Friday 26 April 2013

తీవ్ర పరిస్థితుల్లోనూ ఐన్‌స్టీన్ సిద్ధాంతం కరక్టే!

వాషింగ్టన్: విశ్వంలో గురుత్వాకర్షణ శక్తిని వివరిస్తూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ వర్తిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమికి సుమారు 7 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘పీఎస్‌ఆర్ జే0348+0432’ అనే ద్వినక్షత్ర వ్యవస్థపై జరిపిన అధ్యయనంలో ఈ మేరకు ఐన్‌స్టీన్ సిద్ధాంతం తీవ్ర పరిస్థితుల్లోనూ కరక్టేనని గుర్తించారు. పీఎస్‌ఆర్ ద్వినక్షత్ర వ్యవస్థలో మన సూర్యుడి కంటే రెండు రెట్లు పెద్దగా ఉన్న నక్షత్రం, దానికి సమీపంలోని మరో చిన్న నక్షత్రం ప్రతి రెండున్నర గంటలకోసారి పరస్పరం ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నాయని అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌కు చెందిన గ్రీన్ బ్యాంక్ టెలిస్కోపు, ఇతర టెలిస్కోపుల ద్వారా గుర్తించారు. తర్వాత వీటిపై అధ్యయనంలో వెల్లడైన ఫలితాలను బట్టి... ఈ వ్యవస్థకు కూడా ఐన్‌స్టీన్ సిద్ధాంతం వర్తిస్తుందని కనుగొన్నారు. ఐన్‌స్టీన్ 1915లో ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం ఇలాంటి తీవ్ర ప్రతి కూల పరిస్థితులకు వర్తించదని కొందరు శాస్త్రవేత్తలు ఇంతకుముందు ఊహిం చారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ సిద్ధాంతం వర్తిస్తుందని తాజాగా గుర్తిం చారు. దీంతో ఐన్‌స్టీన్ సిద్ధాంతానికి ఇప్పటిదాకా ఎదురైన అతిపెద్ద పరీక్ష ఇదేన ని, ఈ పరీక్షనూ ఆ సిద్ధాంతం గట్టెక్కిందని జర్మనీ పరిశోధకులు అంటున్నారు. 

No comments:

Post a Comment