Wednesday 30 October 2013

TELUGU BOOKS


  


 యండమూరి వీరేంద్రనాధ్ రచనలు

                      







    క్రిస్టియానిటీలో చాలా కొరత ఉంది... జీసస్ ను గురించి కూడా దానికి తెలీదు. జీసస్ పూర్తి జీవితం తెలీదు.  అతను ఎలాంటి సాధనలు చేశాడు, ఎలా ధ్యానం చేశాడు అనే విషయం తెలియదు. క్రీస్తు చరిత్ర రాసిన అపోస్తలులు చాలా మామూలు మనషులు. వారికి ఈ విషయాలేవీ తెలీదు.
         జీసస్ శిలువ మీద ఉన్నప్పుడు ఒక సైనికుడు, అతడి శరీరాన్ని పొడిచాడు. అప్పుడు రక్తం, నీరు అతడి శరీరం నుండి కారింది. ఈ సంఘటన సెయింట్ జాన్ గాస్పెల్, 19 వ అధ్యాయం, 34 వ వచనంలో చెప్పబడింది.  : కాని సైనికులలో ఒకరు శూలంతో అతడిని ఒక పక్క గుచ్చాడు, అప్పుడు అక్కడి నుండి రక్తము, నీరు బయటికి వచ్చింది. : ఈ సంఘటన వల్ల జీసస్ శిలువ మీద జీవించే ఉన్నాడన్న విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే చనిపోయిన శరీరం నుండి రక్తం ప్రవహించదు.    

 అమృతం కురిసిన రాత్రి : దేవరకొండ బాల గంగాధర తిలక్ కవితలు

ఆకాశం మీద అప్సరసలు
ఒయ్యారంగా పరుగులెత్తుతున్నారు
వారి పాదాల తారా మంజీరాలు
ఘల్లు ఘల్లని మ్రోగుతున్నాయి
వారి ధమ్మిల్లాల పారిజాతాలు
గుత్తులు గుత్తులై వేలాడుతున్నాయి
వారు పృథు వక్షోజ నితంబ భారలై
యౌవన ధనుస్సుల్లా వంగిపోతున్నారు.

No comments:

Post a Comment