? అది ఏ విధంగా ఆథ్యాత్మిక అనుభవం ఔతుంది. ఒకవేళ ఈ ఇల్లు మాయమై, తిరిగి ప్రత్యక్షమైతే ఏమౌతుంది ? అందుకే  ఈ చమత్కారాలు, అద్భుతాలు అంటే నాకు గిట్టవు. అవి చేసేవారు కేవలం మూర్ఖులను మాత్రమే ఆకర్షించ గలరు.
                     ప్రశ్న :  జీసస్ ను, బుద్దుని పోలిస్తే జీసస్ చాలా చురుకైన తీవ్రవాదిలా కనిపిస్తాడు. ఎందుకు ?
                     ఓషో :    దీనికి కారణముంది. ఐతే దీనికి ముందు కొంత వివరణ కావాలి. భారతీయ యోగశాస్త్రం మనిషిని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఒకటి సూర్యార్ధం, రెండవది చంద్రార్ధం. సూర్యుడు మనిషిలోని ధన ధృవానికి సంకేతమైతే, చంద్రుడు ఋణ ధృవానికి సంకేతం. ఇక్కడ సూర్యుడు అంటే మనకు బయట కనిపంచే సూర్యుడు కాదు. ఈ పదాలను మన అంతర్గత ప్రపంచానికి సంబంధించి వాడారు. మన శ్వాసలో కూడా, ఒక ముక్కును సూర్యశ్వాస, రెండవ ముక్కును చంద్రశ్వాస అని చెప్తారు. మన శ్వాస ఒక ముక్కు రధ్రం నుండి ఇంకొక ముక్కు రంధ్రానికి 45 నిముషాలు లేక 1 గంటకు ఒకసారి మార్పు చెందుతుంది. నీను చాలా కోపంగా వున్నప్పుడు నీ సూర్యశ్వాస మొదలవుతుంది. నీవు కోపంగా వున్నప్పుడు చంద్రశ్వాస వుపయోగిస్తే నీ కోపం తగ్గిపోతుందని యోగ చెప్తుంది. చంద్ర శ్వాసతో నీవు కోపంగా వుండలేవు.ఎందుకంటే అది నీ లోపల చల్లదనాన్ని సృష్టిస్తుంది.  
                       ఋణం ఎప్పుడూ చల్లగా, నిశ్శబ్ధంగా, స్థిరంగా వుంటుంది. సూర్యభాగం వేడిగా శక్తివంతమైన కదలికలతో, చురుకుగా వుంటుంది. సూర్యభాగం నీలో చాలా చురుకైన భాగం. చంద్రభాగం ప్రశాంతత గల భాగం. ఎవరయినా మొదటిసారి సూర్యభాగంతో సంబంధంలోకి వస్తే, వెలుగు ఒక జ్యోతిలా కనిపిస్తుంది. మండే అగ్నిశిఖ. అందుకే నీవు బద్దుడు లేదా జీసస్ యొక్క అంతర్గత జీవితాన్ని లోతుగా విశ్లేషిస్తే అప్పటి వరకు దాగి వున్న అనేక మార్మికమైన విషయాలు బహిర్గతమౌతాయి. 
                      ఉదాహరణకు బుద్దుడిలాంటి జ్ఞానోదయం పొందినవాడు, జన్మించినపుడు తొలి దశలో తీవ్రవాదిగా వుంటాడు. ఎందుకంటే మొదటిసారి అంతర్గత ప్రపంచంలో అతడు అగ్నిజ్వాలలనే ఎదుర్కొంటాడు. మొదటి అనుభవం అది జ్వాలగానే వుంటుంది.    
                            బుద్దుడు ఎదిగిన కొద్దీ అంతరాంతరాల్లో చల్లదనం పెరుగుతుంది. అతడు ఎంత ఎక్కువగా చంద్ర ప్రభావంలో పడతాడో అంతగా అతడిలోని తీవ్రత తగ్గుతుంది. అందుకే బుద్దుడు చెప్పే మాటలు తీవ్రంగా వుండవు.
                    జీసస్ కు ఈ అవకాశం రాలేదు. అతడు ఇంకా విప్లవకారిగా వున్నప్పుడే అతడివి శిలువ వేశారు. క్రిస్టియానిటికీ సంబంధించినంత వరకూ అతడు 33 ఏండ్ల వయస్సులోనే చనిపోయాడు. అందుకే బుద్దుని బోధనలతో, జీసస్ మాటలను పోల్చినపుడు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. జీసస్ ఒక యువకుడిలా మాట్లాడతాడు- వేడిగా, వాడిగా. బుద్దుడు కూడా మొదట్లో అలాగే వుండేవాడు. ఐతే అతను 80 సం//లు జీవించాడు. అతన్ని ఎవరూ శిలువ వేయలేదు. భారతీయులకు తెలుసు, ఎవరైనా అంతర్ముఖులైతే, ప్రారంభ దశలో వారి మాటలు చాలా తీవ్రంగా వాడిగా వుంటాయి. వారు విప్లవాత్మకంగా తిరుగుబాటుదారులుగానే వుంటారు. అందుకే భారతదేశంలో అలంటివారినెప్పుడూ చంపలేదు. భారతీయులెప్పుడూ, సోక్రటీస్ పట్ల గ్రీకులు ప్రవర్తించంనట్లుగా, జీసస్ పట్ల యూదులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించలేదు.
                              భారతీయులకు తెలుసు, ఎప్పుడైతే బుద్దుడు తనలోనికి తాను ప్రయాణిస్తాడో అప్పుడు మొదటి అనుభవం విప్లవాత్మకమైని. అయితే ఆ కోణం మాయమవుతుంది. చివరికి కేవలం చంద్రుడుంటాడు- నిశ్శబ్ధంగా, ఎలాంటి వేడి లేకుండా కేవలం వెలుగుతూ. జీసస్ చాలా తొందరగా శిలువ వేయబడ్డాడు. అందుకే క్రిస్టియానిటి ఇప్పుడు ఇంకా అసంపూర్ణంగానే వుంది. క్రిస్టియానిటీ యువకుడైన జీసస్ బోధనలపైనే ఆధారపడి వుంది.- మంచి వేడిలో యువకుడిగా వున్నప్పుడు జీసస్ మాటలపైన- అందుకే అది అసంపూర్ణంగా వుంది. 
                     బౌద్దమతం సంపూర్ణమైంది. అది బుద్దుని మొదటి రోజునుండి పరిపక్వం చెందే వరకూ అన్ని దశలనూ చూసింది. అయితే పడమటి దేశాలకు క్రీస్తు విషయంలో అలా జరగక పోవడం దురదృష్టకరమైన విషయం. అది చరిత్రలో అతి పెద్ద దురదృష్టంగా రుజువైంది. క్రీస్తు కేవలం జ్వాలగా వున్నప్పుడు, 33 సంవత్సరాల వయస్సులోనే శిలువ వేయబడ్డాడు. లేకపోతే ఆ జ్వాలే, వెన్నెలగా పరిణామం చెంది వుండేది. అయితే ఆ అవకాశం అతడికి ఇవ్వలేదు. దానికి కారణం, యూదులకు అంతర్గత ప్రపంచ రీతుల గరించి, పరిణామం గురించి తెలీదు.  
                     భారతీయులు చాలామంది బుద్దులను చూశారు. అది ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది. ఎవరయినా అంతర్గత ప్రయాణం చేసినప్పుడు, అతడు మొదట వేడినే అనుభూతి చెందుతాడు. అప్పుడు అతనిలోని విప్లవ చైతన్యం పెల్లుబుకుతుంది. వారు   మరింత లోతులకు వెళ్ళినప్పుడు ఆ జ్వాల అదృశ్యమైపోతుంది. అప్పుడిక పూర్తి నిశ్శబ్ధం – వెన్నెల వెలుగులోని ప్రశాంతత వస్తుంది.                                                                               
                               జ్వాలలో వేడిని చల్లని వెలుగుగా మార్చడమే రసవాద శాస్త్రం. అది అంతరాంతరాల్లో జరిగే రసాయనిక చర్యలాంటిది. బొగ్గు ముక్క వజ్రంగా మారడంలాంటిది. హీన లోహాలను బంగారంగా మార్చడం అనేది ఒక సంకేతం మాత్రమే. రసవాదులెప్పుడూ హీన లోహాలను బంగారంగా మార్చాలని అనుకోలేదు. ప్రయత్నించ లేదు. రసవాద శాస్త్రాన్ని రహస్యంగా దాచాలి. మార్మిక శాస్త్రాలను కొన్నిప్రతీకల రూపంలో భద్ర పరచాలి. ఎందుకంటే అప్పట్లో అంతర్గత శాస్త్రాన్ని గురించి మాట్లాడి బతికి బయటపడడం చాలా కష్టంగా వుండేది. అంతర్గత రసవాదాన్ని గురించి మాట్లాడేవారిని హత్య చేసేవారు. జీసస్ ను కూడా అందుకే చంపేశారు. అతడో రసవాది. అయితే ప్రస్తతం అతడి పేరు వుపయోగించకొని అభివృద్ధి చందిన క్రిస్టియానిటీ, అతడిని అనుసరిస్తున్నామంటున్న ఆ మతం, అతడికి పూర్తిగా వ్యతిరేకమైనది. క్రిస్టియన్ చర్చ్ లు ఆ రసవాదాన్ని, ఆ ప్రక్రియను అనుసరిస్తున్న వారిని మళ్ళీ చంపడం మొదలుపెడుతోంది. – అంతర్గత రసవాదం. 
                     క్రిస్టియానిటి ఎప్పుడూ ఒక మతంగా వికసించ లేదు. అది కేవలం పూజారులకు సంబంధించిన విషయంగా వుండిపోయింది. అది ఒక్క సన్యాసి`ని కూడా సృష్టించ లేకపోయింది. – మృతప్రాయమైన క్రమశిక్షణతో శిక్షణ గరిపిన పూజారులు.
                     ప్రశ్న : జీసస్ ను శిలువ వేసే సమయానికి ఇంకా తీవ్రవాదిగా, చురుకుగా వుండివుంటే, అతడు ఆథ్యాత్మికంగా పూర్తి ఎదుగుదలను సాధించ సేదని అర్ధమా ?!  బుద్దుడిలా నిశ్శబ్ధాన్ని సాధించలేదని అర్ధమా ?!
                      ఓషో : శిలువ వేసే సమయానికి అతడు అప్పుడే చంద్రభాగంలోకి ప్రవేశించడం జరిగింది. ఐతే అదే రోజే. అందుకే ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాల్సి వుంది. అందుకే బైబిల్ లో జీసస్ బుద్దుడిలా, మహావీరుడిలా,లోత్సో లా వుండడు. అతడు అది కాదు.!
                       బుద్దుడు ఒక గుడిలోకి వెళ్ళి వడ్డీ వ్యాపారిని కొట్టడాన్ని మీరు వూహించ లేరు. కాని జీసస్ ఆ పని చేశాడు. అతడు గుడికెళ్ళాడు. అప్పుడక్కడ ఒక పండుగ జరుగుతోంది. జెరూసలేం లోని ఈ గొప్ప దేవాలయంలో చాలా వ్యవహారాలు జరుగుతూ వుంటాయి. పెద్ద వడ్డీ వ్యాపారంతో ఆ గుడికి సంబంధం వుంది. ఆ గుడిలోని వడ్డీ వ్యాపారులు మొత్తం దేశాన్నే దోపిడి చేశారు. ప్రజలు సంవత్సరానికి ఒకసారి అక్కడికి వచ్చి, అధిక వడ్డీతో డబ్బును తీసుకుంటారు. ఐతే ఆ డబ్బును అంతంత వడ్డీలకు తిరిగి చెల్లించడం అసాధ్యం. అందుకోసం వారన్నిటినీ కోల్పోతారు. ఇక ఈ గుడీ, ఆ వ్యపారులు రోజు రోజుకూ ధనవంతులవుతూ వుంటారు.  అది మతం యొక్క అధికారం. దేశమంతా పేదరికంతో బాధ పడుతూ వుంటే, గుడికి మాత్రం అలవోకగా సంపద సమకూరుతూ వుంటుంది.  
                      ఒకరోజు జీసస్, చేతిలో కొరడా పట్టుకుని గుడిలోకి ప్రవేశించి, వడ్డీ వ్యాపారులను కుర్చీలనుండి పడేసి వారిని కొట్టడం మొదలు పెట్టాడు. అతడు దేవాలయంలో గందరగోళాన్ని సృష్టించాడు. బుద్దుడు ఇలా చేయడాన్ని మీరు ఊహించుకోలేరు.- అసాధ్యం.
                     జీసస్ మొదటి కమ్యూనిస్ట్. నిజంగా, అందుకే క్రిస్టియానిటీ కమ్యూనిజానికి జన్మనివ్వగలిగింది. హిందూ మతం కమ్యూనిజానికి జన్మనివ్వ లేదు. మరే మతం కూడా ఆ పని చేయలేదు. – అసాధ్యం. కేవలం అతడు మొదటి కమ్యూనిస్ట్. అతడు తీవ్రవాది. రగిలే జ్వాల.
                                    అసలతడు వాడే భాషే వేరుగా వుంటుంది. అతడికి కోపమొస్తుంది. మనం నిజంగా నమ్మలేం. అంజూర చెట్టు కాయలివ్వలేదని, ఆ చెట్టును నాశనం చేశాడు. అతడు ఎలాంటి భాషతో మాట్లాడంటే, బుద్దుడు ఆ భాషను ఉచ్ఛరించలేడు. ఎవరైతే అతనిపై, అతని దేవునిపై విశ్వాసముంచరో, వారు నరక జ్వాలలో త్రోసివేయబడతారు. నరకంలోని శాశ్వత జ్వాలల్లో వారిక వెనక్కి రాలేరు. కేవలం క్రిస్టియన్ నరకమే శాశ్వతమైనది. మిగిలిన అన్ని నరకాలూ, కేవలం తాత్కాలికమైన శిక్షలు మాత్రమే. మీరక్కడికి వెళ్తారు, శిక్షలు అనుభవిస్తారు,మళ్ళీ తిరిగి వస్తారు. కాని క్రిస్టియన్ నరకం – అది శాశ్వతమైనది. ఇది చాలా అన్యాయంగా కనిపిస్తుంది.- నిజంగా అన్యాయం. ఎంత పెద్ద పాపమైనా సరే, శాశ్వత శిక్షలో న్యాయం లేదు. అది న్యాయమనిపించదు!. అసలా పాపాలేంటి ? బెర్ట్రాండ్ రస్సెల్ ఒక పుస్తకం రాశాడు. “WHY I AM NOT A CHRISTIAN” (నేను క్రిస్టయన్ ఎందుకు కాదు?) ఆపుస్తకంలో బెర్ట్రాండ్ రస్సెల్ ఏమంటాడంటే జీసస్ అర్ధం లేనట్టు కనిపిస్తాడు. నేను చేసిన పాపాలన్నిటినీ, నేను చేయాలనుకనుని, ఎప్పుడూ చేయని పాపాలన్నింటినీ ఒప్పుకుంటే, అప్పుడు కూడా నాకు 5 సంవత్సరాత జైలు శిక్ష కంటే ఎక్కువ పడదు. అలాంటప్పుడు ఈ శాశ్వత, అంతంలేని శిక్షా పద్దతిలో అర్ధం లేదు. జీసస్ విప్లవకారుడి భాషను మాట్లాడతాడు.అన్నాడు.
                  విప్లవకారులు ఎప్పుడూ విపరీతాన్నే చూస్తారు. – మరో విపరీతాన్ని. అతడు ఒక ధనవంతుడితో (బుద్దుడో, మహా వీరుడో అలా చెప్పడాన్ని మీరు ఊహించలేరు.)ఒంటె సూది బెజ్జంలో నుండి వెళ్ళగలదేమో గాని, ధనవంతుడు నా తండ్రి రాజ్యంలో ప్రవేశించలేడు. అతడు ఆ మార్గాన్ని దాటలేడు. అని చెప్పాడు. ఇది కమ్యూనిజానికి బీజం. మూలబీజం. జీసస్ ఒక విప్లవకారుడిగా వున్నాడు. అతడికి ఆథ్యాత్మక విషయాలతోనే కాదు, ఆర్ధిక, రాజకీయ, సామాజిక విషయాలన్నింటిలో సంబంధం వుంది. నిజంగా అతడు ఆథ్యాత్మిక విషయాలకే పరిమితమైవుంటే, అతడిని శిలువ వేసి వుండేవారు కాదు. కాని ఇప్పుడతడు ప్రతి విషయంలోనూ సమస్యగా తయారయ్యాడు. సామాజిక నిర్మాణానికి, అధికారానికీ, అన్నింటికీ – అందుకే శిలువ వేయబడ్డాడు.
                         అయితే అతడు లెనిన్, మావోలాంటి విప్లవకారుడు కాదు. అవును, జీసస్ చరిత్రలో లేకపోయుంటే, లెనిన్, మార్క్స్, మావో వుండడాన్ని కూడా ఎవరూ వూహించలేరు. వారంతా తొలినాటి జీసస్ కు సంబంధించిన వారు. అతడు రగిలే జ్వాల – రెబెల్, అన్నింటినీ నాశనం చేసేందుకు సర్వసన్నధ్ధంగా వుండేవాడు. కాని అతను మామూలు విప్లవకారుడు కాదు. అతడు ఆథ్యాత్మిక వ్యక్తి కూడా. అతడో విధంగా మహావీరుడు, మావోల సంగమం. ఐతే మావో శిలువ వేయబడ్డాడు. మహావీరుడు చివరికి మిగిలాడు.
                  జీసస్ ను శిలువ వేసిన రోజు, అది శిలువ వేసిన రోజు మాత్రమే కాదు. అది అతడి ఆంతరంగిక ప్రపంచంలో మార్పు సంభవించిన రోజు కూడా. పైలెట్ జీసస్ ను జీసస్ ను నిజం ఏంటి ?“ అని అడిగిన తరువాత కూడా జీసస్ నిశ్శబ్ధంగా వున్నాడు. అతడప్పుడు ఒక జెన్ మాస్టర్ లా ప్రవర్తించాడు. అది జీసస్ ప్రవర్తన కానే కాదు. అతడి గత జీవితాన్ని చూస్తే, జీసస్ మొత్తం జీవితంలో ఎవరైనా అతన్ని సత్యం ఏంటి ?” అని అడిగినప్పుడు ఇలా నిశ్శబ్ధంగా వుండడం అనేది లేదు. అతడు నిశ్శబ్ధంగా వుండే గురువులాంటి గురువు కాదు.
                        ఏం జరిగింది ? అతడెందుకు మాట్లాడటం లేదు ? అతడి మాట పడిపోయిందెందుకు ? సృష్టి ఈ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వుపన్యాసకులలో అతడు ఒకడు. లేదా ఏ అనుమానం లేకుండా అతడే గొప్ప వక్త అని చెప్పవచ్చు. అతడు మాటల మనిషే కాని, మౌనం  మనిషి కాడు. ఐతే అతడు ఒక్కసారిగా మౌనం వహించాడు- ఎందుకు ? అతడు శిలువ వేపుకి అడుగులు వేస్తున్నాడు. అప్పుడు పైలెట్ అతన్ని అడుగుతాడు, అసలేది నిజం ?” అని. అతని జీవితమంతా అతడా నిజాన్ని నిర్వచిస్తూనే వున్నాడు. అయినా, అప్పుడు పిలాతు అడిగినప్పుడు మౌనంగా వుండిపోయాడు.
                    జీసస్ అంతర్గత ప్రపంచచంలో ఏం జరిగింది ? ఈ విషయాన్ని ఎప్పుడూ ఎవరూ ప్రస్తావించ లేదు. ఎందుకంటే ఆ విషయాలను చెప్పడం కష్టం. క్రిస్టియానిటి ఆ విషయాలను పూర్తిగా వుపరితలం మీదే వుంచేసింది. ఎందుకంటే, అంతర్గత విషయాల గురంచి కేవలం భారతదేశంలో మాత్రమే వ్యాఖ్యానించగలరు. ఇంకెక్కడా అది సాధ్యం కాదు. అంతర్గత మార్పులు కేవలం భారతదేశానికే తెలుసు. అంతర్గత ప్రపంచంలో జరిగే పరిణామాలు, ఏం జరుగుతున్నాయో భారతదేశానికే తెలుసు.
                   అకస్మాత్తుగా ఏం జరిగింది ? జీసస్ శిలువ అంచున వున్నాడు. అతడు శిలువ వేయబడతాడు. ఇప్పుడిక మొత్తం విప్లవమంతా అర్ధరహితం. అతడు అంతవరకూ మాట్లాడుతూ వచ్చిందంతా వ్యర్థం. అతడు దేనికోసమైతే బతికాడో ఆ జీవితం  చరమ దశను చేరింది. ప్రతీదీ పూర్తైపోయింది. సమయం దగ్గరకు వచ్చేసింది. కనుక ఇప్పుడతడు తనలోనికి ప్రయాణించేయాలి. ఇప్పుడిక ఏ కాస్త సమయాన్ని కూడా వ్యర్థం చేయలేడు. ఒక్క క్షణాన్ని కూడా అతడు కోల్పోలేడు. శిలువ వేసే ముందే అతడు పూర్తి చేయాలి. అతడి అంతర్గత ప్రయాణాన్ని పూర్తి చేసి తీరాలి.
                   నిజంగా, అతడు అంతర్గత ప్రయాణం చేస్తూ వస్తున్నవాడే, అయితే అతడు బాహ్య ప్రపంచ సమస్యలతో కూడా ముడిపడి వున్నాడు. బాహ్య ప్రపంచంలోని సమస్యల కారణంగా, అతడు అతని చల్లని చంద్రస్థానికి వెళ్ళలేక పోయాడు. అతడు వాడిగా, వేడిగా జ్వాలలాగే వుండిపోయాడు. ఒక విధంగా అతడు కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా అలా వుండివుంటాడు.
                          జీసస్ కు బాప్టిస్ట్ అయిన జాన్ దీక్ష ఇచ్చాడు. అతడు జాన్ బాప్టిస్ట్ శిష్యుడు. జాన్ కూడా గొప్ప విప్లవకారుడైన ఆథ్యాత్మిక వ్యక్తి. అతడు జీసస్ కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు. జోర్డాన్ నదిలో జీసస్ కు దీక్ష ఇచ్చిన రోజు, అతడు జీసస్ తో ఇప్పుడు నీవు నా పనిని కొనసాగించు. ఇక నేను మాయమైపోతాను. నేను చేసింది చాలు.అన్నాడు. ఆ రోజు తరువాత అతడు మళ్ళీ చాలా అరుదుగా కనిపించాడు. అతడు అడవుల్లోకి మాయమైపోయాడు. (ఖైదు చేయబడి, తల నరికి చంపబడ్డాడు.) అంతర్గత ప్రపంచ పరిభాషలో చెప్పాలంటే అతడు సూర్యస్థానం నుండి చంద్రస్థానికి వెళ్ళాడు. అతడు పని చేశాడు. తరువాత ఎవరైతే ఆపనిని చేయగలరో వారికి అప్పజెప్పాడు.
                     శిలువ వేసే రోజు జీసస్ కు, అతడే పని అయితే చేస్తున్నాడో ఆ పని పూర్తైందని అర్థమైవుంటుంది. మరే అవకాశం లేదు. ఇక ఇప్పుడు నేనేమీ చేయలేను. నేనిక లోపలికి ప్రయాణం చేయాలి. ఈ అవకాశాన్ని వదులుకోలేను.అనుకున్నాడు. అందుకే, పైలెట్ అతడిని నిజం ఏమిటి ?” అని అడిగినప్పుడు, అతడు నిశ్శబ్ధంగా వుండిపోయాడు.  నిజానికా ప్రవర్తన జీసస్ లా లేదు. అదొక జెన్ గురువులా వుంది. అదొక బుద్దుడి ప్రవర్తనలా వుంది. దీని వల్లే, ఈ కారణంగానే అద్భుతం జరిగింది. అదే క్రిస్టియానిటికి ఒక రహస్యంగా, నిగూఢమార్మిక విషయంగా మిగిలిపోయింది. ఈకారణంగానే ఆ అద్భుతం జరిగింది.
                    అతడు అతని చల్లని కేంద్రం చంద్రస్థానం వైపు వెళ్ళ్తూ వుండగా, అతన్ని శిలువ వేశారు. ఎవరైనా మొదటిసారి చంద్ర స్థానికి వస్తే, అప్పుడతని శ్వాస ఆగిపోతుంది. ఎందుకంటే శ్వాసక్రియ కూడా సూర్య కేంద్రంయొక్క చర్యే. అన్నీ నిశ్శబ్ధం ఐపోతాయి. ప్రతీదీ చనిపోయినట్టుగా ఔతుంది. అతడు తన అంతర్గత ప్రపంచంలోని చంద్రస్థానం వైపు ప్రయాణించాడు. అప్పుడతడు శిలువ వేయబడ్డాడు. వారంతా అతను చనిపోయాడనే అనుకున్నారు, నిజానికతను చనిపోకపోయినా _ అది ఒక పొరపాటు. వారలా అపార్థం చేసుకున్నారు. అతడిని శిలువ వేస్తన్న వారంతా, అతను చనిపోయాడనే అనుకున్నారు. నిజానికతడు తన చంద్రస్థానంలో వున్నాడు. అక్కడ శ్వాస ఆగిపోతుంది.  అక్కడ ఉచ్ఛ్వాస లేదు, నిశ్వాస లేదు. ఉచ్ఛ్వాస  _ నిశ్వాసల మధ్య సమయంలో శ్వాసక్రియ లేదు.
                         ఎవరైనా ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసల మధ్య నిలబడితే, అంతటి గాఢమైన సమతూకంలో వుంటే, అది చావులా కనిపిస్తుందే కాని అది మరణం కాదు. అదుకే వారు, జీసస్ ను శిలువ వేసిన వారు, జీసస్ ను హత్య చేసిన వారు అతడు చనిపోయాడనే అనుకున్నారు. అందుకే అతని శరీరాన్ని కిదకు తీసుకు వచ్చేందుకు అతని శిష్యులను అనుమతించారు. యూదులు శిష్యులను అనుమతించారు.  యూదుల సంప్రదాయం ప్రకారం శరీరాన్ని దగ్గరలో వున్న కొండగుహలో భద్రపరచారు.
                      అతడు నిజంగా చనిపోలేదు. ఒక సైనికుడు అతన్ని శూలంతో గుచ్చినప్పుడు, అతని శరీరం నుండి రక్తము, నీరు కారడమే అందుకు ఆధారం. మూడు రోజుల తరువాత గుహలో చూస్తే అతనక్కడ లేడు. మృత శరీరం మాయంయింది. నలుగురైదుగురు వ్యక్తులు అతడిని చూశారు. ముందుగా అనుమానించినా, అతని గాయాలను చూసి నమ్మి, జీసస్ తిరిగి లేచాడుఅని ఇతరులకు తెలియజేశారు.
                     అతడు జెరూసలేంనుండి తప్పించుకుపోయాడు. నేను మీతో చెప్పినట్టు, అతడు మళ్ళీ కాశ్మీర్ కు వచ్చి అక్కడే వున్నాడు. ఐతే అతని తరువాత జీవితం _ అది జీసస్ జవితం కాదు. క్రీస్తు జీవితం. జీసస్ సూర్యస్థానమైతే, క్రీస్తు చంద్రస్థానం. అతడు పూర్తి నిశ్శబ్ధంగా వుండిపోయాడు. అందుకే అతనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. అతడు మాట్లాడడు. ఎలాంటి సందేశం ఇవ్వడు. ఏమీ బోధించడు. అతడు పూర్తి నిశ్శబ్ధంగా వుండిపోయాడు. ఇప్పుడిక అతడెంత మాత్రం విప్లవకారుడు కాడు. అతడు కేవలం ఒక గురువు. అతడు నిశ్శబ్ధంలో జీవిస్తున్న గురువు. అందుకే అతి తక్కువమంది అతని దగ్గరకు రాగలిగారు.
                   బహిరంగ సమాచారం ఏమీ లేకపోయినా ఎవరైతే ఆయనను తెలుసుకోగలిగారో, వారు మాత్రమే ఆయన దగ్గరకు రాగలిగారు. వారు నిజంగా కొద్దిమంది కారు, ప్రపంచ జనాభాతో పోలిస్తే వారు కొద్దిమందే అయినప్పటికీ, చాలామందే వున్నారు. అతని చుట్టూ ఒక గ్రామమే ఏర్పడింది. కాశ్మీర్ లో ఆ గ్రామాన్ని ఇప్పటికీ బెత్లెహామ్ (Bethlehem), బెత్లెమ్ (Bethlem) అంటారు. ఒక సమాధిని కూడా వారు భద్రపరిచారు. అది జీసస్ సమాధి.
                    క్రిస్టియానిటి అసంపూర్తిగా వుందని నేనన్నాను. ఎందుకంటే దానికి కేవలం జీసస్ యొక్క తొలి జీవితమే తెలుసు. అందుకే క్రిస్టియానిటి కమ్యూనిజానికి జన్మనివ్వగలిగింది. అయితే జీసస్ పూర్తి జ్ఞానోదయంపొందిన స్థితిలోనే మరణించాడు. ఆయన పూర్ణ చంద్రుడు.     

మాథ్యూ గాస్పెల్ పై ఓషో ప్రసంగం నుండి కొంత భాగం:

                                నేనొక తాగుబోతుని. మీరు నమ్ముతారో లేదో కాని నేను మత్తిలి వున్నాను. మీరు నా కళ్ళలో చూడగలరు. మీరు దాన్ని చూడగలరు. – నేను జీసస్ ను పానం చేసి వున్నాను. జీసస్ ఒక మధువు. అతడు మనిషి కాడు, అతడో మత్తు. ఒక్కసారి అతడిని రుచి చూస్తే, ఇక ఈ ప్రాపంచిక విషయాలేవీ మీకు అర్థవంతంగా కనిపించవు. ఒక్కసారి అతీతానికి అర్థం ఏమిటో, - అది మీలో ప్రవేశిస్తే ఈ ప్రపంచం మొత్తం అనవసరమైనదిగా, అర్థం లేనిదిగా, ప్రాముఖ్యత లేనిదిగా తయారవుతుంది.
                      మతం ఒక రకమైన మత్తు. దీన్ని అర్ధం చేసుకోవాల్సి వుంది. ఎందుకంటే మత్తు లోతుగా లేకపోతే, మీ జీవితానికి ఎప్పటికీ అర్థం వుండదు. అదొక వ్యాసంలా వుంటుంది తప్ప కవితలా వుండదు. మీరు నడుస్తారు, కాని ఎప్పటికీ నాట్యం చేయలేరు. మీరు నాట్యం చేయనంత వరకూ కోల్పోతూనే వుంటారు. మీరు ఉధృతంగా, మైమరచి, మీరా నాట్యంలో అదృశ్యమైపోయేలా నాట్యం చేయనంత వరకూ, _ ‘నాట్యం చేసేవాడు మాయమై పోయి, కేవలం నాట్యం మాత్రమే వుండేలా’ _  అప్పుడు మాత్రమే మీరు జీవితం అంటే ఏమిటో తెలుసుకోగలుగుతారు.
                              నాకు గుర్తుంది : ఒకసారి అలక్సాండర్, డైజీన్సే ను నీవు చాలా తెలుసుకున్నావు, చాలా చదువుకున్నావు కదా ! దేవుడి గరించి నాకేమయినా చెప్పలేవా ? దేవుడంటే ఏంటి ?” అని అడిగాడు.
                    డైజీన్స్ ఒక్క నిమిషం ఆగినాకో రోజు సమయం ఇవ్వండిఅన్నాడు. 
                    అలెక్లండర్ మరుసటి రోజు వచ్చాడు. డైజీన్స్ మళ్ళీ నాకు రెండు రోజుల వ్యవధి ఇవ్వండి  అని అడిగాడు. రెండు రోజుల తరువాత మళ్ళీ అతను నాకు మరో నాలుగు రోజులు గడువివ్వండిఅన్నాడు. అదలా నాలుగు, ఐదు, ఆరు మొత్తం వారం రోజులు గడిచిపోయింది.
                    అలెక్సాండర్ కు చాలా కోపం వచ్చింది. నీవేమనుకుంటున్నావు, నీకు తెలియకపోతే, నాకీ మాట ముందే చెప్ప వలసింది. నీకు తెలిస్తే , ఈ ఆలస్యానికి కారణం ఏంటి ?” అని అడిగాడు.
                    అందుకు డైజీన్స్ మీరు నన్ను ప్రశ్నించినపుడు నాకు తెలుసనే అనుకున్నాను. ఐతే నేను దాన్ని పట్టుకోవాలని ప్రయత్నంచిన కొద్దీ, అది మరింత దూరమైపోతుంది.ప్రస్తుతం నాకు ఏమీ తెలియదు. అంతేకాదు ఎవరైతే తమకు దేవుడు తెలుసనుకుంటారో, వారికి తెలీదు.అనిమాత్రం నేను చెప్పగలను అన్నాడు.
                    మీరు లేనప్పుడు మాత్రమే దేవుడు ప్రకటితమౌతాడు. మీరు మరొక తాగుబోతు కానంత వరకు అని దాని అర్ధం. అదే మీ అహం మాయమయినప్పుడు. నేనో తాగుబోతును, జీసస్ ను తాగాను. నేను మీతో జీసస్ గురించి మాట్లాడేటప్పుడు అది జీసస్ గురించి కాదు. నేను తత్త్వవేత్తను కాను, క్రిస్టియన్ కాను, మేధావిని కాను. తాత్త్వికులు ఒక విషయాన్ని గురించి మాట్లాడతారు. వారు దాని చుట్టూ తిరుగుతూనే వుంటారు. వారు పొద చుట్టూ కొడుతూ వుంటారు. నేను జీసస్ గురించి మాట్లాడను _ నేను జీసస్ నయి మాట్లాడతాను. నేను జీసస్ గురించి మాట్లాడితే, అది అతడి గురించి మాట్లాడటం అవ్వదు సరికదా, అతడే మాట్లాడతాడు. నేనతనికి మార్గాన్నిస్తాను. నేనొక మార్గం ఔతాను. అతడి ప్రవాహాన్ని అడ్డుకోకుండా వుండటమే నేను చేసేదంతా. జీసస్ గరించో, బుద్దుడి గరించో, లేదా కృష్ణుడి గురించో మాట్లాడాలంటే అది ఇలాగే సాధ్యం.
                       అలాగే నేను జీసస్ గురించి మాట్లాడితే, క్రీస్తు గురించి మాట్లాడను. జీసస్ నిజం. క్రీస్తు ఒక ఊహాజనితం. జీసస్ నీలా, నాలా రక్త మాంసాలతో కూడిన మనిషి. అతడి గుండె కొట్టుకుంటుంది. అతడు నవ్వుతాడు, ఏడుస్తాడు, ప్రేమిస్తాడు, జీవిస్తాడు.
                     క్రీస్తు ఒక మృతప్రాయమైన సిద్ధాంతం. అందులో జీవం లేదు, గుండె చప్పుడు లేదు. క్రైస్తవ మతం క్రీస్తును మాత్రమే పట్టించుకుంటుంది. నేను క్రీస్తును చట్టించుకోను.క్రీస్తు అన్న పదం చాలా అందమైనది, కాని దాన్ని మలిన పరిచారు. అది పాడైపోయింది. క్రీస్తు కున్న అందాన్నంతా నాశనం చేయడం జరిగింది.
                       వేదాంతులు ఏ పదాన్ని వాడినా, ఆ పదం దాని స్వచ్ఛతను, అర్ధాన్ని, సౌందర్యాన్ని కోల్పోతుంది. అది సహజంగా వుండదు. జీసస్ ఇంకా సహజత్వాన్ని కోల్పోలేదు. క్రీస్తుపూర్తిగా కలుషితమైపోయింది. క్రీస్తి అనేది ఒక సిద్ధాంతం. జీసస్ సత్యం, నిర్ద్వందమైన సత్యం.
                          చూడండి ! నేను మనిషిని ప్రేమిస్తాను. మానవత్వాన్ని కాదు. మానవత్వమనేది అసలుండదు. కేవలం మనుషులు వుంటారు. ఇక్కడొకరు, అక్కడొకరు, ఐతే ఎప్పుడూ ఒంటరిగానే వుంటారు. మానవత్వం పేలవమైన పదం, అలాంటిదే క్రీస్తు కూడా. జీసస్ వున్నాడు. కొన్నిసార్లు బుద్ధుడైన గౌతముడిలో, మరికొన్నిసార్లు మహ్మద్ ప్రవక్తలో, కొన్నిసార్లు మురళిని వాయించే కృష్ణడిలో_ ఇక్కడ, అక్కడ – అది ఎక్కడయినా చాలా స్పష్టమైన సందర్భం. క్రీస్తు అనేది ఊహాజనితమైంది. క్రీస్తు కేవలం తత్త్వశాస్త్ర వేదాంత పుస్తకాలలో మాత్రమే వుంటుంది. క్రీస్తు అనే వాడు ఈ భూమి మీద ఎప్పుడూ నడవలేదు. మరో విధంగా చెప్పాలంటే క్రీస్తు దేవుని కుమారుడు, జీసస్ మనిషి కుమారుడు.
                         మనిషి కుమారుడైన జీసస్ గురించి మాట్లాడనివ్వండి. ఎందుకంటే మనిషి కుమారుడు మాత్రమే ఎదిగి, దేవుని కుమారుడిగా మారగలడు. కేవలం మనిషి మాత్రమే ఎదిగి దేవుడవ్వగలడు. ఎందుకంటే మనిషి విత్తనం, మూలం _ దేవుడు వికాసం. దేవుడు ఎక్కడా వుండడు. మీరు వికసిస్తే దేవుడు వునికిలోకి వస్తాడు. అది ఈ ప్రకృతిలోకి వస్తుంది _ మాయమౌతుంది. అది ఈ భూమ్మీదకు వచ్చి మాయమవుతుంది. బుద్దుడు ఇక్కడ వున్నప్పుడు, దేవుడు వున్నాడు. జీసస్ ఇక్కడ వున్నప్పుడు దేవుడు వున్నాడు. జీసస్ మాయమైనపుడు, దేవుడు మాయమయ్యాడు. దేవుడు ఎక్కడో వుండేవాడు కాడు. అలా వుండి వుంటే, దేవుడు తాజాగా, యవ్వనంతో స్వచ్ఛంగా వుండగలిగే వాడు కాదు. దేవుడు కూడా దుమ్ము పట్టి అసహ్యంగా తయారయ్యే వాడు. ఎప్పుడైతే మనిషి తన పాపాలను తెలుసుకుంటాడో, ఎప్పుడైతే మనిషి నిజంగా వుంటాడో అప్పుడు దైవం సాక్షాత్కరిస్తుంది. ఎప్పుడైతే మనిషి సంపూర్ణంగా వుంటాడో, ఆ అరుదైన క్షణాల్లో దేవుడుంటాడు. అందుకే మీరు నన్ను, దేవుడెక్కడున్నాడు ?” అని అడిగితే నేను మీకు చూపలేను. మీలోనే అతడు లేకపోతే, అతడు లేనట్టే. మీతే అతడు కానంత వరకు, దేవుడిగా మారనంత వరకూ, అతడు లేనట్టే. ప్రతి ఒక్కరు వారి వారి హృదయపు దేవాలయంలో దేవుని దేవుని తెలుకోవాల్సి వుంది. మీరతడిని ఒక విత్తనంలా మోస్తున్నారు. ఆ విత్తనం మొలకెత్తి, పెరిగి పెద్ద వృక్షంగా మారేందుకు మీరు అనుమతించాల్సి వుంది.                             
                               అందుకే నేను క్రీస్తు గురించి మాట్లాడబోవడం లేదు. జీసస్ గురించి మాట్లాడతాను. క్రీస్తను చర్చ్ లో ఖైదుగా వుండనీయండి. క్రీస్తు వుండటానికి అవే అనువైన ప్రదేశాలు. జీసస్ మీ హృదయాలలోకి ప్రవేశిస్తే నేను సంతోషిస్తాను. క్రీస్తును మర్చిపోండి . జీసస్ ను గుర్తుంచుకోండి. కాని దీనికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది. మనుషులు జీసస్ ను పూర్తిగా మర్చిపోయారు. రెండు వేల సంవత్సరాలుగా మనుషులను ఊదరగొట్టేశారు. క్రీస్తు గుర్తుండిపోయాడు. క్రీస్తు మిమ్మల్ని మార్చలేడు. ఎందుకంటే అక్కడ మీకు, క్రీస్తు కు మధ్య వారధి లేదు. ఇప్పుడక్కడ వారధి నిర్మించడానికి అసాధ్యమైన అగాధం వుంది. అదే జీసస్ తో మీకు సాన్నిహిత్యం వుంది. మీరు జీసస్ ను సోదరుడిగా అనుకోగలరు. అదే క్రీస్తును మా సోదరుడిగా అనుకోలేరు. మీలో గాఢమైన సోదరభావం కలగనంత వరకూ, ఒక వారధి లేనంత వరకూ జీసస్ మీకే విధంగా సహాయపడగలడు. జీసస్ కు అందం వుంది. ఆయన అందానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత వుంది. బుద్దుడు అదగాడు. ఐతే జీసస్, బుద్దుడికి పూర్తి భిన్నంగా వుంటాడు. బుద్దుడిలో మరోరకమైన నిశ్శబ్దం రూపందాల్చింది.
                             నేనొక చైనా చక్రవర్తి గురించి విన్నాను. అతని ఆస్థానంలో ఇద్దరు గొప్ప చిత్రకారులున్నారు. వారిద్దరూ  ఎప్పుడూ ప్రత్యర్ధులుగా వుండేవారు. వారెప్పుడూ పోటీపడుతూ, కొట్లాడుతూ వుండేవారు. అయితే ఇద్దరిలో ఎవరు గొప్పో నిర్ణయించడం అసాధ్యమయ్యేది. వారిద్దరూ ఆ కళలో నిష్ణాతులే.
                            ఒకరోజు చక్రవర్తి మీరిద్దరూ ఒకే అశం మీద చిత్రం గీయండి. దాన్నిబట్టి మీలో ఎవరు గొప్పో చెప్పవచ్చుఅన్నాడు. వారికిచ్చిన విషయం విశ్రాంతి. మొదటి చిత్రకారుడు అసలే అనుమానంలేని నిశ్శబ్ధంగా వుండే కొలనును ఎన్నుకున్నాడు. అతడు ఒక కొలను చిత్రించాడు. నిశ్శబ్ధంగా, పర్వతాలకు దూరంగా, ఒంటరిగా, నిశ్చలంగా - కనీసం ఆకొలనులో ఒక్క అల కూడా లేదు. ఆ చిత్రాన్ని చూస్తే మీకు నిద్ర వస్తుంది.
                           రెండవ చిత్రకారుడు దీనికి పూర్తి వ్యతిరేకమైనదాన్ని ఎన్నుకున్నాడు. అతను ఉధృతమైన నీటి ప్రవాహాన్ని చిత్రించాడు. మైళ్ళకొద్దీ ప్రవహించే ఆ ప్రవాహం, పైన తెల్లటి నురగతో పర్వత శిఖరం పైనుండి లోయలోకి పడుతోంది. ఆ ప్రవాహానికి అతి దగ్గరలో రావి చెట్టు, దాని కొమ్మలు లోయలోకి వంగి ప్రవాహపు నురగను తాకుతున్నాయి. ఆ రావి చెట్టుమీద  పాలపిట్ట గూడు, ఆ గూటిమీద ఒక పాలపిట్ట కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చుని వుంది. అది బాగా తడిసిపోయి వుంది.
                                    మొదటి చిత్రం ఏమాత్రం చలనం లేని నిశ్శబ్ధం. అది ఎక్కువగా మృత్యువుని పోలివుంది. జీవం అతి తక్కువగా వుంది. వ్యతిరేకమైంది అందులో ఏదీ లేదు. ఆ విశ్రాంతిలో ఎలాంటి ఉద్వేగమూ లేదు. ఆ విశ్రాంతి – అది – అసలు లేనట్టుగా వుంది తప్ప, ఉన్నట్టుగా లేదు. రెండవది చాలా శక్తివంతమైన వస్తువు. విశ్రాంతే – కాని అది మరణించి లేదు. అది సజీవంగా, సచేతనంగా వుంది. తుఫాన్ లాంటి ఉధృతమైన జలపాతం, ఒక గూడు _ ఆ గూటి పైన పాలపిట్ట నిశ్శబ్ధంగా కూర్చుని వుంది.
                          జీసస్ ఆ రెండవ చిత్రంలాంటి వాడు. బుద్దుడు మొదటి చిత్రానికి దగ్గరగా వుంటాడు. నిజమే అది చాలా నిశ్శబ్ధంగా వుంది. అయితే దాని వ్యతిరేకమైంది అందులో లేదు. వ్యతిరేక స్వరాలు లేకుండా సంగీతాన్ని సృష్టించలేము. బుద్దుడు ఒంటరి స్వరం. అతడు సంగీత సమ్మేళనం కాదు. జీసస్ లో విభిన్న స్వరాల కలయిక వుంది. స్వర సమ్మేళనం వుంది. అందులోనే ఒక అద్భుతమైన సమన్వయం వుంది. ఒక సింఫనీ వుంది. బుద్దుడు ఎలాంటి తిరుగుబాటు లేకుండా నిశ్శబ్ధంగా వుంటాడు. జీసస్ కూడా నిశ్శబ్ధంగానే వుంటాడు. ఐతే అతని అంతర్గత లోతుల్లో కరుడుగట్టిన తీవ్రవాది వుంటాడు. దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు అతడి హృదయంలోకి చొచ్చుకుపోవడం ఎలాగో అర్ధమవుతుంది. జీసస్ ప్రముఖుడు అయ్యాడు - ఎందుకు? అతడు గత 20 శతాబ్దాలుగా చాలామందికి అభిమానపాత్రుడయ్యాడు, ఎందుకని ?  అతడు కొంత అడవి మనిషిలా wild గా వుంటాడు. అతడు తోటలాగా వుండడు. అతడోక భీభత్సం. అతడు మొరటు- సానబెట్టిన వాడు కాడు. నీవతడిని తాకితే నీకర్ధమవుతుంది. అతడిని అనుభూతి చెందితే నీకు తెలుస్తుంది. బుద్దుడు చాలా నాగరికత తెలిసిన వాడు, సాన బెట్ట బడిన వాడు. అతడిలో రాజరికానికి వుండే మర్యాదలు, నాగరికత వున్నాయి. జీసస్ ఒక గ్రామం నుండి వచ్చాడు. వడ్రంగి కుమారుడు. చదువు, సంధ్యలు లేని వాడు. అతడు అడవిలాంటి వాడు. మొరటు. ఐతే సజీవమైన వాడు, తీవ్రవాది. అందుకే అంత ఆకర్షణ. అందుకే అతను కోటాను కోట్ల మానవాళి హృదయాన్ని చూరగొన్నాడు. మీరతడిని అర్ధం చేసుకోగలరు. అతడు మీకంటే ఎక్కువే.కాని అతడిలో మీరు కూడా వున్నారు. మీరు బుద్దుని అర్ధం చేసుకోలేరు. అతడూ మీకంటే ఎక్కువే, ఐతే అక్కడ మీరుండరు. జీసస్ తో ఒక వారధి సాధ్యమవుతుంది.  
మత్తయి 13 అధ్యాయము
53 యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత, ఆయన అక్కడినుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి, సమాజ మందిరములలో వారికి బోధించు చుండెను.| 54  అందువలన వారశ్చర్య పడి _ ఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతనికెక్కడినుండి వచ్చినవి.? |   55 ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా యనువారు ఇతని సోదరులు కారా? | 56 ఇతని సోదరీమణులందరు మనతోనేయున్నారు కారా ? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడినుండి వచ్చెనని చెప్పుకొని  ఆయన విషయమై అభ్యంతరపడిరి.
                         
             బుద్దుని చూసి ఎప్పుడూ, ఎవరూ అంతగా అభ్యంతర పడలేదు. లోత్సోను చూసి కూడా వారెవరూ అభ్యంతర పడలేదు. జీసస్ దగ్గర అభ్యంతర పడినంతగా, గాయపడినంతగా మరెవరి దగ్గరా ఎవరూ ఎప్పుడూ గాయపడ లేదు. ఎదుకని ? బుద్దుడనే వాడు చాలా దూరంలో శిఖరాగ్రంలో వుంటాడు. అసలు మీరతడిని అర్ధం చేసుకోనప్పుడు, అతడి వల్ల గాయపడే ప్రసక్తే వుండదు కదా ! మీరు అతడిని అర్ధం చేసుకోలేనప్పుడు, అతడితో ఎలా వాదించగలరు ? అతడు చాలా దూరంలో వున్నాడు. ఆవలి ఒడ్డున. మీరు ఏదయినా చేయగలిగితే, అది అతడిని పూజించడం మాత్రమే ! అందుకే బుద్దుడు పూజింపబడ్డాడు. జీసస్ శిలువ వేయబడ్డాడు. బుద్దుడు ఎక్కడి వెళ్ళినా అతడి వల్ల ఎవరూ బాధపడలేదు, అలాగే ఎవరూ అతడిని అర్ధం చేసుకోలేక పోయారు. అప్పుడసలు మీరు గాయపడలేరు కూడా. లేదా మనుషులు అతడిని ఉపనిషత్తుల స్వరూపంగా అర్ధం చేసుకున్నారు. వేదాల అవతారమని అనుకున్నారు. అతడే ప్రాచీన ధర్మమనుకున్నారు. అందుకే అతడి వల్ల గాయపడే ప్రశ్నే లేకపోయింది.
                                జీసస్ దగ్గర మనుషులు గాయపడ్డారు. వారి అహం (ego) దెబ్బతింది. అతడు వారిలానే వుండేవాడు. కాని వారు అతడిని అర్ధం చేసుకోలేకపోయారు. వారు ఇతడు వడ్రంగి కొడుకే కదా !” అన్నారు.
                               బుద్దుడు చక్రవర్తి కుమారుడు, మహా వీరుడు కూడా. కృష్ణుడు, రాముడు అందరూ రాజ కుమారులు. భారతదేశంలోని అవతార పురుషులందరూ రాజ కుటుంబాలనుండి వచ్చారు. కేవలం జీసస్ మాత్రమే పేదకుటుంబంనుండి వచ్చాడు. అతడు ఇదివరకెప్పుడూ ఎవరికీ తెనియదు. అసలు జీసస్ పుట్టివుండకపోతే అతడి కుటుంబంగురించి ఎవరూ పట్టించుకునే వారు కాదు. బుద్దుడి కుటుంబం అప్పటికే ప్రఖ్యాతిగాంచినది. అతడికి సుదీర్ఘమైన చరిత్ర, సంస్కృతి, అధికారం, గౌరవం వున్నాయి. జీసస్ ఏ అధికారం లేని నిరుపేద కుటుంబంవుండి వచ్చాడు. అందుకే మనుషులు అర్ధం చేసుకోలేకపోయారు.ఇతడికి ఈ శక్తి అధికారం ఎక్కడినుండి వచ్చాయి? ఇతడు మన వడ్రంగి కొడుకు కాదా !? ఇతడి తల్లి మరియే కదా !?”  అని అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు.      అతడు మన వాడై వుండి, దేవుని గురించి మాట్లాడుతున్నాడు. అతడు మనతో సమానమైవుండి నేను దేవుని కుమారుడనుఅని చెప్తున్నాడు. ఇతడు మనలో ఒకడైవుండి, _ అకస్మాత్తుగా ఇతనికేమయింది ?”_ వారి అహం దెబ్బతింది. వారు గాయపడ్డారు.
                              బుద్దుడు ఎప్పుడూ గొప్పవాడే. అతడు జ్ఞానోదయం పొందకపోయినా, అతడిని ఒక చక్రవర్తిగా గౌరవించేవారు. మనుషులు ఎప్పుడూ అతని పాదాలకు నమస్కరించే వారు. అతడెప్పుడూ వారికంటే గొప్పవాడే. ఎప్పుడూ అందుబాటులో వుండేవాడు కాడు. అతడు కుటుంబాన్ని, రాజ్యాన్ని వదిలేసినప్పుడు ఇంకా గొప్పవాడు అయ్యాడు. ఎందుకంటే అతడు తన రాజ్యాన్ని త్యాగం చేశాడు కదా ! అందుకు! మనుషులు డబ్బు భాషను తప్ప మరో భాషను అర్ధం చేసుకోలేరు. నీ దగ్గర డబ్బుంటే నిన్ను గౌరవిస్తారు. నీ డబ్బును త్యాగం చేస్తే, అప్పుడు పూజిస్తారు. ఎప్పుడయినా వారు ఒకే భాషను అర్ధం చేసుకుంటారు. అదే డబ్బు భాష. నీకేమీ లేకపోతే వారు నీ గురించి పట్టించుకోరు. అసలు మాకేమీ లేకపోతే మీరు ఎలా త్యాగం చేస్తారు ? ఏం త్యాగం చేస్తారు ?
                                          భారతీయుల మనస్తత్వానికి సంబంధించి ఇది చాలా ముఖ్యమైన అర్ధం చేసుకోవాల్సిన విషయం. భారతీయుల ధార్మిక మనస్తత్త్వం అనే ఆ మనస్సు కూడా డబ్బు భాషనే అర్ధం చేసుకోగలదు. మహావీరుడు వదిలేశాడు. జైన శాస్త్రాలన్నీ నిరంతరం అతడెంత త్యాగం చేశాడో, దాని గురించే మాట్లాడుతూ వుంటాయి. ఎన్ని ఏనుగులు, ఎన్ని గుఱ్ఱాలు, ఎన్ని ఒంటెలు, ఎంత బంగారం, ఎన్ని వజ్రాలు... ఇలా వారు చెప్తూపోతూనే వుంటారు. ఎందకని ? ఎందకీ లెక్కలన్నీ ? నిజానికతడు గొప్ప చక్రవర్తి ఎప్పుడూ కాదు. అతడి రాజ్యం చాలా చిన్నది, అదొక జిల్లా కంటే పెద్దది కాదు. అతడి తండ్రి జిల్లా కలెక్టర్ కంటే గొప్ప అధికారి కాదు. ఎందుకంటే మహావీరుని కాలంలో భారతదేశం రెండు వేల రాజ్యాలుగా విడగొట్టబడింది. అలాంటప్పుడు ఒక రాజ్యం అంతకంటే పెద్దగా వుండే అవకాశం లేదు. అలాగే అతడికి అన్ని గుర్ఱాలు, ఏనుగులు, బంగారం వుండటమూ అసాధ్యమే. అంతా గోరంతలు, కొండంతలు చేయడమే. కాని మనుషులు డబ్బు భాషనే అర్ధం చేసుకుంటారు. వాళ్ళు విషయాన్ని పెద్దగా చూపుతారు. ఎందుకంటే మహావీరుడు గొప్పవాడని నిరూపించడానికి అదొక్కటే మార్గం. అతడొక వడ్రంగి కొడుకయి వుంటే, ఎవరూ అతడి గురించి పెద్దగా పట్టించుకొని వుండే వారు కారు.
                               మతాలకు సంబంధించినంత వరకూ జీసస్ ఒక విప్లవం. మొట్టమొదటిసారిగా నేను దేవుని కుమారుడిని అని ప్రకటించిన అతి పేదవాడు అతను. నేను ఒక ప్రవక్తను, ఒక తీర్థంకరుడిని, అవతార పురుషుడినిఅని ప్రకటించే ధైర్యం చేసిన మొదటి పేదవాడు. మానవ జాతి చరిత్రలో అంతవరకు అలాంటిది జరుగలేదు. అతడు చాలామందికి మార్గం చూపించాడు. తరువాత మహ్మద్ ప్రకటించగలిగాడు. ఆ తరువాత కబీర్, సేన, నానక్, దాదు ఇలా చాలామంది. జీసస్ మార్గాన్ని తెరిచాడు. ఏమీ లేని పేదవాడు, త్యాగం చేయడానికి ఏమీ లేని పేదవాడు కూడా త్యాగం చేయగలడు. ఎందుకంటే అసలు మనం వదిలేయాల్సింది డబ్బును కాదు, అహాన్ని. నిజంగా మనం వదిలేయాల్సింది ధనాన్ని కాదు. నన్ను మళ్ళీ చెప్పనీయండి, ధనాన్ని కాదు, అహాన్ని. అది మీ దగ్గరున్న దాన్ని వదిలేయడానికి సంబంధించినది కాదు, నిన్ను నీవే వదులుకోవడానికి సంబంధించిన విషయం. మీ దగ్గర చాలా వుండవచ్చు గాక, దాన్నంతటినీ మీరు వదులుకోవచ్చుగాక, కాని మీ అహం కొనసాగితే, - అది కొనసాగే అవకాశం వుంది. ఎక్కువ సంపాదించడం వల్ల అహం సంతృప్తి చెందుతుంది. ఎక్కువ త్యాగం చేయడం వల్ల కూడా అది సంతృప్తి చెందుతుంది. అహం వుంటే మీరు చాలా సామాన్యంగా, చాలా పైపై విషయాలలోనే వుంటారు.                  
                      కాని జీసస్ వారితో ఒక ప్రవక్త గౌరవం లేకుండా వుండకూడదు. అతడిని తన దేశంలోనే కాపాడండి, తన ఇంటిలోనే.... అన్నాడు.
                  చాలా గొప్ప అవగాహన. అతి సన్నిహితులే ఎప్పుడూ అపార్ధం చేసుకుంటారు. ఇలా చాలా చాలాసార్లు జరిగింది. ఎందుకని? మనం పూర్తి వ్యతిరేకంగా వూహించుకుంటాం. జీసస్ గ్రామంలోని వారే, అతడిని ముందుగా అర్ధం చేసుకున్నారనుకుంటాం. అందరి కంటే ముందు జీసస్ పరివారం, అతడి బంధువులూ, తల్లిదండ్రులు ముందుగా అతడిని అర్ధం చేసుకున్నారనుకుంటాం. కాని అలా జరగలేదు. ఎందుకని ? దీన్ని అర్ధం చేసుకోవాలంటే మనిషి అహంకారాన్ని చాలా లోతుగా అర్ధం చేసుకోవాలి. మీకు అతి దగ్గరి వారికి, మీరు వారికంటే ముందుకు, పైకి వెళ్ళారని గుర్తించడం, నమ్మడం చాలా కష్టం. ఎవరైనా మీకు సన్నిహితులు కాని వారు, మిమ్మల్ని మించి వెళ్తే, అది మిమ్మల్ని ఏవిధంగానూ ఇబ్బంది పెట్టదు. అతడు మన వాడు కాదు. పోటీ మనస్తత్త్వం ఇక్కడ తలెత్తే అవకాశం లేదు. అదే మీ సొంత తమ్ముడు వెళ్ళి, మీరు వెనకబడి పోతే – మీరిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టారు, ఒకే ఇంట్లో పెరిగారు, ఒకే బడిలో చదివారు. ఐనా మీ సొంత తమ్ముడు మీకంటే ఎత్తుకు ఎదిగాడు. – మీరు ఓడిపోయినట్లు, ఏదో కోల్పోయినట్లు బాధ పడతారు. మీ అహం గాయపడుతుంది. అప్పుడు మీరేం చేయగలరు ? సులభమైన మార్గం ఏమంటే, అతడు మిమ్మల్ని దాటి ముందుకు వెళ్ళాడన్న విషయాన్ని విస్మరించడం. అందుకు అతడు కూడా మీలాంటి వాడేననీ, మీలాగే సామాన్యుడని నిరూపించడం చాలా సులభమైన మార్గం.
కాని జీసస్ వారితో ఒక ప్రవక్త గౌరవం లేకుండా వుండకూడదు. అతడిని తన దేశంలోనే కాపాడండి, తన ఇంటిలోనే.... అన్నాడు.
                  చాలా గొప్ప అవగాహన. అతి సన్నిహితులే ఎప్పుడూ అపార్ధం చేసుకుంటారు. ఇలా చాలా చాలాసార్లు జరిగింది. ఎందుకని ? మనం పూర్తి వ్యతిరేకంగా వూహించుకుంటాం. జీసస్ గ్రామంలోని వారే, అతడిని ముందుగా అర్ధం చేసికున్నారనుకుంటాం. అందరి కంటే ముందు జీసస్ పరివారం, అతడి బంధువులూ, తల్లిదండ్రులు ముందుగా అతడిని అర్ధం చేసుకున్నారనుకుంటాం. కాని అలా జరగలేదు. ఎందుకని ? దీన్ని అర్ధం చేసుకోవాలంటే మనిషి అహంకారాన్ని చాలా లోతుగా అర్ధం చేసుకోవాలి. మీకు అతి దగ్గరి వారికి, మీరు వారికంటే ముందుకు, పైకి వెళ్ళారని గుర్తించడం, నమ్మడం చాలా కష్టం. ఎవరైనా మీకు సన్నిహితులు కాని వారు, మిమ్మల్ని మించి వెళ్తే, అది మిమ్మల్ని ఏవిధంగానూ ఇబ్బంది పెట్టదు. అతడు మన వాడు కాదు. పోటీ మనస్తత్త్వం ఇక్కడ తలెత్తే అవకాశం లేదు. అదే మీ సొంత తమ్ముడు వెళ్ళి, మీరు వెనకబడి పోతే – మీరిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టారు, ఒకే ఇంట్లో పెరిగారు, ఒకే బడిలో చదివారు. ఐనా మీ సొంత తమ్ముడు మీకంటే ఎత్తుకు ఎదిగాడు. – మీరు ఓడిపోయినట్లు, ఏదో కోల్పోయినట్లు బాధ పడతారు. మీ అహం గాయపడుతుంది. అప్పుడు మీరేం చేయగలరు ? సులభమైన మార్గం ఏమంటే, అతడు మిమ్మల్ని దాటి ముందుకు వెళ్ళాడన్న విషయాన్ని విస్మరించడం. అందుకు అతడు కూడా మీలాంటి వాడేననీ, మీలాగే సామాన్యుడని నిరూపించడం చాలా సులభమైన మార్గం.
                             ఒక ప్రవక్త గౌరవం లేకుండా వుండకూడదు. అతడిని తన దేశంలోనే కాపాడండి, తన ఇంటిలోనే....     నేను మరో వాక్యాన్ని దీనికి జత చేయాలనుకుంటున్నా... అతడి కాలంలో ”..
                             ఇప్పుడు బుద్దుడిని చాలా సులభంగా పూజిస్తారు. ఇక్కడ ఏ సమస్యా లేదు. ఎందుకంటే 25 శతాబ్దాల దూరం వుంది. మీరు మహావీరుని పూజిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా కోటానుకోట్ల ప్రజలు జీసస్ ను ప్రార్ధిస్తూనే వున్నారు. అదే అప్పటి వ్యక్తులు జీసస్ ను శిలువ వేశారు. వారే అతడిని చూసి గాయపడ్డారు. అతడిని విస్మరించారు. ఏం జరిగింది ?  2 వేల సంవత్సరాల దూరం. ఇప్పుడు నీ అహం గాయ పడదు. ఇప్పుడు మీకతనితో ఎలాంటి పోటీ లేదు. అతడు నిజంగానే దేవుని కుమారుడై వుండ వచ్చు. కాని అతను తన సమకాలీనులను గాయ పరిచాడు.
                         ఒకరోజు అతడు, గ్రామస్తులతో మాట్లాడుతున్నాడు. అప్పుడొక వ్యక్తి జీసస్ తో మీరు అబ్రహాంను విశ్వసిస్తారా – యూదు మతాన్ని ఆవిష్కరించిన వాడుఅన్నాడు. అందుకు జీసస్ యూదులు గాయపడే మాట ఒకటి చెప్పాడు. అబ్రహాం ? అబ్రహాం కంటే ముందే నేనున్నాను !” అనిచెప్తే వారు చాలా గాయ పడ్డారు. వారు ఎప్పటికీ క్షమించలేరు.
                        జీసస్ తాను అబ్రహాం కంటే ముందే వున్నానని చెప్పుకున్నాడు._ అతడు వారి గ్రామంలోనే పుట్టిన విషయం వారికి తెలుసు. వారికి అతడు పుట్టిన తేదీ, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, చెల్లెళ్ళు అందరూ తెలుసు. వారంతా ఇంకా అదే కార్ఖానాలో పని చేస్తున్నారు. ఐతే ఈ మనిషి నేను అబ్రహాం కన్నా ముందే వున్న వాడినిఅని చెప్తున్నాడు. విషయం చాలా దూరం వెళ్తోంది. ఈ విషయంలో అతడిని క్షమించే ప్రసక్తే లేదు.కాని అతడు చెప్తున్నవిషయం నిజం. ఎందుకంటే జీసస్ అంటే ఒక వ్యక్తి కాదు. అతడొక వ్యక్తిత్త్వం. ప్రేమలాగా అదొక విశేషం. మీరు అబ్రహాం కంటే ముందే ప్రేమ వుంది, అంటే అప్పుడెవరూ గాయపడరు. ఎందుకంటే ప్రేమ అనేది ఒక వ్యక్తి కాదు. ప్రేమను ఒక వ్యక్తిగా మీరు భావించరు, దాన్ని ఒక విశేషంగా తీసుకుంటారు. జీసస్ అపారమైన ప్రేమకు ప్రతిరూపం. జీసస్ అనంతమైన ఆత్మజ్ఞానానికి, భవిష్యదృష్టికి, ఉధృతమైన గ్రహణ శక్తికి విశేష రూపం. జీసస్ ఒకానొక వ్యక్తిత్త్వ రూపం. ఆ వ్యక్తిత్త్వాన్ని, ఆ విశేషాన్ని, ఆ దైవత్వాన్ని చూడాలంటే, మీరు మీ అహంకారాన్ని విడిచి పెట్టాలి. అప్పుడే మీరు చూడగలరు. లేకపోతే మీ కళ్ళల్లో మీ అహంకారపు పొరలు బరువుగా వుంటాయి. దాంతో మీరు చూడటం అసాధ్యమౌతుంది.  
                                   కొన్నాళ్ళక్రితం నేను, జి.కె.ఛెస్టర్టన్ జీవితాన్ని చదువుతున్నాను. అతడి జీవితమంతా లండన్ లో గడిచిపోయింది. ఒకరోజు అతడు ప్రయాణానికి, చాలా దూర ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. అన్నీ సర్ధుకున్నాడు. అంతాసిద్ధంగా వుంది. అతని స్నేహితుడు ఎక్కడికి వెళుతున్నావు ?” అని అడిగాడు. అందుకు ఛెస్టర్టన్నేను లండన్ వెళ్తిన్నా !” అని చెప్పాడు. అతని స్నేహితుడుహాస్యంతో నన్ను తప్పించుకోకు. నీవేమంటున్నావు? మనం లండన్ లోనే వున్నాం కదా ! మరి నీవెక్కడికి వెళ్తున్నావు?” అన్నాడు. ఛెస్టర్టన్ నేను లండన్ కే వెళ్తున్నా, ప్యేరిస్ గుండా, బాంబేగుండా, టోక్యోగుండా, న్యూయార్క్ గుండా లండన్ వెళ్తన్నా. నేను లండన్ లో చాలా కాలంనుండి వుంటున్నా. అందుకే నా కళ్ళు మసకబారిపోయాయి. నేనసలు లండన్ ఎక్కడుందో, ఎలా వుందో, లండన్ అంటే ఏంటో చూడలేకపోతున్నా..అన్నాడు.
                                        జీసస్ మీ ముందు నిలుచుని వున్నప్పుడు, మీరతడిని చూడలేరు. మీరు వాటికన్ నుండి, రోమ్ నుండి, పోప్ నుండి, చర్చ్ నుండి, మత బోధకులనుండి దూరంగా ప్రయాణించాలి. అప్పుడు మాత్రమే మీరు జీసస్ ఎవరో చూడగలరు. జీసస్ మీకెదురుపడితే, అతడు మిమ్మల్ని గాయపరుస్తాడు. అతని ఉనికి, అతని ఔన్నత్యం, అతని గాఢత, అన్నీ మీపై దాడి చేస్తాయి. మీరు ఓడిపోయినట్టు అనుభూతి చెందుతారు. మీరు జీవించలేదని, మీరు ప్రేమించలేదనీ అనుభూతి చెందుతారు. మీరు శతృవైపోతారు. జీసస్ విషయంలో రెండు అవకాశాలున్నాయి. మీరు అతన్ని అనుసరిస్తారు, లేదంటే అతనికి శతృవౌతారు. మీరు తటస్థంగా వుండలేరు. మీరు నిర్లక్ష్యంగా వుండలేరు. మీ అహాన్ని వదులుకుంటే మీరు అతడిని అనుసరిస్తారు. అప్పుడు మరో అడుగు ముందుకు వెళ్తారు. మీరతనితో కలిసి ప్రవహిస్తారు. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని ప్రయత్నిస్తే, మీరు శతృవౌతారు. మీరు కక్ష కడతారు. మీరతడి నాశనం చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే అతను వుండటమే ప్రమాదకరం, అతన్ని నాశనం చేయాలి అని భావిస్తారు.
                                        జీసస్ ను శిలువ వేసినప్పుడు, యూదుల హృదయాలనుండి పెద్దబరువు దిగిపోయింది. అలా శిలువ వేసే వారు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. అతని ఉనికి ఎలాంటిదంటే, నిరంతరం మీ ఓటమిని జ్ఞాపకం చేస్తూ వుంటుంది. మీరింకా జీవించలేదని అతడు నిరంతరం జ్ఞాపకం చేస్తూవుంటాడు. మీరు లోపల డొల్ల అనీ, మీలో అంతా ఖాళీ అనీ జ్ఞాపకం చేస్తూ వుంటాడు_ మీరింకా సఫలం కాలేదని_:
                                                     సమకాలీనులు అర్ధం చేసుకోలేరు. చాలా అరుదుగా కొందరు, _ కొందరు మాత్రమే ఎందుకంటే, వారు వారి అహాన్ని వదులుకోగలరు. జీసస్ ఏంటో చూడగలరు. అయినా వారి దృష్టి స్థిరంగా వుండదు. వారి దృష్టి కదిలిపోతూ వుంటుంది. వారిలో ఎక్కడో అనుమానం, సంశయం వుంటుంది. ఆయన్ను ఎవరైతే అనుసరించారో, వారూ అనుమానంతోనే అనుసరించారు.
                                      జీసస్ అతని శిష్యులను బలవంతంగా ఓడనెక్కించి అతనికంటె ముందుగా ఆవలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పాడు. తరువాత ... అతను విడిగా కొండమీదికి ప్రార్ధించడానికి వెళ్ళాడు.
                          అతడెప్పుడూ అలాగే చేసేవాడు. అతడు గుంపులోకి, ప్రజా సమూహాలలోకి ఎప్పుడు వెళ్ళినా, తరువాత అతను ఏకాంతంలో ధ్యానం, ప్రార్ధన చేసేవాడు. ఎందుకు? మీరు ధ్యానం చేస్తూవుంటే మీకర్ధమవుతుంది. ఎవరైతే నాతో ధ్యానం చేస్తూ వున్నారో, వారికి అర్ధం అవుతుంది. మీరు ధ్యానం చేయడం మొదలు పెడితే, చాలా సున్నితమైన లక్షణం, చాలా నాజూకైన గుణం మీ చైతన్యం నుండి జన్మిస్తుంది. తెలియని పూవేదో మీలో వికసించడం మొదలుపెడుతుంది. చాలా సున్నితమైంది. మీరు గుంపులోకి ఎప్పుడెళ్ళినా కొంత కోల్పోతారు. మీరు బయటికెళ్ళి, ఇంటికి తిరిగి వచ్చిన ప్రతిసారీ, మీరు వెళ్ళినప్పటి శక్తిలో కోల్పోయి తిరిగి వస్తారు. మీరు కొంత పోగొట్టుకోవడం జరిగింది. ఏదో ఒక దారం తెగిపోవడం జరిగింది. గుంపు మిమ్మల్ని కిందకు లాగుతుంది. దాని ఆకర్షణ దానికి వుంది.                       
                            మీరు ఒకే స్థాయిలో బతుకుతూ వుంటే, అప్పుడు సమస్యే వుండదు. అప్పుడు మీరు కోల్పోయేదేదీ వుండదు. నిజానికి, మీరుగుంపులో బతుకుతూ వుంటే, -గుంపుతో- అదే స్థాయిలో, _ అప్పుడు ఏకాంతంలో మీరు చాలా అసౌకర్యంగా వుంటారు. మీరు మనుషులతో వున్నప్పుడు, మీకు చాలా సుఖంగా, సంతోషంగా వుంటుంది. మీ ఏకాంతం దుఃఖమయమౌతుంది. మీ ఏకాంతం, ఏకాంతం కాదు.  మీ ఒంటరితనంతో మిమ్మల్ని మీరు గుర్తించలేరు. మీరు ఇతరులను పోగొట్టుకుంటారంతే. మీరు ఏకాంతంగా వున్నప్పుడు, నిజంగా నీరు ఏకాంతంగా లేరు. ఎందుకంటే అసలు మీరక్కడ లేరు. అక్కడ కేవలం ఇతరులతో వుండాలన్న కోరిక మాత్రమే వుంది. ఒంటరితనం అంటే అదే. ఎప్పుడూ ఏకాంతానికి, ఒంటరితనానికి మధ్య తేడాని గుర్తుంచుకోండి. ఏకాంతం- అత్యున్నత అనుభవం; ఒంటరితనం- అదొక అగాధం: ఏకాంతం- కాంతి, దీపం; ఒంటరితనం – అది చీకటి, మురుగు. మీరు ఇతరులను కోరుకుంటున్నప్పుడు అది ఒంటరితనం.మిమ్మల్ని మీరు ఆనందంగా అనుభవిస్తున్నప్పుడు అది ఏకాంతం.
                                              జీసస్ నలుగురితో కలిసినప్పుడెల్లా, గుంపులో, ముఖ్యంగా తన స్వంత ఊరు వచ్చినప్పుడు, అతడు తన శిష్యులతో ఆవలి గట్టుకు వెళ్ళమని చెప్పేవాడు. అతడు పూర్తిగా ఏకాంతంలోకి వెళ్ళిపోయేవాడు. అతని శిష్యలు కూడా అతనితో వుండేందుకు వీలు లేదు. ఇలా తరచుగా చేస్తూ వుండేవాడు. అతనికి ఆ కళ తెలుసు. మీరు గుంపులోకి వెళ్ళినప్పుడు, ఆ గుంపు మీకు అంటుకుంటుంది. మీరు ఇతరులను కలిసినప్పుడెల్లా, వారు మిమ్మల్ని మీ కేంద్రంనుండి అవతలికి నెడతారు. మీ సమగ్రతను మీరు తిరిగి పొందేందుకు, మీలో మీరు కేంద్రీకృతమయ్యేందుకు, మీలో మీరు లోతుగా నాటుకునేందుకు మీకు ఏకాంతం కావాలి. మిమ్మల్ని మీరు ఏకాంతంలో వుంచాల్సి వుంటుంది. అప్పుడు మీరు తిరిగి తాజాగా తయారవ్వగలరు.
        .... అతడు విడిగా ప్రార్ధన కోసం కొండ మీదకు వెళ్ళే వాడు. సాయంత్రం అయిపోయింది. అతడింకా అక్కడే ఏకాంతంలో వున్నాడు.        
                                          అతడి ప్రార్ధన గురించి ఏమీ చెప్పలేదు. అతడు అక్కడ ఏం చెశాడు !? వూరికే ప్రార్ధన అన్న మాట అంతే. ఆప్రార్ధన ఏంటో, ఏమీ చెప్పలేదు. ప్రార్ధనా మనస్కులై వుండటమే చాలు. మీరు ఏదైనా చేస్తే అది ప్రార్ధన అవ్వదు. దేవుడి ముందు లేదా ప్రకృతిముందు, మీరు చాలా సున్నితంగా స్వీకరించడానికి సిద్ధంగా వుండాలి. అదే ప్రార్ధన. మీరేదో చెప్పాల్సిన పని లేదు, సరికదా, మీరు వినాలి. ప్రకృతి నీకు ఏం చెప్పాలనుకుంటోంది ? అందుకే మీరు ఎప్పుడైనా ప్రార్ధించడానికి వెళ్తే, ఏదో ఒకటి చెప్పడం మొదలు పెట్టకండి. మీరేం చెప్పదల్చుకున్నదీ, అది దేవుడికి ముందే తెలుసు. అది మూర్ఖత్వం. అది అర్ధం లేనితనం. మీరేం చెప్పగలరు. చెప్పడానికి మీ దగ్గర ఏముంది. అదంతా అర్ధంలేనితనం. అవన్నీ మీ కోర్కెలూ, మీ దుఃఖాలు, అంతరాంతరాల్లో వున్న ఫిర్యాదులు, సాకులు. ఫిర్యాదులతో చేసే ప్రార్ధన, ప్రార్ధన కాదు. నిండయిన కృతజ్ఞతతో చేసేదే ప్రార్ధన. ఏదీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఊరికే నిశ్శబ్ధంగా వుండగలరు. ప్రార్ధన అంటే మాట్లాడటం కాదు. వినడం.
                                            జీసస్ తన ఏకాంతంలోకి వెళ్ళాడు. ప్రార్ధన అంటే అదే. ఏకాంతంలో వుండటం. ఇతరులెవరినీ, ఇంకేమీ అనుభూతి చెందకపోవడం. నీకూ, ప్రకృతికి మద్య మరెవరూ లేకపోవడం. మీరు సున్నితంగా, స్వీకరించేందుకు సిద్ధంగా, హృదయం తెరువబడి వుండటం. దేవుని గాలి మీలో వీస్తూ వుంటే, దానికి ఏదీ అడ్డు తగలకుండా వుండటం. ఇది శుభ్రమౌతున్న అనుభవం. అది మీ ఆత్మను కాంతివంతం చేస్తుంది.అది మనుషులు తమ చుట్టూ పేర్చుకున్న దుమ్మును ఊడ్చేస్తుంది.
                                            దేవునితో వుండటం అంటే, ఏకాంతంలో వుండటం అని అర్ధం. మీరు ఈ విషయాన్ని అపార్ధం చేసుకోగలరు. మీరు దేవుని గురించి ఆలోచిస్తూ వుంటే, అప్పుడు మీరు ఏకాంతంలో వున్నట్టు కాదు. మీరు దేవునితో మాట్లాడుతూ వుంటే, అప్పుడు మీ కల్పనతో ఎవరినో సృష్టించుకున్నారన్నమాట. అప్పుడు మీ దేవుడు ఏమీ చేయడం లేదు. అతడు ఊహల్లో అక్కడ సృష్టించబడ్డాడు. ఆ సృష్టిలో మీరు అందరినీ, అప్పటి వరకూ మీకే తెలియని వారందరినీ చూస్తారు. ఎప్పుడయితే మీరు దేవుడిని తండ్రీఅని పిలిచారో, అప్పుడు మీ నాన్న అక్కడ వుంటాడు. మీలోని ఒక భాగమే అక్కడ కనిపిస్తుంది. మీరు తల్లీఅంటే అక్కడ మీ అమ్మ వుంటుంది. అన్ని మాటలూ మీ మాటలే. మీరేం చెప్పినా అది మీకు సంబంధించిన విషయమే అవుతుంటుంది. ప్రార్ధన అంటే ఏదీ చెప్పకపోవడం. మీరూరికే నిశ్శబ్ధంగా, వినడానికి సిద్ధంగా తెరచి వుండడం. అదే వినడం. అందుకు మీరు దేవుని నమ్మాల్సిన పనేంలేదు. ఎందుకంటే అప్పుడు అది కూడా మీ సృష్టే ఔతుంది. అది మీదే అవుతుంది. ఏకాంతంగా వుండటమే అవసరం. ఏకాంతంగా వుండగలిగితే – వెంటనే ,మీరు దేవుడితో వుంటారు. ఎప్పుడయినా మీరు ఏకాంతంలో వుంటే, మీరు దేవునితో వుంటారు. దేవునితోఅని చెప్తే, మీరు ఇక్కడ, దేవుడు అక్కడ వున్నారనిపిస్తుంది. అందుకే మీరు ఏకాంతంలో వుంటే, మీరిక లేరు, దేవుడే వుంటాడు అని చెప్పడం సమంజసం. అదే ప్రార్ధన.     
                                 ప్రార్ధన అనేది, మీరు ఏకాంతంగా వుండేందుకు సిద్ధపడితే వెలువడే సుగంధం. మీరు ఏకాంతంగా వుంటే అది జనిస్తుంది. మీలో ఒక కమలంలా వికసిస్తుంది. ఆ కమలం మీ చుట్టూ వున్న పరిసరాలతో సమన్వయాన్ని కలిగివుంటుంది. మీరు మాయమవుతారు, మీరు కలిసిపోతారు, కరిగిపోతారు, ఎల్లలు మాయమవుతాయి. మీరిక ఎంతమాత్రం ఒంటరి దీవిలా వుండరు, మీరో ఖండంలో భాగంగా వుంటారు. దేవుడుంటాడు. మీరుండరు.
                         అతడు విడిగా ప్రార్ధన కోసం కొండ మీదికి వెళ్ళాడు, సాయంత్రమైనప్పుడు అతడు ఏకాంతంలో వున్నాడు.
                                 ముందే ఎందుకు లేడు ?  ఏకాంతంలో వుండటానికి పలురకాలుగా సిద్ధమవ్వాలి. ... అతడు గుంపునుండి, ప్రజలనుండి ఏర్పరచుకున్న అభిప్రాయాలను, జ్ఞాపకాలను అన్నింటిని రోజంతా తుడిచేస్తూ వుండివుండాలి. ... అతడా సృతులను ... దుమ్మును ...  వదిలించుకుంటున్నాడు.... సాయంత్రానికి అతడు ఏకాంతంగా వున్నాడు. సాయంత్రమయ్యేసరికి, మరే ఆలోచనా అతడిలో తలెత్తని ఒకానొక ప్రశాంత స్థితికి చేరుకున్నాడు. పొగలేని దీపంలా స్వచ్ఛమైన స్వరూపం అయ్యాడు. సాయంత్రమయ్యే సరికి అతడు పూర్తిగా కేంద్రీకృతమయ్యాడు. సాయంత్రమయ్యే సరికి అతడిలో అతడు గాఢమైన విశ్రాంతిని పొందుతున్నాడు. అతడు తన ఇంటికి చేరుకున్నాడు.
               అయితే ఓడ ఇప్పుడు సముద్ర మధ్యంలో వుంది. శిష్యులు ఆవలి ఒడ్డుకు వెళుతున్నారు. ఓడ అలల మధ్య కొట్టుకుంటోంది, గాలి ప్రతికూలంగా వుండటం వల్ల.
                                     అయితే ఓడ ఇప్పుడు సముద్ర మధ్యంలో వుంది. అలల మధ్య కొట్టుకుంటోంది, గాలి ప్రతికూలంగా వుండటం వల్ల.ఇదొక పోలిక. జీసస్ ఏకాంతంలో వున్నాడు, లేదా జీసస్ దేవుడితో వున్నాడు. జీసస్ కాలానికి, స్థలానికి అతీతంగా వున్నాడు. అయితే శిష్యలు ఒక ఒడ్డునుండి మరొక ఒడ్డుకు దాటుతున్నారు. మరొక ఒడ్డు అంటే,అది దేవుడు, అది అతీతం.
                                       ఇప్పుడు, ఓడ ఇప్పుడు సముద్ర మధ్యంలో వుంది. గాలి ప్రతికూలంగా వుండటం వల్ల, అలల మధ్య కొట్టుకుంటోంది.
                                       లోకంలో గాలి ఎప్పుడూ, ప్రతికూలంగానే వుంటుంది. సముద్రం ఎప్పుడూ అల్లకల్లోలంగానే వుంటుంది. ఎందుకంటే అది కోరికల సముద్రం, అది అజ్ఞాన సముద్రం. గాలి ఎప్పుడూ వ్యతిరేకంగానే వుంటుంది. ఎందుకంటే ఇది పోటీ సముద్రం, ఇది అసూయా సముద్రం, ద్వేష సముద్రం, క్రూర సముద్రం, కోప సముద్రం... గాలి ఎప్పుడూ వ్యతిరేకంగానే వుంటుంది. జీసస్ అతీతంగా, ఏకాంతంగా, కేంద్రీకృతమై వున్నాడు. ఐతే అతని శిష్యలు ఆవలి ఒడ్డును చేరడానికి ప్రయాస పడుతున్నారు.
                               రాత్రి నాలుగవ ఝాములో జీసస్ వారి దగ్గరకు వెళ్ళాడు, సముద్రం మీద నడుచుకుంటూ...
                                         ఇదొక అందమైన పోలిక. క్రిస్టియన్స్ ఈ విషయాన్ని పొరపాటుగా అర్ధం చేసుకున్నారు.  ఎందుకంటే దీన్ని వారు చరిత్రలో జరిగిన విషయంగా భావించారు. జీసస్ నిజంగానే నీటి మీద నడిచాడనుకున్నారు. అతడు మాంత్రికుడు కాడు. అతడు చాలా నిరాడంబరమైన వ్యక్తి. అదొక పోలిక అంతే. చారిత్రక సంఘటన కాదు. క్రిస్టియన్ల వల్ల జీసస్ కూడా అర్ధరహితంగా కనిపిస్తాడు. అతడు సరైన మనుషుల మధ్య లేడు.                            
                                          రాత్రి  నాలుగవ ఝాములో... రాత్రి నాలుగవ ఝాము అంటే అర్ధమేంటి ? – రాత్రి వారు చీకటిలో వున్నప్పుడు, ఆ చీకటి గాఢత, లోతు వున్నప్పుడు.. కటిక చీకటి. – గురువు ఎప్పుడూ, శిష్యుడు రాత్రి నాలుగవ ఝామును.. అత్యంత చీకటి దశను చేరినప్పుడు మాత్రమే సహాయం చేయగలడు. అ చీకటి దశను, మార్మికులంతా, ఆత్మయొక్క చీకటి రాత్రిగా చెప్తారు. జీసస్ ఎస్సేన్స్ అనే మార్మిక గురువుల వద్ద శిక్షణ తీసుకున్నాడు. వారు, దేవుని కోసం చేసే తీర్ధయాత్రలో ప్రతి ఒక్కరూ ఒకానొక చీకటి దశను దాట వలసి వుంటుంది అంటారు. ఆత్మయొక్క చీకటి రాత్రి, ఆ నాల్గవ ఝాము రాత్రిలో లేదా చీకటి దశలో, జీసస్ వారి దగ్గరికి వెళ్ళాడు.
                                          మీరు చేయగలిగినదంతా చేసిన తరువాత, అప్పుడు మాత్రమే మీరు మీ గురువును సహాయం కోసం పిలువగలరు. మీరు బద్దకించి వుంటే, మీరేమీ చేసి వుండకపోతే, అప్పుడు గురువు సహాయం అసాధ్యం. మీయొక్క అత్యంత కటిక చీకటి రాత్రిలో ఇక మీరేమీ చేయలేని పరిస్థితిలో మాత్రమే సహాయం సాధ్యమౌతుంది. మీరు జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు – అప్పుడు మాత్రమే సహాయం సాధ్యమౌతుంది. మీకు మీరు సహాయం చేసుకోగలరని మీరనుకుంటూ వుంటే, లేదా జీవితం ఇంకా మీ నియంత్రణలోనే వుంటే, అప్పుడిక గురువు అవసరం లేదు. ఒకే ఒక్క పరిస్థితిలో, మీరిక ఏమీ చేయలేమని అనుకున్నప్పుడు మీలో గందరగోళం, పరిస్థితి చేయి దాటిపోయింది, పూర్తి నిస్సహాయత – అప్పుడు మాత్రమే గురువు సహాయం సాధ్యం. 
                                     రాత్రి నాల్గవ ఝాములో జీసస్ వారి వద్దకు వెళ్ళాడు, సముద్రంపై నడుస్తూ ....
                                      నిజమే, జీసస్ సముద్రం మీద నడుస్తున్నాడు. కోర్కెల సముద్రం, అజ్ఞాన సముద్రం, అహంకార సముద్రం...  మనం సామెతలను, ఉపమానాలను అర్ధం చేసుకుంటాం. గొప్ప జెన్ గురువులలో ఒకరైన తిస్-ఛీ ఇలా చెప్పారు.నీవు నీటి పై నడువు. కాని నీటిని నీ కాళ్ళకు అంటనీయకు.ఎవరైనా ఈ లోకంలో జీవించాలి తప్ప, లోకంగా మారకూడదు – ఈ ప్రపంచంలో నడవాలి. జీసస్ తప్పించుకు పారిపోయే వ్యక్తి కాడు. అతడు ప్రపంచాన్ని వదిలి పారిపోవడం లేదు. అతడు సముద్రం మీద నడుస్తున్నాడు. అతడు ఈ లోకంలోనే జీవిస్తాడు. అయితే నీటిని పాదాలకు అంటనీయడు. దీన్నే మనం తామర పూవులా జీవించండి అంటాం. అది నీటిలోనే వుంటుంది, కాని నీరు తామర పూవును అంట లేదు.- మంచు బిందువుచు కూడా దాని మీద వుండవచ్చు గాక, ఐతే అవి ఎప్పుడూ దాన్ని అంటుకోలేవు. అక్కడ దూరం వుంటుంది, తామర పూవులా మారడం కోసం- ఇదే ఉపమానానికి అర్ధం.              
                                    రాత్రి నాల్గవ ఝాములో జీసస్ వారి వద్దకు వెళ్ళాడు, సముద్రం మీద నడుచుకుంటూ ....                                     
                                     ఇది మనిషి మానసిక సంఘర్షణను తెలిపే ఉపమానం. మనిషలోని మథనం. మనిషిలేని గందరగోళం. మనిషిలో ప్రతికూలంగా వీచే గాలులు. మనిషి మరో ఒడ్డుకు చేరేందుకు చేసే అంతర్గత యుద్ధం. దీనికీ గాలికీ’ ‘సముద్రానికీ ఏ సంబంధం లేదు. ఇవన్నీ అంతర్గత ప్రపంచానికి సంబంధించినవి. ఇవి బయట జరిగిన సంఘటనలు కావు. ఇవన్నీ మనిషి ఆత్మికోన్నతిని సాధించే క్రమంలో ఎదురయ్యే సందర్భాలు.   
                                   శిష్యులు, అతడు సముద్రం మీద నడవడాన్ని చూసినప్పుడు, వారు వొణికిపోయారు. అది దెయ్యం అనుకున్నారు. వారు భయంతో ఏడ్చారు.
                                     ఇది నా అనుభవంకూడా. చాలాసార్లు ఇలా జరుగింది. అందుకే, ఇది ఒక ఉపమానం అని నేను చెప్తాను.
నాతో పని చేస్తన్నవారు, ఎదుగుతున్న వారు, వారి ఆత్మయొక్క చీకటి రాత్రిలో, నాసహాయం అవసరమౌతుంది. అప్పుడు నేను అతడి దగ్గరకు వెళ్తాను. ఐతే అతను వణకిపోతాడు. భయపడతాడు. చాలాసార్లు నా శిష్యులకు చెప్తాను,నేను వస్తే, భయపడకండిఅని. అప్పుడు వాళ్ళు నవ్వుతారు. నేనేదో నవ్వులాటకు చెప్తున్నానుకుంటారు. ఐతే నేను వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, వారు భయపడి పోతారు. నేనొచ్చిన విషయాన్ని నమ్మలేరు. ఎందుకంటే అది వారు ఆశించని, ఊహించని విషయం.      
                                      వారు భయంతో ఏడ్చారు. మీ గురువుతో, మీరు కూడా భయంతోనే సంబంధంలో వుంటారు. ప్రేమతో కాదు. ఎందుకంటే ప్రేమ విశ్వసిస్తుంది. భయం అనుమానిస్తుంది. ప్రేమ అంటే విశ్వాసం, భయం అంటే అవిశ్వాసం. ఆక్షణంలో శిష్యులు, వారి విశ్వాసం కేవలం ఉపరితలం మీదే వున్నట్టు ప్రకటించారు. వారి అంతర్గత ప్రపంచంలోకి జీసస్ వస్తే, నమ్మలేకపోయారు, వారు విశ్వసించలేకపోయారు.
                               వారు భయంతో ఏడ్చారు. అయితే జీసస్ సూటిగా వారితో ఇలా చెప్పాడు. చక్కగా నవ్వుతూ వుండండి. ఇక్కడుంది నేనే. భయపడకుండా వుండండి.
                                అది నేనే, భయపడకండి, చక్కగా నవ్వుతూ వుండండి.ఐతే నవ్వుతూ ఎలా వుండాలో మీరు మర్చిపోయారు. సంతోషంగా ఎలా వుండాలో మీరు మర్చిపోయారు. ఆనందంయొక్క రుచిని మీరు మర్చిపోయారు. మీకు కేవలం ఆవేదన తెలుసు. దుఃఖం మాత్రమే తెలుసు మీకు. మీరు నరకాన్ని మాత్రమే అర్ధం చేసుకుంటారు. స్వర్గం మీకు కలలా కనిపిస్తుంది. అది మరో ప్రపంచంలా కనిపిస్తుంది. అందుకే అది ఆశ ఔతుంది. సత్యంలా వాస్తవం వుండదు.      
                                  జీసస్చక్కగా నవివుతూ వుండండి. సంతోషంగా వుండండి! నేను మీ దగ్గరకు వచ్చాను. మీరేమో భయంతో ఏడుస్తున్నారు. నాట్యం చేయండి. పండగ చేసుకోండి. అది నేనే. భయపడకుండా వుండండి. మీరు నాట్యం చేయలేకపోతే, మీరు పండగ చేసుకోలేకపోతే, మీరు పాట పాడలేకపోతే ఆహ్వానిస్తూ, - అప్పుడు కనీసం భయపడకుండా వుండండి. చక్కటి నవ్వులా వుండండి అన్నాడు. దీన్ని అర్ధం చేసుకోవాల్సి వుంది.                      
                                   ఎప్పుడైతే శిష్యుడు, తన అతి చీకటి రాత్రిలో వుంటాడో, అప్పుడు అతడు గురువు శక్తిని తన వేపుకి ఆకర్షించ గలిగే సామర్ధ్యాన్ని కలిగివుంటాడు. అతడు దాన్ని సంపాదించాడు, ఐతే అతడు ఆనందంగా వున్నప్పుడు మాత్రమే గురువుయొక్క శక్తిని పొందగలడు. అతడు చాలా శ్రమించాడు. అతడు తన పూర్తి శక్తితో పనిచేస్తూ వున్నప్పుడు, పూర్తి నిబద్దతతో లీనమై ధ్యానం చేసినప్పుడు, అప్పుడు- అతడు గురువే తన వద్దకు రావాల్సిన సామర్ధ్యాన్ని సంపాదించుకుంటాడు. ఐతే ఇది మాత్రమే సరిపోదు. అతడు భయంతో వుంటే, అతడు కోల్పోతాడు. గురువు అక్కడ వున్నప్పుడు, అతడు భయపడితే, అతడికి గురువు సహాయం కావాలి. కాని భయం వల్ల గురువుతో సంబంధం అసాధ్యమవుతుంది. సంతోషంగా వుండండి. మీరు సంతోషంగా స్వీకరించగలిగిన స్థితిలో ఆహ్వానిస్తూ వుంటేనే మీరు శక్తిని స్వీకరించగలరు. ప్రియురాలికోసం ఎదురు చూసే, ప్రియుడిలా, పెండ్లి కూతురికోసం వేచివున్న వరుడిలా – అంతాఎదురు చూపే- నీ పూర్తి శక్తంతా ఎదురు చూపే ఐనట్టు చక్కటి నవ్వులా వుండండి. ఎందుకంటే మీరు ఆనందంగా లేకపోతే, గురువు పెద్దగా మీకు సహాయకారి కాలేడు. ఆయన మిమ్మల్ని పట్టుకోవడానికి అక్కడ నిలబడి వుంటాడు. మీరు ఆనందంగా లేకపోతే మీ చేతులు ఆయనకు అందకుండా పోతాయి.                                                                           
    రెండు విషయాలు :   
                                          మొదట శిష్యుడు పూర్తిగా, పూర్తి శక్తితో పనిచేయాలి. ఏవిషయంలోనూ తగ్గకుండా, తన పూర్తి శక్తిని ఫణంగా పెట్టాలి. నిఖార్సైన నిబద్ధత వుండాలి. మీరు పర్యవసానం గురించి భయంలేకుండా, ఫలితాన్ని గరించి ఆశలేకుండా పని చేయాలి. మీరు దూకాలి. మీరు దూకేందుకు సాహసించాలి. గురువు ఒక సవాలు అయితే శిష్యుడు ఒక సాహసం. గురువు పిలుపు- శిష్యుడు చీకటిలోకి వెళ్ళేందుకు ధైర్యం చేసేవాడు. పిలుపు విన్నాడు, ఐతే దారి ఏదో అతడికి సరీగా తెలీదు. ఎందుకంటే అక్కడంతా చీకటి. కాని అతడు పిలుపు విన్నాడు. అతడు వెతకడం, నవ్వడం మొదలు పెట్టాడు. మీరు చేయగలిగినంతా చేసినప్పుడు, ఆ తరువాత ఇక నీవేమీ చేయలేని స్థితికి చేరినప్పుడు, అప్పుడు, వెంటనే గురువు సహాయం అందుబాటులోకి వస్తుంది. ఐతే  అప్పడూ మీరు కోల్పోయే అవకాశం వుంది. చాలాసార్లు మీరా సామర్ధ్యాన్ని సంపాదించారు. తిరిగి కోల్పోయారు. ఎందుకంటే మీరు సంతోషంగా, పండగ చేసుకుంటూ వుండకపోతే ఆ శక్తి ప్రవాహం తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. మంచి యజమానిలా వుండండి. ఆనందంగా వుండండి. అతిథి తలుపు దగ్గరికి వచ్చాడు. అతడిని ప్రేమతో, కృతజ్ఞతతో ఆహ్వానించండి.
                              అందుకు పీటర్ సమాధానంగా అడిగాడు.
                                 స్వామీ ! అది నీవే ఐతే నన్ను, నీటిపై నడుస్తూ చేరేలా చేయి.
పన్నెండుమంది శిష్యులలో ఒక్కడు మాత్రమే, కేవలం ఒక్కడు – అతడు కూడా పూర్తి ఖచ్చితం కాదు. ఈ పీటరే క్రిస్టియన్ చర్చిలకు పునాది రాయి అయ్యాడు. అతడు అనుమానించాడు, సంశయించాడు, నిరూపించమని అడిగాడు. కనీసం అతడు ఆ మాత్రమయినా చేశాడు. మిగిలిన 11మంది భయంతో వణికిపోతూ వుండిపోయారు.పీటర్ అంటే రాయి అని అర్ధం. అతడి అసలు పేరు సైమన్ఐతే జీసస్ అతడిని పీటర్అనిపిలిచాడు. అంటే రాయిఅని.
                                               స్వామీ ! అది నీవే ఐతే….
                                           ‘ ఐతే వుందక్కడ, అంత గొప్ప శిష్యుడిలో కూడా. అతడికి సాక్ష్యం అవసరమైంది. ఇది దురదృష్టకరమైన విషయాలలో ఒకటి. కాని అదలాగే వుంది. మీకు అప్పటికే కావలసినన్ని సాక్ష్యాలు వున్నప్పటికీ, మీ మనస్సుకు సంతృప్తి లేదు. అది మళ్ళీ, మళ్ళీ అడుగుతూనే  వుంటుంది. జీసస్ చుట్టూ ఎన్నో అద్భుతాలు జరగడాన్ని చూశారు. అతని గురించి అంతకు ముందే విన్నారు. దేవుని రాజ్యానికై అతడిని అనుసరించారు. అయినా పీటర్ అది నీవే ఐతే, నేను నీ కాళ్ళ దగ్గరకు నీటిపై నడిచి రాగలిగేలా చేయి. అప్పుడది సాక్ష్యం అవుతుంది. నీవు నిజంగా నీవే ఐతే, ఈ అద్భుతాన్ని చేయి. నీటిపై నడుస్తూ నీ దగ్గరకు రాగలిగేలా చేయి. నేను నీటిపై నడవగలిగితే, అప్పుడు- అప్పుడు మాత్రమే అది నీవేనని నేను నమ్ముతాను.
                                     అప్పుడు, ఆయన రాఅన్నాడు. పీటర్ ఎప్పుడైతే ఓడనుండి బైటకు వచ్చాడో, అప్పుడతడు నీటిపై నడిచాడు, జీసస్ దగ్గరకు వెళ్ళడం కోసం.                   
                                                   గురువును వింటే, మీరు నీటి మీద నడవగలరు. ఈ ప్రపంచం సముద్రం. మీరు గురును వింటే, మీకా కిటుకు వశమవుతుంది. ఆ కిటుకు, రా అన్న పదంలా సులభమైంది. దానికే నియమాలు వుండవు. జీసస్ ఏమీ చెప్పలేదు. అతడు ఊరికే రా అన్నాడు. పీటర్ నడిచాడు, నీటి మీద నడిచాడు.
                                     ... కాని గాలి సుళ్ళు తిరగడాన్ని అతడు చూసినప్పుడు అతడు భయపడ్డాడు.
                                    నీటి మీద నడుస్తూ కూడా – అతడు ఇప్పుడు నీటి మీద నడుస్తున్నాడు’ – ఐనా అనుమానం. ఇలాంటి సమస్యలను నేను ప్రతిరోజు ఎదుర్కొంటూ వున్నాను. మనుషులు నా దగ్గరికి వచ్చి అంతా హాయైన నిశ్శబ్ధంలా మారిపోయింది. ధ్యానం ప్రాప్తించింది, కోపం పోయింది, శృగారం గురించిన చింతలేదు. అసలది నాకు సంబంధించిన విషయమేనా అని అనుమానం కలిగేంత దూరం వెళ్ళిపోయింది. ఐతే నిజమేనా లేక నా కల్పనా ?” అని అడుగుతాను. వాళ్ళే నా దగ్గరకు వచ్చిమా స్నేహితులు, జాగ్రత్త ఈ వ్యక్తి  మిమ్మల్ని హిప్నటైజ్  చేస్తాడుఅంటున్నారు.అని చెప్తారు. వారు శాంతిని పొందారు. నిశ్శబ్ధాన్ని అనుభవిస్తున్నారు. వారి కోపం పోయింది. శృంగార వాంఛ తగ్గిపోయింది. శృగారం వారి అధికారిగా కాకుండా, బానిసగా తయారయింది. అది వారిష్టం. అయినా వారు అనుమానంతో వున్నారు. – వారిలో సంశయం తలెత్తుతోంది. నేను ఊహించుకుంటున్నానా ! నన్ను హిప్నటైజ్ చేశారా ! ఇలా కలగంటున్నానా!?” వారికే ఎన్నో అనుభవాలు ఐన తర్వాత కూడా నమ్మలేరు. ఇక ఇతరుల అనుభవాలను ఎలా నమ్మగలరు. పీటర్ నడిచాడు, కాని తనను తానే నమ్మలేక పోయాడు. అతడు బహుశా ఇది కలేమో ! లేదా ఈ మనిషి నా మీద మంత్ర ప్రయోగం చేశాడేమో !” అని అనుకుని వుంటాడు.              
                                              ...అయితే, గాలి సుళ్ళు తిరగడాన్ని  చూసినప్పుడు అతడు భయపడ్డాడు. మునిగిపోవడం మొదలు పెట్టాడు. అతను ఏడ్చాడు. స్వామీ ! నన్ను రక్షించు అన్నాడు.
                                                     అతడు భయపడిన క్షణంలో, మునిగిపోవడం మొదలు పెట్టాడు... ఎందుకంటే అవిశ్వాసం. నమ్మకమే మిమ్మల్ని రక్షించేది. ఒక్కసారి భయం కలిగిందా, మీరు మునిగిపోవడం మొదలు పెడతారు. అంతా మీ మీదే ఆధారపడి వుంటుంది. మీకు విశ్వాసం వుంటే ఈ భవ సాగరాన్ని సులభంగా నడుస్తూ దాటగలరు.- మునగడం అసాధ్యం. కనీసం నీరుకూడా మీ పాదాలను తాకదు. మీ పాదాలు కమలాలు అవుతాయి. కాని మీరు భయపడినట్లైతే, వెంటనే ఒక్క క్షణంకూడా ఆగరు. మీరు మునిగిపోతారు. అనుమానం అనేది మునిగిపోవడం. విశ్వాసం రక్షిస్తుంది. అనుమానం ముంచేస్తుంది.     
                                                       ...అయితే, గాలి సుళ్ళు తిరగడాన్ని  చూసినప్పుడు అతడు భయపడ్డాడు. మునిగిపోవడం మొదలు పెట్టాడు. అతను ఏడ్చాడు. స్వామీ ! నన్ను రక్షించు అన్నాడు. అప్పుడు వెంటనే జీసస్ తన చేతిని ముందుకు చాచాడు. అతడిని పట్టుకున్నాడు. ఓ స్వల్పమైన విశ్వాసం కలవాడా ! నీ అవిశ్వాసం ఎక్కడినుండి వచ్చింది ?
                                                              నీ అనుమానం ఎక్కడినుండి వచ్చింది?, ఎందుకు!?, నీఅంతట నీవే నడుస్తున్నావు కదా! ఐనా నీవు విశ్వసించ లేక పోతున్నావెందుకు ? ఓ స్వల్పమైన విశ్వాసం కలవాడా- నీ విశ్వాసం అతి తక్కువ. అయినా ఆ అతి తక్కవ విశ్వాసమే అద్భుతాలు సృష్టించగలదు. పీటర్ నడిచాడు, ఎంతో దూరంకాదు. కొన్ని అడుగులు.
                                              కాని నీటి మీద కొన్ని అడుగులు నడవడమే చాలు. మీరు ఒక్క అడుగు నడవగలిగితే,_ సముద్రమంతా నడవగలరు. ఓ స్వల్పమైన విశ్వాసం కలవాడా....  విశ్వసం అతి తక్కువే అయినా, అద్భుతం జరిగింది. అతి చిన్న విశ్వాసంతోనే, మీరు గొప్ప ఆథ్యాత్మిక అనుభవాన్ని పొందగలరు. అలాంటప్పుడు అచంచలమైన పూర్తి విశ్వాసం వుంటే అప్పుడు చెప్పాల్సిందేముంది. పూర్తి విశ్వాసం వుంటే వంటనే విత్తనం చెట్టవుతుంది. అక్కడ ఒక్క క్షణం కూడా ఆలస్యం వుండదు. ఆలస్యం తక్కువ విశ్వాసం వుండటం వల్లే జరుగుతుంది. మీరు ఈక్షణంలో నమ్మకపోవటం వల్లే ఆలస్యం జరుగుతుంది. మీరీ క్షణంలో విశ్వసిస్తే ప్రపంచం మాయమౌతుంది. కేవలం భగవంతుడుంటాడు. సముద్రం మాయమౌతుంది. మీరు నేల మీద వుంటారు. ఎందికంటే ఈ ప్రపంచం ఒక కలసాంటిదే తప్ప, మరేమీ కాదు. అనుమానం వల్ల కల కొనసాగుతుంది. విశ్వాసం వల్ల అకస్మాత్తుగా మీరు మేల్కొంటారు.

        fffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffff  
   fffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffff                                      

No comments:

Post a Comment